బీమా చట్ట సవరణ బిల్లు 2024 ను తిరస్కరించాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్:కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న 2024 బీమా చట్ట సవరణ బిల్లును ప్రతి ఒక్కరు తిరస్కరించాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) హుజురాబాద్ బ్రాంచ్ అధ్యక్షుడు బొంకూరి కుమార్ స్వామి కోరారు. బీమా చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పించారు. చట్ట సవరణ బిల్లు ద్వారా వచ్చే ఇబ్బందులను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం కుమార్ స్వామి మాట్లాడుతూ… రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో […]
నిరుపేద కుటుంబానికి చేయూత అందించిన దాతలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజరాబాద్ నివాసులు పట్టణ కేంద్రంలోని శిశు మందిర్ దగ్గర గల ప్రతాప్ వెంకటమ్మ- ఆదిరెడ్డి ల రెండవ కుమారుడు ప్రతాపు నాగరాజు వయసు 40 సంవత్సరాలు జీవనోపాధి నిమిత్తం హైదరాబాదుకు వెళ్లి సుతారిగా పనిచేస్తుండగా రెండు కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల గత శుక్రవారం రోజున మరణించాడు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంత్యక్రియలు డైరెక్ట్ గా స్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు.ఇప్పుడు 11 రోజుల కార్యక్రమం చేయలేని పరిస్థితిలో ఉండగా ఇంటి దగ్గరలో ఉన్న మునుగంటి రవీందర్ రిటైర్డ్ […]
ఆటో యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట లోకల్ ఆటో యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా మారపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా జక్కే సుమన్ (సాయి), శనిగరపు దేవేందర్, సెక్రటరీగా దండ వేన మధు, జాయింట్ సెక్రటరీగా జీడి కుమార్, లను ఎన్నుకున్నట్టు జమ్మికుంట లోకల్ ఆటో యూనియన్ అధ్యక్షుడు మారేపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
సగర సంఘ సేవలు అభినందనీయం

వీణవంక/ధనాధన్ న్యూస్: సగర సంఘం సేవలు అభినందనీయమని హన్మకొండ పట్టణానికి చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ గుండేటి గణేష్ అన్నారు.సగర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు కోరిక మేరకు మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలోని సగర సంఘ కార్యాలయంలో సగర సంఘం నేతృత్వంలో హన్మకొండలోని గణేస్ ఐ కేర్ అండ్ ఆఫ్టికల్స్,సాయితేజ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ […]
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దళితులకు న్యాయం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందని,దళిత బంధు నిధుల విడుదల ద్వారా మరోసారి అది రుజువైందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం రోజున ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్లు ఎమ్మెల్సీగా,ప్రభుత్వ విప్ గా ఉన్న కౌశిక్ రెడ్డి దళిత బంధు నిధులు విడుదల చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు.దళితుల భావోద్వేగాలను రెచ్చగొట్టి దళితులతో దళిత బంధు రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గత […]
అపార్ ఐడీ నమోదు వేగవంతం చేయాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: ప్రతి విద్యార్థి యొక్క అపార్ ఐడీ వివరాలను యూడైస్ ప్లస్లో నిక్షిప్తం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జమ్మికుంట ఇంచార్జ్ మండల విద్యాధికారి మంతెన హేమలత పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాల్ లను ఆదేశించారు.. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కళాశాలలు సందర్శించారు..ఈ సందర్భంగా మండల విద్యాధికారి హేమలత మాట్లాడుతూ ఒక విద్యార్థి ఒక దేశం అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన యూడైస్ ప్లస్ విధానంలోకి విద్యార్థుల వివరాలను […]
సామాజిక కార్యకర్త ముసుగులో బ్లాక్ మెయిల్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సామాజిక కార్యకర్త ముసుగులో అనేక బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న సాబీర్ ఆలీ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ అన్నారు. జమ్మికుంట పట్టణంలో గల ప్రెస్ క్లబ్ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ సాబీర్ అలీ బ్లాక్మెయిల్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నీరుగారిస్తున్నారని అన్నారు. దళితులకు రక్షణ కవచంగా ఉన్న […]
బండి సంజయ్ అహంకార పూరిత మాటల్ని ఆపాలే

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.మాజీ దేశ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు చేసి ఈ దేశానికి సేవలందించిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ని ఉగ్రవాది తో పోల్చడంపై బండి సంజయ్ వాఖ్యలను జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఈ విధంగా మాట్లాడడం నీతిమాలిన […]
ఉత్తమ సేవా అవార్డు అందుకున్న చందుర్తి డిప్యూటీ తాహసిల్దార్ కె.శ్రీలత

రాజన్న సిరిసిల్ల జిల్లా/ధనాధన్ న్యూస్: చందుర్తి మండలం లోని తాహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న కే శ్రీలతకు ఆదివారం 26 గణతంత్ర దినోత్సవం రోజున పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహజాన్ చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు ప్రశంస పత్రం అందుకున్నారు.ఈ స్ఫూర్తితో మరింత సేవ చేయాలని సూచించారు.
ఆ గ్రామంలో మద్యం అమ్మేవారి చెప్తే 10 వేల నజరానా

కామారెడ్డి/ధనాధన్ న్యూస్: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామస్థులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోతాయిపల్లి గ్రామస్థులు తమ గ్రామంలో మద్యనిషేధం విధిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో బెల్టుషాపులు ఎక్కువవటం వల్ల యువకులు, రైతుకూలీలు మద్యానికి బానిసలై ఆర్థికంగా నష్టపోతున్నారని.. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్న విషయాలను పరిగణలోకి తీసుకుని.. మద్యనిషేధం విదిస్తున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ మద్యనిషేధ తీర్మానం.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని తెలిపారు.అయితే.. ఫిబ్రవరి ఒకటో తారీఖు […]
