కరీంనగర్లో శాంతిభద్రతలపై డీజీపీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్లో రోజురోజుకీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌తో పాటు ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, దాసోజు శ్రవణ్ కలిసి కలసి వినతిపత్రం సమర్పించారు.ఇటీవల కరీంనగర్ నగరంలో వరుసగా జరుగుతున్న జ్యూవెలరీ షాపుల దొంగతనాలు, ప్రజలపై దాడులు, […]
జమ్మికుంట బీజేపీ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా పుల్లూరి ప్రశాంత్ నియామకం

జమ్మికుంట/ధనధాన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా పుల్లూరి ప్రశాంత్‌ను నియమించారు. ఈ నియామకం పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ మాట్లాడుతూ, వార్డ్ బూత్ అధ్యక్షుడిగా పనిచేసిన తనను పట్టణ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షుడు కృష్ణరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు, […]
ఉపసర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడిగా దొంతరవేన రమేష్ యాదవ్

జమ్మికుంట,ధనాధన్ న్యూస్:జమ్మికుంట మండల ఉపసర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడిగా మాచనపల్లి గ్రామ ఉపసర్పంచ్ దొంతరవేన రమేష్ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో మండలంలోని 15 మంది ఉపసర్పంచ్లు రమేష్ యాదవ్‌కు మద్దతు తెలపడంతో ఆయనను అధ్యక్షుడిగా ఎంపిక చేశారు.ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన సహచర ఉపసర్పంచ్‌లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో గ్రామాల సమగ్ర అభివృద్ధికి, ఉపసర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరియు […]
సొంత గూటికి మద్దుల ప్రశాంత్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ పటేల్ సొంత గూటికి చేరారు. బుధవారం హుజురాబాద్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా మద్దుల ప్రశాంత్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బీజేపీ కండువా కప్పి ఘనంగా పార్టీలోకి స్వాగతం పలికారు.గతంలో బీజేపీలో […]
మన వార్త దినపత్రిక క్యాలండర్ ఆవిష్కరణ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ జనవరి 07 :మన వార్త దినపత్రిక నూతన సంవత్సరం 2026 క్యాలండర్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జమ్మికుంటలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ,పత్రిక ప్రజలకు–అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తుందని అన్నారు. సమాజానికి అవసరమైన వార్తలు, సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చేరవేస్తూ, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ అనతికాలంలోనే విశేష ప్రాచుర్యం పొందిన మన వార్త దినపత్రిక యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందించారు.ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో […]
కబ్జాకు గురైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని కాపాడాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విలువైన భూమిని కొంతమంది అక్రమంగా కబ్జా చేశారని, ఆ స్థలాన్ని తిరిగి కళాశాల పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ కళాశాల పూర్వ విద్యార్థి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీపీడీసీ సభ్యుడు టంగుటూరి రాజకుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.బుధవారం జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మంత్రి బండి సంజయ్‌ను కలిసిన రాజకుమార్, కళాశాల భూకబ్జా అంశంపై గత 23 […]
కాంగ్రెస్ బీసీ ప్రజలను మోసం చేస్తుంది
మీ తాటాకు సప్పుళ్లకు బయపడేటోళ్ళం కాదు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట పట్టణంలో శనివారం కాంగ్రెస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ చేసిన పత్రికా ప్రకటనలో తమపై చేసిన ఆరోపణలను జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు కొలకాని రాజు ఖండించారు. వాట్సాప్ గ్రూపులో నిధులు తానే తెచ్చుకున్నట్టు చెప్పుకున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం పూర్తిగా తప్పుడు వాదమని ఆయన స్పష్టం చేశారు. కొలకాని రాజు మాట్లాడుతూ – “మేము బిజెపి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పలుమార్లు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించామని, స్పందన […]
టెర్రరిస్ట్ యూనివర్సిటీలను ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీకి హ్యాట్సాఫ్…సెల్యూట్
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దళితులకు న్యాయం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందని,దళిత బంధు నిధుల విడుదల ద్వారా మరోసారి అది రుజువైందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం రోజున ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్లు ఎమ్మెల్సీగా,ప్రభుత్వ విప్ గా ఉన్న కౌశిక్ రెడ్డి దళిత బంధు నిధులు విడుదల చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు.దళితుల భావోద్వేగాలను రెచ్చగొట్టి దళితులతో దళిత బంధు రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గత […]
