మోడల్ స్కూల్ చుట్టూ ప్రహరీ గోడను నిర్మించాలి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం సోమవారం  మోడల్ స్కూల్  లో బుదవారం రోజున అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య (ఏఐఎఫ్ డిఎస్) అధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఉమ్మడి జిల్లా  ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీకాంత్ సభ్యత్వం నమోదు చేయించారు, అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ వర్షాకాల సమయంలో వర్షాలు భారీగా కురిస్తే క్లాస్ రూమ్ లోకి వర్షపు నీరు వస్తుందని,పాములు,తేళ్లు కప్పలు స్కూల్ లోపలికి వస్తూన్నాయని,చుట్టుపక్కల గడ్డి బాగా పెరిగిందని,రాత్రి సమయంలో గర్ల్స్ హాస్టల్లో చీకటిగా ఉందని స్కూల్ … Read more

నీళ్లు ఇవ్వకపోతే రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తా

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో మా అందరిపై కోపం ఉంటే మా మీదే చూపించాలి తప్పా రైతుల మీద కాదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఆయన మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు నీళ్లు అందగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలేశ్వరం ప్రాజెక్టు లక్ష్మి పంప్ హౌస్ వద్ద 17 పంపులు రెడీగా ఉన్నాయని వెంటనే … Read more

ప్రభుత్వ భూమిని కాపాడండి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని సర్వే నెంబర్ 629లో ఉన్న ఆరు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వెంటనే అధికారులు స్వాధీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వ భూములను కాపాడాలని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు రేణికుంట్ల సాగర్ డిమాండ్ చేశారు.గత మూడు రోజులుగా వివిధ దినపత్రికల్లో వస్తున్న భూ కబ్జాపై స్పందించిన సాగర్ గురువారం జమ్మికుంట తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ,నిలువ నీడలేని పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారని 60 … Read more

భ్రూణ హత్యలకు పాల్పడుతున్న ఆసుపత్రులపై చర్యలు చేపట్టాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్,జమ్మికుంట పట్టణాల్లో విచ్చలవిడిగా ఆసుపత్రులు వెలిసాయని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ ఒక్క హాస్పటల్ లేదని పేదప్రజల ఆరోగ్యాన్ని ఆసరాగా చేసుకుని వేలాది రూపాయలు దండుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు టేకుల శ్రావణ్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్,జమ్మికుంట కేంద్రాలుగా భ్రూణ హత్యలు పెరిగాయని జిల్లా వైద్య శాఖ అధికారులు వాటిని అరికట్టడంలో చూసిచూడనట్లు వ్యవహరించడం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు.హుజురాబాద్,జమ్మికుంట లో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఏర్పాటు … Read more

స్మార్ట్ సిటీ నిధుల్లో సునీల్ రావు 10 కోట్ల కమిషన్

కరీంనగర్ నగర మేయర్ సునీల్ రావు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఆకుల ప్రకాష్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి కుంటుపడుతుందని మా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడడాన్ని మేయర్ సునీల్ … Read more

అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని వివిధ ఆర్గనైజేషన్ల నాయకులను నిన్న అర్ధరాత్రి నుంచి అక్రమ అరెస్టులు చేపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడమే కాకుండా ఈరోజు ఉద్యోగాలు రాని నిరుద్యోగులు  మరియు వివిధ ఆర్గనైజేషన్ల నాయకులు  కలిసి ప్రశ్నించడానికి వెళుతుంటే యావత్ తెలంగాణ నలుమూలల నిరుద్యోగులను వివిధ ఆర్గనైజేషన్ నాయకులను అక్రమ … Read more

తీన్మార్ మల్లన్నకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: ప్రజాగళం,ప్రజాకలం క్యూ  న్యూస్ అధినేత జర్నలిస్ట్ గా తీన్మార్ మల్లన్న,రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలు ఎండగడుతూ ఎక్కడ అవినీతి అన్యాయం జరిగిన ప్రజలకు తన క్యూ న్యూస్ ఛానల్ మరియు శరణార్థి తెలంగాణ పత్రిక ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలకు తెలియపరుస్తూ ప్రజల కు వారధిగా నిలుస్తూ ఎన్నో రకాల సేవలందించారని బి ఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేదాక నిరంతరం శ్రమించాడని కాంగ్రెస్ ప్రభుత్వం … Read more

ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలకేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసు సమావేశ మందిరంలో మండల పరిధిలోని ఎంపీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు సన్మాన మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ దొడ్డే మమత ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైస్ ఎంపీపీ తిరుపతిరావు,ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు.ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఉంటుందని చెప్పారు. ఐదేళ్ల కాలంలో మండల పరిధిలోని ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. ప్రజా ప్రతినిధులు … Read more

వైద్య విద్యకు పేద విద్యార్థులను దూరం చేసే కుట్ర

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన నీట్ పేపర్ లీకేజీ పై బిఆర్ఎస్వి జమ్మికుంట టౌన్ అధ్యక్షులు కొమ్ము నరేష్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.అనంతరం బిఆర్ఎస్వి నాయకులు కొమ్ము నరేష్,హరీష్ వర్మ అప్పని మాట్లాడుతూ 24 లక్షల వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు.గత 20 రోజులుగా విద్యార్థులు,విద్యార్థి తల్లిదండ్రులు ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేసిన నిమ్మకునీరెత్తనట్లుగా రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు.ఈ రాష్ట్రంలో 70 వేల … Read more

కౌశిక్ రెడ్డిని విమర్శించే స్థాయి ప్రణవ్ ది కాదు

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)జూన్13: హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ని విమర్శించే స్థాయి ప్రణవ్ కి లేదని బీఆర్ఎస్ సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి అన్నారు. గురువారం హుజరాబాద్ లోని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వారం రోజులుగా ఫ్లై యాష్ స్కాం గురించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి కనుసన్నలోనే స్కామ్ జరుగుతుంది అని ఆధారలతో నిరూపిస్తే ఇప్పటివరకు మంత్రి ఎందుకు స్పందించడం లేదని … Read more