నిరుపేదల నివేషణ స్థలంలో డంపింగ్ యార్డ్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆటోనగర్ సమీపంలో సర్వే నంబర్ 275,76,77,78 లో 2006 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 300 నిరుపేద కుటుంబాలకు నివేషణ స్థలం మంజూరు చేసి పట్టాలు ఇచ్చింది.ఈ స్థలాలలో కొంతమంది ఆర్థిక స్తోమత కలిగిన వారు నిర్మాణాలు చేపట్టారు.స్తోమత లేని వారు జమ్మికుంటలో కిరాయిలలో జీవనం కొనసాగిస్తున్నారు.ఇదిలా ఉండగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డంపింగ్ యార్డ్ల నిర్మాణంలో భాగంగా నిరుపేదలకు పంపిణీ చేసిన నివేషణ స్థలాలను […]
అక్బరుద్దీన్ ఓవైసీ కీ ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్

హైదరాబాద్/ధనాధన్ న్యూస్: హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణాన్ని చేపడుతామని,ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాంద్రాయణ గుట్టకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం ఓట్లు అడుగుతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లా డుతూ.. అక్బరుద్దీన్ ఒవైసీని వచ్చేసారి కొడంగల్ నుంచి పోటీ చేయించి గెలిపిస్తానని వ్యాఖ్యానిం చారు.కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు కొడంగల్ బీఫామ్ ఇచ్చి దగ్గరుండి నామినే షన్ వేయిస్తానని..గెలిపించి ఉపముఖ్యమంత్రిని చేస్తానన్నారు.కాగా,అంతకు ముందు […]
మాజీ జెడ్పిటిసి కుటుంబాన్ని పరామర్శించిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికీ చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ జెడ్పిటిసి గుండారపు శోభ శ్రీనివాస్ తల్లి గుండారపు కనకమ్మ ఇటీవల మరణించడంతో కుటుంబాన్ని మాజీ రాష్ట్ర హౌజ్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ కౌన్సిలర్ కోమటి స్వర్ణలత సత్యనారాయణ,మాజీ ఎంపిటిసి చాడా చైతన్య కొండల్ రెడ్డి,మాజీ పట్టణ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్,గ్రామ అధ్యక్షులు తాళ్లపెళ్లి వెంకటేశం,యూత్ కాంగ్రెస్ నాయకులు పూదారి హరీష్ గౌడ్,బోనగిరి అనిల్,మాడెపు రాహుల్ […]
నీళ్లు ఇవ్వకపోతే రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తా

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో మా అందరిపై కోపం ఉంటే మా మీదే చూపించాలి తప్పా రైతుల మీద కాదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఆయన మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు నీళ్లు అందగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలేశ్వరం ప్రాజెక్టు లక్ష్మి పంప్ హౌస్ వద్ద 17 పంపులు రెడీగా ఉన్నాయని వెంటనే […]
ఘనంగా వొడితల రాజేశ్వర్ రావు 13వ వర్థంతి

రాజకీయ దురంధరుడు,స్నేహశీలి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వొడితల రాజేశ్వరరావు ఆశలను కొనసాగించడమే తన లక్ష్యమని,వారసత్వంగా వచ్చిన ప్రజల ప్రేమాభిమానలు పొంది వారికి సేవ చేస్తాననీ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.మాజీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వొడితల రాజేశ్వరరావు 13వ వర్ధంతి వేడుకలు హుజురాబాద్ పట్టణంలో ప్రణవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు,మానకొండూర్ మాజీ శాసన సభ్యుడు ఆరపల్లి మోహన్ పాల్గొన్నారు.ఈ […]
జమ్మికుంట రైల్వే స్టేషన్ లో వ్యక్తి మృతి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట రైల్వే స్టేషన్ లో బీహార్ రాష్ట్రానికి చెందిన రైస్ మిల్ హమాలీ అనారోగ్యం తో మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ జీ.తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రం నలంద జిల్లా పినిపర్ గ్రామానికి చెందిన దినేష్ యాదవ్(46) గత కొంతకాలంగా జమ్మికుంటలోని రైస్ మిల్ లో హమాలీగా పనిచేస్తూ ఉన్నాడు.తిరిగి ఊరికి వెళ్ళడానికి జమ్మికుంట రైల్వే స్టేషన్ కి వచ్చి బుకింగ్ కౌంటర్ లో పడుకొని చనిపోయి ఉన్నాడని, బహుశా […]
వరద బాధితులను ఓదార్చిన వోడితల ప్రణవ్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని 23వ వార్డు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది.ఈ కాలనీలో దాదాపు 300 మంది బుడగ జంగాల ప్రజలు,పిల్లాపాపలతో గుడిసెలు వేసుకుని అనేక సంవత్సరాల నుండి నిరుపేద జీవితాలను గడుపుతున్నారు.నిన్న మొన్నటి భారీ వర్షాల వల్ల అనేక గుడిసెలపై గల తాత్కాలిక పైకప్పులు కొట్టుకుపోగా దాదాపు మొత్తం గుడిసెలు సగం నీటిలో కూరుకుపోవడంతో వస్తువులు, దుస్తులు,పక్క బట్టలు,రేషన్ బియ్యం ఇతర […]
క్రీ.శే.బెజగం చంద్రమౌళి చూపు సజీవం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి నివాసి అయిన బెజగం చంద్రమౌళి ఈ నెల 21 రోజున రాత్రి మృతి చెందడం జరిగింది.సదాశయ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నరహరి నేత్రదానంపై అవగాహన కల్పించగా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో, వరంగల్ ఎల్వీపీ టెక్నీషియన్ నరేందర్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్వీపీ ఐ బ్యాంక్ కి పంపడం జరిగింది.ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన కుమారుడు కోడలు బెజగం రమేష్,జ్యోతి లకు,కూతుర్లు అల్లుండ్లు రజిత,సుధాకర్ […]
ఉమెన్స్ కమిషన్ చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపిన కరీంనగర్ సెర్ప్ నాయకులు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సెర్ప్ నాయకులు సోమవారం బుద్ధ భవన్ లోని తన చాంబర్లో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుర్రం రమేష్ గౌడ్,కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మొలుగూరి సంపత్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు అనపురం రమేష్ గౌడ్,కరీంనగర్ జిల్లా నాయకులు గంప సంపత్ కళ్ళపెళ్లి మల్లేశంలు ఉన్నారు.
రైతు ఋణమాఫి పట్ల యువజన కాంగ్రెస్ సంబరాలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు బ్యాండు భాజాలతో, టపాసులు కాల్చి మిఠాయిలు పంచినృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కరీంనగర్ జిల్లా రైతుల పక్షాన మరియు యువజన కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.రైతు రుణ మాఫీకి కృషిచేసిన […]
