జమ్మికుంటలో ఎరుకల జాతి ఆత్మగౌరవ పోరాట జెండా ఆవిష్కరణ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణ పరిధి 16వ వార్డులోని ఎస్టీ కాలనీలో ఆదివారం ఎరుకల కులస్తుల సమక్షంలో ఎరుకల జాతి ప్రజల ఆత్మగౌరవ పోరాట జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ,1952 ఆగస్టు 31న క్రిమినల్ ట్రైబ్స్ (CT Act) రద్దు చేయబడిన దినాన్ని పురస్కరించుకొని ఈ జెండా ఆవిష్కరణ చేపట్టినట్లు తెలిపారు. బ్రిటిష్ పాలకులు ఎరుకల తెగల అడవి సంపదను దోచుకోవడానికి కుట్రలు పన్ని, వారి ప్రతిఘటనను అణచివేయడానికి ఈ చట్టాన్ని అమలు […]
జమ్మికుంటలో గణేష్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారుల సూచనలు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్ ఆగస్టు 26:రేపటి నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలో అధికారులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఈ రోజు జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్. రామకృష్ణ, మండల తహసీల్దార్ (ఎం.ఆర్.వో), మున్సిపాలిటీ సిబ్బంది,ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు సమావేశమై ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద విద్యుత్ వైరింగ్‌ను తప్పనిసరిగా లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్ ద్వారానే చేయాలని స్పష్టం చేశారు. వైరింగ్‌లో […]
తప్పుడు పత్రాలతో అధికారులను మోసం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తప్పుడు పత్రాలు సృష్టిస్తూ అధికారులను మోసం చేస్తూ దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తున్న భూ కబ్జాదారులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్యఅన్నారు .మంగళవారం జమ్మికుంట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తనను మానసికంగా హింసిస్తున్నారని, ప్రజల్లో తనను ఒక తప్పుడు వ్యక్తిగా సూచిస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .దళితుడైన తనను కొంతమంది కావాలని […]
రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ

వీణవంక/ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ఎక్కడ జరిగిందో వివరించాలని వీణవంక మండల కేంద్రానికి చెందిన రైతు నాయకుడు నీల పున్నం చెందర్ అన్నారు. గడిచిన సంవత్సర కాలం నుంచి ఇప్పటివరకు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికి కూడా రుణమాఫీ కాక లబోదిబో అంటున్న రైతులు, ఎవరికి రుణమాఫీ చేశారు. మేము రైతులం కాదా మాకెందుకు రుణమాఫీ చేయలేదు.. ఇప్పటివరకు మా గురించి కాంగ్రెస్ […]
42శాతం రిజర్వేషన్లు అమలు అందరి బాధ్యత

హన్మకొండ/ధనాధన్ న్యూస్: ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ ఆగదని, ఆర్డినెన్స్ తెచ్చుటకు విపక్షాలు సహకరించాలని ఫూలే ఆశయ సాధన సమితి (పాస్) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సంగని మల్లేశ్వర్ అన్నారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీ లోని జర్నలిజం విభాగంలో ఫూలే ఆశయ సాధన సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ తాడూరి శాస్త్రి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా సమావేశం జరిగింది. దీనికి పాస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ ముఖ్యఅతిధిగా […]
ప్రవేట్ పాఠశాల యాజమాన్యం,బుక్ స్టాల్స్ యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలపై బుక్ స్టాల్ యాజమాన్యాలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్ డిఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మికుంట పట్టణం లో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూల్స్ సిండికేట్ అయ్యారని బుక్ స్టాల్స్ యజమానియాలతో ఒప్పందం చేసుకున్నారనీ బుక్ స్టాల్స్ యాజమాన్యాల దగ్గరికి వెళ్లి తక్కువ ధర ఉన్న పుస్తకాలకు ఎక్కువ ధరలకు విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారని […]
నూజివీడు సీడ్స్ వారి నూతన విత్తన రకాల విడుదల

కరీంనగర్/ధనాధన్ న్యూస్: నూజివీడు సీడ్స్ విజేత పత్తి మరియు సంధ్య వరి విత్తన సన్నరకాలతోనే అధిక లాభాలు చేకూరుతుందని సీనియర్ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్ లో ఆహా హోటల్లో విజేత పత్తి విత్తనం మరియు సంధ్య వరి విత్తనం సన్న రకాల ప్రోడక్ట్ లాంచింగ్ ప్రోగ్రాం డిస్ట్రిబ్యూటర్స్ మరియు డీలర్స్ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగినది .ఈ సందర్భంగా సీనియర్ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నూజివీడు 50 వసంతాలు పూర్తిచేసుకుని […]
యాదవ చైతన్య వేదిక కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కేశబోయిన అశోక్ యాదవ్ నియామకం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన కేశబోయిన అశోక్ యాదవ్ జిల్లాలో యాదవులు, బి.సి.ల సామాజిక, రాజకీయ చైతన్యం కోసం వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నందున వారి సేవలను గుర్తించి ఆయనను యాదవ చైతన్య వేదిక కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ యాదవ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గోర్ల అయిలేశ్ యాదవ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసారు.ఈ సందర్భంగా కేశబోయిన అశోక్ యాదవ్ మాట్లాడుతూ నాపై నమ్మకముతో […]
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో జమ్మికుంట వినాయక గార్డెన్స్ లో ఈరోజు శాంతి చర్చలను కోరుతూ సదస్సు జరిగింది. శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ సభలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు విద్యా, ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు, శాంతికాముకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఉద్ఘటించారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ […]
పార్టీ కార్యకర్తలను కాపడుకుంటాం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకి సముచిత స్థానం కల్పిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా వచ్చిన నమిండ్ల శ్రీనివాస్,రఘునాథ్ రెడ్డి తెలిపారు.శనివారం రోజున హుజురాబాద్ పట్టణంలోని సాయి రూప గార్డెన్స్ లో హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ నిర్మాణ,సంస్థాగత సమావేశానికి వారు హాజరయ్యారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్,పీసీసీ అధ్యక్షుడు […]
