కాంగ్రెస్ కార్యకర్తల్లో నైరాశ్యం

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట కాంగ్రెస్ కార్యకర్తల్లో కలవరం మొదలైంది. రాష్ట్రం లో పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ జెండా మోసిన మా పరిస్థితి పార్టీ అధికారంలోకి రాగానే ఎం జరుగుతుందోనని కాంగ్రెస్ కార్యకర్తలు మనోవేదనకు గురవుతున్నట్లు వినికిడి. గత పది సంవత్సరాలు గా అప్పటి అధికార పార్టీ ఎన్ని ఒత్తిళ్లకు గురిచేసిన, అక్రమ కేసులు పెట్టిన ఆ బాధలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన మాకు కీలక సమయంలో అన్యాయం జరుగుతుందేమోనని కాంగ్రెస్ పెద్దల […]

సిరిసేడు గ్రామపంచాయతీ పాలక మండలి కి పదవి విరమణ సన్మానం.

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పాలకమండలి సభ్యుల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియగా ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామ పంచాయతీ పాలకమండలికి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి అంకుస్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి పథకాలని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ గ్రామంలో అన్ని వీధులకు సిసి రోడ్లు, […]

మండల బాలల పరిరక్షణ కమిటీ శిక్షణ కార్యక్రమం.

కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ సమగ్ర బాలల అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో హుజురాబాద్ సిడిపిఓ భాగ్యలక్ష్మి అధ్యక్షతన సైదాపూర్ ఎంపీడీవో కార్యాలయం నందు మండల బాలల పరిరక్షణ కమిటీ కార్యక్రమము నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బాలల పరిరక్షణ కమిటీల ఏర్పాటు విధి విధానాలు బాలల హక్కుల పరిరక్షణ మరియు బాలల చట్టాల గురించి బాల కార్మిక, బాల్యవివాహాల నిర్మూలన, లైంగిక వేధింపులు, బ్రూణ హత్యలు నిర్మూలన మరియు విద్యాహక్కు చట్టం వివిధ చట్టాల […]

కమలాపూర్ మండలానికి సాగునీరు.

హుజురాబాద్, ధనాధన్ న్యూస్ : హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండల పరిధిలోని కానిపర్తి,శంభునిపల్లి,గూడూరు తదితర ఆరు గ్రామాల రైతులు సాగునీరు సమస్యను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఒడితేల ప్రణవ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దృష్టికి తీసుకొని వెళ్లగా రైతుల బాధ అర్థం చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పందించి ఎస్ఆర్ఎస్పి అధికారులతో మాట్లాడి రైతులకు సాగు నీరు సరఫరా ను పునరుద్ధరించారు.సాగు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రి […]

ప్రభుత్వ ఆసుపత్రి మెరుగైన వైద్య సేవలు అందించాలి.

సంఘటనపై స్పందించిన హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ ఆసుపత్రి సూపరిండెంట్ రాజేందర్ రెడ్డి తో ఫోన్ లో వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల కరెంటు ఉండేలా చూసుకోవడంతో పాటు నిరంతరం నీటి సరఫరా అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీల ప్రసవం సమయంలో డాక్టర్లు అందుబాటులో ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఆసుపత్రి అభివృద్ధి కోసం జిల్లా మంత్రుల లతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి […]

రెండవ విడత దళిత బంద్ వెంటనే విడుదల చేయాలి.

దళితబందు రెండవ విడత మంజూరు చేయాలనీ ఇల్లంతకుంట, జమ్మికుంట, వీణవంక మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు దళితబంద్ లబ్ధిదారులు వినతిపత్రం అందించడం జరిగింది. 2021 సంవత్సరంలో బీ అర్ ఎస్ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు గా ప్రవేశపెట్టిన దళితబందు హుజురాబాద్ నియోజకవర్గం లోని ప్రతి కుంటుంబానికి 10లక్షల చొప్పున వారి వారి ఖాతాలలో జమచేయడం జరిగింది.మొదటి విడతగా 5లక్షలు రెండవ విడిడతగా 5లక్షలు ఇస్తామని కలెక్టర్ చెప్పడం జరిగింది.కానీ అనుకోకుండా ఎన్నికల నియామావలి రావడంతో దళితబందు ని […]

పెరకపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన సర్పంచ్ బత్తుల కొమరయ్య.

సైదాపూర్ మండల కేంద్రంలోని పెర్కపల్లె గ్రామంలో పదవి విరమణ సమావేశాన్ని నిర్వహించారు సర్పంచ్ బత్తుల కొమరయ్య మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను సర్పంచిగా గెలిపించిన ప్రజలకు నేను ఎల్లవేళలా రుణపడి ఉంటానని జంట గ్రామాలు అయిన గొల్లగూడెం పెర్కపల్లి గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపించడం కోటి రూపాయలతో వాడ వాడకు సిసి రోడ్డు నిర్మాణం చేయడం డంపింగ్ యార్డ్ స్మశాన వాటిక పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అని ఐదు సంవత్సరాల రాజకీయ పరిపాలనలో […]

బిజిగిరి దర్గాలో ప్రత్యేక పూజలు.

జమ్మికుంట,ధనా ధన్ న్యూస్. బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం సందర్భంగా దర్గాలో ప్రత్యేక పూజలు,పేద ప్రజలకు అన్నదానం,కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామంలోని దర్గాలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ మైనార్టీ ఇన్చార్జ్ ఎండి సలీం పాషా,మాజీ జెడ్పీటిసీ అరుకాల వీరేశలింగం,జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం మరియు […]

కేసీఆర్ కుట్రలను సాగనివ్వం

తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరాం శాసనమండలి ఎన్నికను అడ్డుకుంటున్న కేసీఆర్ కు ప్రజలు బుద్ది చెబుతారని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు అన్నారు. కోదండరాంపై కేసీఆర్ కుట్రలు కొత్తేమి కాదని గత తొమ్మిది సంవత్సరాలుగా అనేక రకాల దాడులకు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో కోదండరాం పోటీ చేస్తే వందలాది కోట్లు ఖర్చుపెట్టి ఆరోజు ఓడించారని పేర్కొన్నారు.కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టడమే […]

బీఆర్ఎస్ పార్టీకి జమ్మికుంట కౌన్సిలర్ల రాజీనామా.

జమ్మికుంట మున్సిపాలిటీ కి చెందిన 13 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన వారిలో బొంగోని వీరన్న,మారపెల్లి బిక్షపతి, మేడిపల్లి రవీందర్,ఎలాగందుల స్వరూప,పిట్టల శ్వేత, పొనగంటి రాము,పొనగంటి సారంగం,బిట్ల కళావతి,కుతాడి రాజయ్య,దేశిని రాధ,గుళ్లి పూలమ్మ,దిడ్డి రాము,రావికంటి రాజ్ కుమార్ ఉన్నారు.మున్సిపాలిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే ల వైఖరిలు నచ్చకనే పార్టీకి రాజీనామా చేస్తున్నామని లేఖలో తెలిపారు.