స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు మంజూరు: ఒడితెల ప్రణవ్ బాబు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా,గ్రామీణ ప్రాంతాల్లోనీ మహిళ స్వయం సహాయక సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తోడుగా ఉంటుందని,హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో 3,952 లబ్ధిదారులకు 3 కోట్ల 83 లక్షల వడ్డీలేని రుణాల నిధులను విడుదల చేసామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళ అభివృద్ధి ప్రాధాన్యతగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని గృహలక్ష్మి,మహాలక్ష్మి లాంటి అనేక […]
గురుకులంలో బాలిక మృతి బాధాకరం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో హుజురాబాద్ మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ వర్షిత అనే బాలిక ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని,దీనిపై ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారని, నివేదిక రాగానే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం నాడు ఆయన రాంపూర్ గ్రామానికి వెళ్ళి బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా బాలిక తల్లితండ్రులు […]
రాజీవ్ యువ వికాసం పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

వీణవంక/ధనాధన్ న్యూస్: ప్రభుత్వ ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇచ్చిన వాగ్దానాలన్నీ తుంగలో తొక్కుతూ యావత్ ప్రజానీకాన్ని మోసం చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాలను ఆరు గ్యారంటీలను 420 హామీలను అమలు దిశగా చర్యలు చేపట్టాలని యువతకు రాజీవ్ యువ వికాసం పథకం 2025 దరఖాస్తు ఏప్రిల్ 14, ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగ యువతకు రాయితీ రుణాలను ఇస్తానని చెప్పి మోసం చేసి నేటి వరకు […]
సిరిసేడులో బాడీ ఫ్రీజర్ బాక్స్ వితరణ

ఇల్లందకుంట,అక్టోబర్21: ఇల్లందకుంట మండలం సిరిసేడు ప్రజల అవసరార్థం బాడీ ఫ్రీజర్ బాక్స్ ని షఫీ ఖాన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి మంగళవారం గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్ కి వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా షఫీ ఖాన్ మాట్లాడుతూ… తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామ ప్రజలకు సౌకర్యం కోసం సుమారు 61వేల రూపాయల విలువ చేసే ఫ్రీజర్ బాక్స్ ని అందజేసినట్లు తెలిపారు. ప్రజల కోరిక మేరకు భవిష్యత్ లో వైకుంఠ రథం కూడా […]
కాంగ్రెస్ బీసీ ప్రజలను మోసం చేస్తుంది
పెన్షనర్స్ న్యాయపరమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ అక్టోబర్ 10:జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆవరణలో ఏఐఆర్ఆర్ఎఫ్, ఎన్సిసిపిఏ, ఫోరమ్ ఆఫ్ నేషనల్ పెన్షనర్స్ అసోసియేషన్, ఎఫ్ ఓ సి పి ఏ పిలుపుమేరకు జమ్మికుంట బ్రాంచి ఆధ్వర్యంలో భారీ ఎత్తున దర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జమ్మికుంట బ్రాంచ్ అధ్యక్షులు, జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ దాసరి రాజేశ్వర్ మాట్లాడుతూ పెన్షనర్స్ యొక్క న్యాయమైన డిమాండ్లు అయినటువంటి పెన్షన్ వాలిడేషన్ బిల్లు 2025ను రద్దు చేయాలి,అందరికి […]
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం
హుజురాబాద్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురుతుంది – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్:హుజురాబాద్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం హుజురాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచే ప్రతిపాదనను బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుకు తెచ్చారని గుర్తుచేశారు. బీసీలకు న్యాయం చేసే విషయంలో తమ పార్టీ ఎప్పటికీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. […]
ఎన్నికల షెడ్యూల్‌పై ఈటల రాజేందర్ ఆగ్రహం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్ :స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై ఎంపీ ఈటల రాజేందర్ మండలాల వారీగా పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కమలాపూర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లలో పెద్ద ఎత్తున తప్పులు ఈటల మాట్లాడుతూ – రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన రిజర్వేషన్లలో అనేక పొరపాట్లు జరిగాయని అన్నారు.బీసీలు లేని తండాలకు బీసీ రిజర్వేషన్, ఎస్సీలు లేని గ్రామాలకు ఎస్సీ రిజర్వేషన్ కేటాయించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. “కోర్టుకు వెళ్లొద్దని ఎందుకు అంటున్నారు?” “ఎంపెరికల్ […]
కనగర్తి కి గర్వ కారణం -కొత్త రాజు
