దశాబ్ది ఉత్సవాలకు తరలివెళ్లిన హుజురాబాద్ ఉద్యమకారులు

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)జూన్02:తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు నిండిన సందర్భంగా  ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు హుజురాబాద్ ప్రాంతానికి చెందిన ఉద్యమకారులు ఆదివారం రోజున అధిక సంఖ్యలో హైదరాబాద్ కు తరలివెళ్లారు.తమ త్యాగాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోక నిర్లక్ష్యం చేసిందని వారు ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడం హర్షణీయమని,ఇదే వైఖరిని ప్రభుత్వం కొనసాగిస్తుందని, ఉద్యమకారుల సలహాలు, సూచనలు తీసుకుని తెలంగాణ పునర్నిర్మాణం చేస్తుందని వారు … Read more

ఘనంగా తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు

సైదాపూర్ (ధనాధన్ న్యూస్ )జూన్ 02:సైదాపూర్ మండల కేంద్రంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర రవాణ&బీసీ సంక్షేమశాఖ  పొన్నం ప్రభాకర్  ఆదేశాల మేరకు ఘనంగా  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  దొంత సుధాకర్  ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటి అవతరణ దినోత్సవం కావడంతో ఈ … Read more

దుద్దెనపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్02:సైదాపూర్ మండలంలోని దుద్దేనపల్లి గ్రామంలో ఆదివారం రోజున ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.కుల పెద్దమనిషిగా గూళ్ల వెంకటయ్య,ప్రెసిడెంట్ గా నెల్లి శ్రీనివాస్,క్యాషియర్ గా నీల తిరుపతి,వైస్ ప్రెసిడెంట్ గా రొయ్యల శ్రీనివాస్, మెంబర్లు గా బొల్లి సురేష్,గూళ్ల అజయ్,పిట్టల కొమురయ్య,పిట్టల మొండయ్య,పెసరి సమ్మయ్య,నీల సమ్మయ్య లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి నా ఎన్నికకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా … Read more

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)జూన్01:హనుమాన్ జన్మదిన పర్వదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో హనుమాన్ మాల ధారణ స్వాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయమే స్వామీకి ప్రత్యేక అభిషేకం చేశారు.అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.అభిషేకం చేసే సమయంలో రాముని భజన,రామ నామ స్మరణతో భక్తులు తన్మయత్వం పొందారు.జయంతి సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు ఆలయాన్ని సందర్శించి ప్రత్యెక మొక్కులు చెల్లించుకున్నారు.విరుముడి కట్టుకొని హనుమాన్ మాల ధారణ స్వాములు విరమణకు బయలుదేరారు.అనంతరం మహా … Read more

ప్రైవేటు విద్యాసంస్థల విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే30:తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్య వ్యాపారం చేస్తూ ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని, సిఎం రేవంత్ రెడ్డి రాష్ర్టంలో ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న   ఫీజుల దోపిడీ అరికట్టే విధంగా  చర్యలు తీసుకొని ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని, ఎన్నికల హామీలో విద్యార్థులకు  ఇచ్చిన హామీలను విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి లద్దునూరి విష్ణు  అన్నారు.ఆయన మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ కేంద్రంలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలను ఆయా … Read more

గ్రామపంచాయతీ ని సందర్శించిన జిల్లా పంచాయతీ అధికారి

చిత్రంలో జిల్లా పంచాయతీ అధికారి. జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే30:జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయం తో పాటు గ్రామపంచాయతీ చేసిన అభివృద్ధి పనులను జిల్లా పంచాయతీ అధికారి ఏ రవీందర్ గురువారం సందర్శించారు. గురువారం స్థానిక ఎంపీవో సతీష్ కుమార్ విలాసాగర్ గ్రామపంచాయతీ కార్యదర్శి మనోహర్ రెడ్డి తో కలిసి గ్రామంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనం,కంపోస్టు షెడ్,వైకుంఠ ధామం,నర్సరీ, క్రీడా ప్రాంగణాల ను జిల్లా పంచాయతీ అధికారి తనిఖీ చేశారు. గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ … Read more

జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే29:జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజరాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షులు సౌడమల్ల యోహాన్ అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారి యొక్క ముఖ్య డిమాండ్ అయిన హెల్త్ కార్డు,నివేషణ స్థలాలు,రైల్వే పాసులను పునరుద్దించలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఫోర్త్ స్టేట్ అని చెప్పుకునే జర్నలిస్టులకే రక్షణ లేకుండా పోతుందని ప్రజలకు ప్రభుత్వానికి … Read more

యూనిఫార్మ్స్ కుట్టుట వేగవంతం చేయండి

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే27:హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫార్మ్స్ కుట్టు కేంద్రాలను సోమవారం మెప్మా పిడి స్వరూప రాణి, కమీషనర్ మొహమ్మద్ అయాజ్,డిఎంసి శ్రీవాణి, ఏడిఎంసి మల్లీశ్వరిలు పరిశీలించారు.అనంతరం పలు కేంద్రాలను పరిశీలించి,యూనిఫార్మ్స్ నాణ్యతగా ఉండేలా ప్రభుత్వం ఇచ్చిన సూచనలతో కుట్టాలని,యూనిఫార్మ్స్ కుట్టుట వేగవంతం చేయాలని వారిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మెప్మా అధికారులు సతీష్,సీఎల్ఆర్పీలు జ్యోతి, మంజుల,ఆర్పీలు,కుట్టు మిషన్ నిర్వాహుకురాలు అభేద భాను లతో పలువురు పాల్గొన్నారు.

నూజివీడు సీడ్స్  పుష్కలు వరి విత్తనాలతో అధిక దిగుబడి

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే27:సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో  నూజివీడు సీడ్ డిస్ట్రిబ్యూటర్స్ మరియు డీలర్లు  ఆర్ఎంజె శ్రీకాంత్ రెడ్డి ఈ సంద్భంగా మాట్లాడుతూ నూజివీడు సీడ్స్ వారి పుష్కల్ వరి రకం విత్తనాలు అన్ని రకాల రోగాలకు తట్టుకొని ఎక్కువ ఎత్తు పెరగకుండా,గాలి దుమారాలకు పడిపోకుండా,ఎక్కువ దిగుబడులు వస్తుందని వివరించారు.ఈ వంగడాన్ని రైతుల కోసం ప్రత్యేకించి తయారు చేయడం జరిగిందన్నారు.ఇప్పటివరకు నూజివీడు సీడ్స్ కంపెనీ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని చేసుకొని … Read more

విత్తన డీలర్లతో వ్యవసాయ అధికారుల సమావేశం

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే25:వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏడీఏ జీ.సునిత మాట్లాడుతూ విత్తన డీలర్లు అందరూ కూడా అనుమతి ఉన్న విత్తనాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని,విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతి రైతుకి బిల్లు తప్పనిసరిగా అన్ని వివరాలతో ఇవ్వాలని,విత్తన అమ్మకాల వివరాలు రైతు వారీగా రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపారు.రైతుకు నష్టం కలిగేలా ఎలాంటి విత్తన అమ్మకాలు,ఎరువులు,పురుగుమందుల అమ్మకాలు చేయకూడదని,ఏదైనా … Read more