పోచమ్మ తల్లి దేవాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దంపతుల ప్రత్యేక పూజలు

జగిత్యాల, ధనాధన్ న్యూస్: పట్టణంలోని పురాణిపేట శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయం 64వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ లోకమాత పోచమ్మ తల్లి ఆశీస్సులతో జగిత్యాల పట్టణ ప్రజలందరూ సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు సమిండ్ల వాణి శ్రీనివాస్ […]
నర్సింగాపూర్‌లో 22 ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

జగిత్యాల రూరల్, ధనాధన్ న్యూస్: ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు నర్సింగాపూర్ గ్రామంలో 22 ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ కుక్కునూరు వంశీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాలు, రహదారులను కవర్ చేసేలా సీసీ కెమెరాలను అమర్చారు. కెమెరాల ప్రారంభ కార్యక్రమానికి జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, రూరల్ ఎస్సై ఉమాసాగర్ హాజరై ప్రారంభించారు. […]
హుజూరాబాద్‌లో ఏఐవైఎఫ్ రాష్ట్ర మూడో మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

హుజూరాబాద్, ఆగస్టు 30: అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర మూడో మహాసభలను పురస్కరించుకుని హుజూరాబాద్ మండలం ఇందిరానగర్‌లో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పోలోజు రంజిత్ కుమార్, హుజూరాబాద్ మండల అధ్యక్షురాలు చిట్టి లావణ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలోజు రంజిత్ కుమార్, చిట్టి లావణ్య మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలు, విద్యారంగంలో నెలకొన్న సవాళ్లు, ఉపాధి అవకాశాల కల్పన, యువత రాజ్యాంగబద్ధమైన హక్కుల […]
పేదోడి సొంతింటి కలకు సర్పంచ్ అండ

హుజురాబాద్/ధనాధన్ న్యూస్,ఆగస్టు 30: తల్లిదండ్రులను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో ఒంటరిగా జీవిస్తున్న ఓ నిరుపేద యువకుడి సొంతింటి కలను సాకారం చేసేందుకు గ్రామ సర్పంచ్ మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయించడంతో పాటు, ఇంటి నిర్మాణానికి అవసరమైన అదనపు ఖర్చులను సైతం తానే భరిస్తూ ఉచితంగా ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు సర్పంచ్ ముందుకు రావడం గ్రామంలో అభినందనలు అందుకుంటున్నారు.కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం శాలపల్లి–ఇందిరానగర్ గ్రామంలోని న్యూ […]
ఆర్టీఐ దరఖాస్తుల వల్లే ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఆగిపోయాయా?

బుగ్గారం/ధనాధన్ న్యూస్: బుగ్గారం మండలంలో ఆర్టీఐ దరఖాస్తుల కారణంగానే 40 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రావాల్సిన బిల్లులు నిలిచిపోయాయంటూ కొన్ని దినపత్రికల్లో వచ్చిన వార్తలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని సీనియర్ ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం బుగ్గారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)కు వినతిపత్రం సమర్పించారు. ఎంపీడీవో తరఫున ఎంపీవో బింగి సురేష్ వినతిపత్రాన్ని స్వీకరించారు. ఆర్టీఐ దరఖాస్తుల వల్లే ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు […]
నూర్‌బాషా,దూదేకుల ముస్లిం సమాజానికి 2010 జీవో అమలు చేయాలి

హైదరాబాద్/ధనాధన్ న్యూస్: నూర్‌బాషా, దూదేకుల ముస్లిం సమాజ సంక్షేమం కోసం 2010లో జారీ చేసిన జీవోను వెంటనే అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముస్లిం నూర్‌బాషా దూదేకుల బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ జేఏసీ ప్రతినిధులు సీఎం ప్రజావాణికి వినతిపత్రం సమర్పించారు. 2010 మే 3న మైనారిటీ వెల్ఫేర్ శాఖ జారీ చేసిన జీవో ఎంఎస్ నం.125 ప్రకారం నూర్‌బాషా, దూదేకుల ముస్లింల సహకార సంఘాలు, ఫైనాన్స్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసి అమలు చేయాలని జేఏసీ ప్రతినిధులు […]
మహాముత్తారం మండలంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌కు ఘన స్వాగతం

మహాముత్తారం/ధనాధన్ న్యూస్: అమెరికా పర్యటన అనంతరం తొలిసారిగా మహాముత్తారం మండలానికి విచ్చేసిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌కు బీఆర్‌ఎస్ పార్టీ మండల శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో పుట్ట మధూకర్‌కు ఆత్మీయ స్వాగతం పలికి, పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం పార్టీ నాయకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. పుట్ట మధూకర్‌కు స్వాగతం […]
ములుగు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు: సీఎం రేవంత్ రెడ్డి

ములుగు/ధనాధన్ న్యూస్: తెలంగాణలో ఆడబిడ్డలు, పేదలు, నిరుద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ములుగులో నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సమ్మక్క–సారక్క ఆశీర్వాదంతో ములుగు నుంచే పాదయాత్ర ప్రారంభించామని సీఎం గుర్తుచేశారు. రాష్ట్రంలోని నలుమూలల గూడేలు, పల్లెల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి భరోసా ఇచ్చామని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఇందిరమ్మ […]
భూపాలపల్లిలో మూడు రోజుల సామాజిక చైతన్య నాటకోత్సవాలు

జయశంకర్ భూపాలపల్లి,ధనాధన్ న్యూస్: సామాజిక చైతన్యం, సమానత్వం, మానవతా విలువలతో పాటు మహనీయుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో మూడు రోజుల సామాజిక చైతన్య నాటకోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.ఆగస్టు 14 నుంచి 16 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6:30 గంటలకు భూపాలపల్లి కృష్ణ కాలనీలోని సీఈఆర్ క్లబ్ మినీ ఫంక్షన్ హాల్‌లో నాటక ప్రదర్శనలు జరుగుతాయి. ఆగస్టు […]
వృద్ధాప్య, బీడీ కార్మికుల పెన్షన్లు కూడా ఇవ్వాల్సిందే..!

ఇల్లందకుంట,ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన 420 హామీలలో భాగంగా వృద్ధాప్య, బీడీ కార్మికుల పెన్షన్లను కూడా వెంటనే అమలు చేయాలని ఇల్లందకుంట మండల బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గత ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల పెన్షన్లను పెంచి ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ రెండున్నరేళ్లు గడిచినా పెన్షన్ల పెంపుపై […]
