భవిష్యత్తు మున్నేరుపాలు..!!

ఖమ్మం/ధనాధన్ న్యూస్: ఒకరు కాదు..ఇద్దరు కాదు..సుమారు 500 మంది విద్యార్థుల విద్యార్హతల సర్టిఫికెట్లు మున్నేరుపాలయ్యాయి.టెన్త్ మొదలు పీజీ వరకు పూర్తి చేసిన విద్యార్థులే కాక కొందరు ఉద్యోగాలు చేస్తున్న వారి సర్టిఫికెట్లు సైతం వరదలో కొట్టుకుపోయాయి.దీంతో వారంతా దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.ఖమ్మం నగరం,ఖమ్మం రూరల్ మండలాన్ని మున్నేరు వరద ముంచెత్తగా 50 కాలనీల్లోకి నీరు చేరింది. అందులో కొన్ని ఇళ్లు కొట్టుకుపోగా..కొన్ని నేలమట్టమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున మున్నేరు వరద చుట్టుముట్టడంతో బాధితులు కట్టుబట్టలతో వెళ్లిపోయారు. వరద తగ్గాక […]
కబ్జా భూమిపై ఆఫీసర్ల సర్వే

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని పాత మున్సిపల్ ఆఫీసు సమీపంలో ఉన్న సర్వే నం.467లో గల ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకొని ప్రహరీ గోడ నిర్మించిన ఘటనపై అధికారులు కదిలారు.శుక్రవారం జమ్మికుంట తహశీల్దారు జి.రమేష్ బాబు ఆధ్వర్యంలో డివిజన్ డీఐ ఫయాక్ అలీ జమ్మికుంట సర్వేయర్ మనోజ్‌తో పాటు పలువురు సిబ్బంది స్థలాన్ని సర్వే చేయడానికి వెళ్లారు.గత కొద్దిరోజులుగా వివిధ దినపత్రికల్లో వస్తున్న వార్తలతో పాటు పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త గుర్రపు మహేందర్‌గౌడ్ తహశీల్దార్‌కు ఈ […]
న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: జనగామ పట్టణంలో న్యాయవాద దంపతులపై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం హుజురాబాద్ కోర్టు ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాద దంపతులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని,న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిని వ్యతిరేకిస్తూ గురు,శుక్రవారాలు న్యాయవాదులు తమ కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియన్ ప్రధాన […]
మోడల్ స్కూల్ చుట్టూ ప్రహరీ గోడను నిర్మించాలి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం సోమవారం మోడల్ స్కూల్ లో బుదవారం రోజున అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య (ఏఐఎఫ్ డిఎస్) అధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీకాంత్ సభ్యత్వం నమోదు చేయించారు, అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ వర్షాకాల సమయంలో వర్షాలు భారీగా కురిస్తే క్లాస్ రూమ్ లోకి వర్షపు నీరు వస్తుందని,పాములు,తేళ్లు కప్పలు స్కూల్ లోపలికి వస్తూన్నాయని,చుట్టుపక్కల గడ్డి బాగా పెరిగిందని,రాత్రి సమయంలో గర్ల్స్ హాస్టల్లో చీకటిగా ఉందని స్కూల్ […]
జమ్మికుంట రైల్వే స్టేషన్ లో వ్యక్తి మృతి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట రైల్వే స్టేషన్ లో బీహార్ రాష్ట్రానికి చెందిన రైస్ మిల్ హమాలీ అనారోగ్యం తో మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ జీ.తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రం నలంద జిల్లా పినిపర్ గ్రామానికి చెందిన దినేష్ యాదవ్(46) గత కొంతకాలంగా జమ్మికుంటలోని రైస్ మిల్ లో హమాలీగా పనిచేస్తూ ఉన్నాడు.తిరిగి ఊరికి వెళ్ళడానికి జమ్మికుంట రైల్వే స్టేషన్ కి వచ్చి బుకింగ్ కౌంటర్ లో పడుకొని చనిపోయి ఉన్నాడని, బహుశా […]
విద్యాసంస్థల బంద్ విజయవంతం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: నీట్ మరియు నెట్ పరీక్షల ప్రశ్న పేపర్ల లీకేజీలను నిరసిస్తూ వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ లో భాగంగా హుజురాబాద్ మండలం మరియు, జమ్మికుంట మండల వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ఇమ్రాన్,ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా అద్యక్షులు రామారపు వెంకటేష్, సహాయ కార్యదర్శి కేశబోయిన రాము,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పొడిశెట్టి అభిలాష్,జిల్లా కార్యదర్శి అభిలాష్,గాలి నరేష్,పిడిఎస్యూ జిల్లా […]
ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలకేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసు సమావేశ మందిరంలో మండల పరిధిలోని ఎంపీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు సన్మాన మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ దొడ్డే మమత ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైస్ ఎంపీపీ తిరుపతిరావు,ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు.ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఉంటుందని చెప్పారు. ఐదేళ్ల కాలంలో మండల పరిధిలోని ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. ప్రజా ప్రతినిధులు […]
కేంద్ర బిజెపి ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం ఆపాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం పాట ఆపాలని,సింగరేణి సంస్థకే నేరుగా కేటాయించాలని సిపిఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గీతా భవన్ చౌరస్తాలో శనివారం రోజున ప్లకార్డులతో నిరసనచేశారు.కేంద్ర బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేలం వేస్తున్నదని […]
