ఇళ్ళందకుంటలో జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ మండల స్థాయి సన్నాహక సమావేశం

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే,రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ఏప్రిల్ రెండు నుండి జరిగే రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్రీయ పాదయాత్ర కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పిలుపునిచ్చారు.గురువారం రోజున ఇళ్ళందకుంట మండల కేంద్రంలో పాదయాత్రకు సంబంధించిన మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో బీజేపీ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ బీజేపీ నాయకులు పార్లమెంట్ సాక్షిగా అమిత్ […]

ఎస్సీ వర్గీకరణ పూర్తి అయ్యేవరకు గ్రూప్స్ ఫలితాలను నిలుపుదల చేయాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: గ్రూపు1, గ్రూప్ 2, గ్రూప్3లతో పాటు అన్ని రకాల ఫలితాలు నిలుపుదల చేయాలని బేడ బుడగ జంగం_ జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అతి త్వరలో పూర్తి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటిస్తూనే మరోవైపు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తికాక ముందే నేడు గ్రూప్1 ఫలితాలు ప్రకటించడం, అదేవిధంగా ఈనెల 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 అదేవిధంగా […]

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన రాయికల్ గ్రామ రైతులు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామానికి చెందిన రైతులు సోమవారం రోజున ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వినతి పత్రం అందజేశారు అనంతరం రైతు జేరిపోతుల రాజు మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్ట్ భూమి యొక్క నష్టపరిహారాన్ని గత నెల 7వ తారీఖు నాడు హుజరాబాద్ ఆర్డీవో సమక్షంలో మీటింగ్ ఆకునూర్ రాయికల్ రైతు సమీక్ష సమావేశం ఆర్డిఓ ఆధ్వర్యంలో  నిర్వహించడం జరిగింది.కరీంనగర్ జిల్లా కలెక్టర్ 12 లక్షల 20,000 ఇస్తారని హుజురాబాద్ […]

ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ లో  సెయింట్ జోసెఫ్ విద్యార్థినికి స్టేట్ 5వ ర్యాంక్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు  ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ వారు నిర్వహించిన వివిధ  ప్రామాణిక పరీక్షల్లో పోటీపడి జమ్మికుంట సెయింట్ జోసెఫ్ స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్థిని నిహా తన్నజ్ స్టేట్ 5వ ర్యాంక్ సాధించింది. ఇదే స్కూల్ కు చెందిన 7వ తరగతి విద్యార్థిని కే. విశ్వశ్రీ జోనల్ లెవల్ లో 9వ ర్యాంక్ సాధించింది. ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ ఫైనల్ […]

ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా అభిమానుల విస్తృత ప్రచారం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణను అట్టభద్రులు సంపూర్ణ మద్దతు ప్రకటించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన అభిమానులు సూచించారు. ఈ సందర్భంగా విద్యా వ్యాపారాన్ని చేస్తున్న కొందరికి గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో విద్యావేత్త అయిన ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నందుకు తనకు మద్దతు ఇవ్వాలని పెర్కో న్నారు. ఈ ఎన్నికల వార్ వన్ సైడ్ కావాలని పట్టభద్రులు, మేధావులు, […]

పట్టభద్రులకు,ప్రభుత్వానికి వారధిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూట్కూరి నరేందేర్ రెడ్డి భారీ మెజారిటీతో మండలికి వెళ్లడం ఖాయమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.ఆదివారం రోజున హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సభకు ఆయన ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తో పాటు హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ పట్టభద్రులు ఓటును వృధా చేసుకోవద్దని,ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా […]

బీమా చట్ట సవరణ బిల్లు 2024 ను తిరస్కరించాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్:కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న 2024 బీమా చట్ట సవరణ బిల్లును ప్రతి ఒక్కరు తిరస్కరించాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) హుజురాబాద్ బ్రాంచ్ అధ్యక్షుడు బొంకూరి కుమార్ స్వామి కోరారు. బీమా చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పించారు. చట్ట సవరణ బిల్లు ద్వారా వచ్చే ఇబ్బందులను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం కుమార్ స్వామి మాట్లాడుతూ… రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో […]

సగర సంఘ సేవలు అభినందనీయం

వీణవంక/ధనాధన్ న్యూస్: సగర సంఘం సేవలు అభినందనీయమని హన్మకొండ పట్టణానికి చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ గుండేటి గణేష్ అన్నారు.సగర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు కోరిక మేరకు మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలోని సగర సంఘ కార్యాలయంలో సగర సంఘం నేతృత్వంలో హన్మకొండలోని గణేస్ ఐ కేర్ అండ్ ఆఫ్టికల్స్,సాయితేజ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ […]

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దళితులకు న్యాయం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందని,దళిత బంధు నిధుల విడుదల ద్వారా మరోసారి అది రుజువైందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం  రోజున ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్లు ఎమ్మెల్సీగా,ప్రభుత్వ విప్ గా ఉన్న కౌశిక్ రెడ్డి దళిత బంధు నిధులు విడుదల చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు.దళితుల భావోద్వేగాలను రెచ్చగొట్టి దళితులతో దళిత బంధు రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గత […]

ఆకునూరు గ్రామపంచాయతీలో డి.ఎల్.పి.ఓ విచారణ

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో నూతన గ్రామపంచాయతీ నిర్మాణంలో, స్మశాన వాటికల పనుల్లో అప్పటి  పలు అవకతవకలు జరిగాయని అదే గ్రామానికి చెందిన రావుల రాజిరెడ్డి అనే వ్యక్తి డిసెంబర్ 24న కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.ఈ విషయంపై హుజురాబాద్ ఇన్చార్జి  డి.ఎల్.పి.ఓ శ్రీనివాస్ ఫిర్యాదు దారుడితోపాటు,మాజీసర్పంచ్ రమణ రెడ్డిని పిలిపించుకొని విచారణ చేపట్టారు.విచారణ చేసిన నివేదికను పై అధికారులకు అందజేస్తానని డి ఎల్ పి ఓ  పేర్కొన్నారు.ఈ […]