జమ్మికుంట ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం – దంపతులకు గాయాలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,సెప్టెంబర్ 3:జమ్మికుంటలో ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దంపతులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే,తనుగుల గ్రామానికి చెందిన బొల్లు మధుకర్ రెడ్డి తన భార్య బొల్లు శ్రీలతతో కలిసి ద్విచక్ర వాహనంపై (AP 15 AY 9284) ఆగస్టు 27న జమ్మికుంటకు వచ్చారు. పని ముగించుకొని తిరిగి తనుగుల గ్రామానికి వెళ్లే క్రమంలో, జమ్మికుంట ఫ్లైఓవర్ వద్దకు చేరుకునే సరికి, వెనుక నుంచి అతివేగంగా నుంచి వచ్చిన కారు (TS 02 … Read more

జమ్మికుంటలో గణేష్ నవరాత్రుల ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పడాల రాహుల్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ నియోజకవర్గం, జమ్మికుంట పట్టణంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా యువసేన యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కరీంనగర్ జిల్లా మెంబర్ పడాల రాహుల్ పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలతో మాట్లాడుతూ పడాల రాహుల్, సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందేందుకు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. యువతతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా … Read more

ఆర్టీవో నూతన భవన నిర్మాణానికి కృషి

హుజురాబాద్, సెప్టెంబర్ 03 (ధనాధన్ న్యూస్):హుజురాబాద్ ఆర్టీవో కార్యాలయానికి కొత్త భవనం నిర్మాణం కోసం కృషి చేస్తానని రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కేసి క్యాంప్‌లో గల ఆర్టీవో కార్యాలయాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వేణు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం పడాల రాహుల్ మాట్లాడుతూ, హుజురాబాద్ డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన … Read more

జమ్మికుంటలో గణేష్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారుల సూచనలు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్ ఆగస్టు 26:రేపటి నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలో అధికారులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఈ రోజు జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్. రామకృష్ణ, మండల తహసీల్దార్ (ఎం.ఆర్.వో), మున్సిపాలిటీ సిబ్బంది,ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు సమావేశమై ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద విద్యుత్ వైరింగ్‌ను తప్పనిసరిగా లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్ ద్వారానే చేయాలని స్పష్టం చేశారు. వైరింగ్‌లో … Read more

అక్క చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్ : రాఖీ పౌర్ణమి సందర్భంగా హుజురాబాద్ పట్టణానికి  చెందిన తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్ ని ఆయన  నివాసంలో సోదరి అశ్విని, తదితర సోదరీమణులు రాఖీలు కట్టారు. ముందుగా హారతి ఇచ్చి తిలకం దిద్ది రాఖీ కట్టిన అనంతరం నోరు తీపి చేసి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎల్ వి అర్జున్ మాట్లాడుతూ, రక్షాబంధన్ పండుగ కులమతాలకు అతీతంగా సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీక. ఈ పండుగ మనసుల్లో ప్రేమ, … Read more

కౌశిక్ రెడ్డి దృష్టి చిల్లర రాజకీయాల మీద-మా దృష్టి అభివృద్ధి మీద

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కేసీఆర్,కేటీఆర్ మెప్పు పొందడానికే కౌశిక్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని,అభివృద్ధిని గాలికి వదిలేసి చిల్లర రాజకీయాల మీద దృష్టి పెడితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్డిఎఫ్ ఫండ్ కింద పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అభివృద్ధి చేస్తున్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు.మంగళవారం నాడు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి విద్య,వైద్య … Read more

నిరుద్యోగుల యువతి యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్లో తేదీ జూలై  21 2025 సోమవారం రోజున  హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా  జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని బిఆర్ఎస్వి టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ ఓ ప్రకటనలో తెలిపారు. హుజురాబాద్ నియోజవర్గం లో ఉన్నటువంటి నిరుద్యోగులు టెన్త్, ఇంటర్మీడియట్,డిగ్రీ,పీజీ,బీటెక్, చదువుకున్న ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం  చేసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది వారు తెలిపారు. అదేరోజు రిక్రూట్మెంట్ కూడా … Read more

తప్పుడు పత్రాలతో అధికారులను మోసం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తప్పుడు పత్రాలు సృష్టిస్తూ అధికారులను మోసం చేస్తూ దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తున్న భూ కబ్జాదారులపై  ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్యఅన్నారు .మంగళవారం జమ్మికుంట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తనను మానసికంగా హింసిస్తున్నారని, ప్రజల్లో తనను ఒక తప్పుడు వ్యక్తిగా సూచిస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .దళితుడైన తనను కొంతమంది కావాలని … Read more

రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ

వీణవంక/ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ఎక్కడ జరిగిందో వివరించాలని వీణవంక మండల కేంద్రానికి చెందిన రైతు నాయకుడు నీల పున్నం చెందర్ అన్నారు. గడిచిన సంవత్సర కాలం నుంచి ఇప్పటివరకు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికి కూడా రుణమాఫీ కాక లబోదిబో అంటున్న రైతులు, ఎవరికి రుణమాఫీ చేశారు. మేము రైతులం కాదా మాకెందుకు రుణమాఫీ చేయలేదు.. ఇప్పటివరకు మా గురించి కాంగ్రెస్ … Read more

ప్రవేట్ పాఠశాల యాజమాన్యం,బుక్ స్టాల్స్ యజమాన్యాలపై  చర్యలు తీసుకోవాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలపై బుక్ స్టాల్ యాజమాన్యాలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్ డిఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మికుంట పట్టణం లో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూల్స్ సిండికేట్ అయ్యారని  బుక్ స్టాల్స్ యజమానియాలతో ఒప్పందం  చేసుకున్నారనీ బుక్ స్టాల్స్ యాజమాన్యాల దగ్గరికి వెళ్లి తక్కువ ధర ఉన్న పుస్తకాలకు ఎక్కువ ధరలకు విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారని … Read more