పోలంపల్లి గ్రామంలో ఎస్‌బీఐ సంజీవని క్లినిక్ ఆన్ వీల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం

మహముత్తారం/ధనాధన్ న్యూస్, జూలై 19: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పోలంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆదివారం రామ్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్‌బీఐ సంజీవని క్లినిక్ ఆన్ వీల్స్ ప్రాజెక్టు ద్వారా ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో సుమారు 200 మంది గ్రామస్తులు పాల్గొని ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు అవసరమైన వారికి హిమోగ్లోబిన్ (HB), గ్రూప్ రాండమ్ బ్లడ్ షుగర్ […]
మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సతీష్ మాదిగ

హైదరాబాద్,జూలై 8 (ధనాధన్ న్యూస్): పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, దళిత ఉద్యమ నాయకుడు కు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా ప్రచార కార్యదర్శి, మాజీ ఎమ్మార్పీఎస్ శంకరపట్నం మండల శాఖ అధ్యక్షుడు అంతడుపుల సతీష్ మాదిగ మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మందకృష్ణ మాదిగ నివాసానికి వెళ్లిన సతీష్ మాదిగ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సతీష్ మాదిగ మాట్లాడుతూ, […]
ఇల్లందకుంటలో సీఎం,మంత్రులు, వొడితల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: ఇల్లందకుంట మండల కేంద్రంలో నూతన తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షుడు సత్యం, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నూతన తహశీల్దార్ కార్యాలయ […]
నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు

జగిత్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 28: ఐదేళ్లలోపు చిన్నారులను పోలియో రహిత భారత నిర్మాణంలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతేమాలవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ, దేశం నుంచి పోలియో […]
‘చాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 27: జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి బోగోజి ముఖేష్ కన్నా ఆధ్వర్యంలో నిర్వహించిన “చాత్రోన్ కీ గూంజ్” కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశంలోని విద్యార్థులు, యువత, విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ […]
హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 23: రాష్ట్రంలోని అన్ని రంగాల హమాలి కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం బొమ్మకల్ సిమెంట్ గోదాముల హమాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని సిమెంట్ గోదాముల్లో పనిచేస్తున్న హమాలి కార్మికులకు పని భద్రత […]
మానవత్వం చాటుకున్న రాయికల్ 2004-05 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ మిత్రులు

సైదాపూర్/ధనాధన్ న్యూస్,జూన్ 21: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన 2004-05 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ విద్యార్థులు తమ సహాధ్యాయి మాచర్ల నాగరాజుకు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.రాయికల్ గ్రామానికి చెందిన మాచర్ల నాగరాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదే సమయంలో ఆయన తండ్రి మాచర్ల కొమురయ్య గత 20 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న 2004-05 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ మిత్రులు […]
ఆకునూరు పాఠశాలలో స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛ భారత్ కార్యక్రమం

సైదాపూర్/ధనాధన్ న్యూస్,జూన్ 13: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సైదాపూర్ మండలంలోని ఆకునూరు ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం “స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛ భారత్” కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా హుస్నాబాద్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, డ్రైనేజీలను శుభ్రపరిచి, చెత్తాచెదారం, కలుపు మొక్కలను తొలగించినట్లు పేర్కొన్నారు. […]
మృగశిర కార్తిలో చేపల కోసం నిరీక్షణ.. నిరాశతో వెనుదిరిగిన ప్రజలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 8: సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో మృగశిర కార్తి సందర్భంగా సోమవారం గ్రామ చెరువులో చేపల వేట నిర్వహించారు. చేపలు లభిస్తాయనే ఆశతో ఆకునూరు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు చెరువు వద్దకు తరలివచ్చారు. అయితే ఆశించిన మేర చేపలు దొరకకపోవడంతో దాదాపు 500 మందికి పైగా ప్రజలు నిరాశతో, ఆగ్రహంతో వెనుదిరిగారు.ప్రజలు మాట్లాడుతూ ఉదయం నుంచే చెరువు వద్ద వేచి ఉన్నప్పటికీ సాయంత్రం నాలుగు గంటల […]
జమ్మికుంట ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 7: జమ్మికుంట మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం జమ్మికుంటలోని స్థానిక సాయి గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిరి రవి ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తుమ్మ చందు అధ్యక్షతన ఎండి ముస్తఫా అధ్యక్షుడిగా, ఎర్రం రాజు, ఎండి అజార్ ఉపాధ్యక్షులుగా, దొడ్డే […]
