ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టదా?

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, పట్టణ ప్రజల ప్రాణాల పట్ల వారి ఉదాసీనతకు నిలువెత్తు నిదర్శనంగా మారింది జమ్మికుంట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పరిసర ప్రాంతం. బ్రిడ్జి డౌన్ ప్రాంతంలో ఒకవైపు రిలయన్స్ పెట్రోల్ పంపుకు ముందు, మరొకవైపు బస్టాండ్‌కు వెళ్లే దారిలో భారీగా, ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలు గత కొంతకాలంగా వాహనదారులకు,స్థానికులకు నరకాన్ని చూపుతున్నాయి.ప్రజల నుంచి పన్నుల వసూళ్లలో మాత్రం మున్సిపాలిటిని రాష్ట్రం లో మొదటి స్థానంలో ఉంచుతున్న మున్సిపల్ అధికారులు , పట్టణ […]

గోనె సంచిలో గుర్తుతెలియని శవం లభ్యం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలంలోని శంభునిపల్లె గ్రామ శివారులో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.పోలీసుల అంచనా ప్రకారం, మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని,మృతదేహాన్ని గుర్తుతెలియని దుండగులు ఎక్కడో హత్య చేసి,గోనె సంచిలో కట్టి,అనంతరం వాహనంలో తీసుకువచ్చి శంభునిపల్లె శివారులో పడేసినట్లు తెలుస్తోంది.కేసు నమోదు చేసి ఈ ఘటనపై జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.హత్యకు గురైన వ్యక్తిని గుర్తించేందుకు మరియు ఈ దారుణానికి […]

ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులు

కరీంనగర్/ధనాధన్ న్యూస్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొత్తపల్లిలో సుదీర్ఘకాలం ఆంగ్ల ఉపాధ్యాయులుగా సేవలందించిన కనపర్తి రమేష్ ఉద్యోగ విరమణ సమావేశం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి (DEO) శ్రీరామ్ మొండయ్య హాజరయ్యారు. ఈ సమావేశంలో శ్రీరామ్ మొండయ్య మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులని అన్నారు. వారి యొక్క క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం పిల్లల భవిష్యత్తుపై చాలా గొప్ప ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు.పదవీ విరమణ పొందిన కనపర్తి రమేష్ సేవలను […]

చెక్ డ్యాం కుంగడంపై బీఆర్ఎస్ అబద్ధాల ప్రచారం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తనుగుల పరిధిలోని శంభునిపల్లి-గుంపుల చెక్ డ్యాం కుంగిపోయిన సంఘటనపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలు, ఆరోపణలను హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ గురువారం తీవ్రంగా ఖండించారు. రామభద్ర స్వామి సాక్షిగా బీఆర్ఎస్ అబద్ధాలు చెప్తోందని మండిపడ్డారు.జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో విలేకరుల సమావేశం నిర్వహించిన ప్రణవ్, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పైనే చర్యలుచెక్ డ్యాం కుంగడంపై ప్రస్తుతం విచారణ […]

స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు మంజూరు: ఒడితెల ప్రణవ్ బాబు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా,గ్రామీణ ప్రాంతాల్లోనీ మహిళ స్వయం సహాయక సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తోడుగా ఉంటుందని,హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో 3,952 లబ్ధిదారులకు 3 కోట్ల 83 లక్షల వడ్డీలేని రుణాల నిధులను విడుదల చేసామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళ అభివృద్ధి ప్రాధాన్యతగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని గృహలక్ష్మి,మహాలక్ష్మి లాంటి అనేక […]

మల్లన్నపల్లి గ్రామ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తా: కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గంధం రవీందర్

ఇల్లందకుంట, నవంబర్ 25: ఇల్లందకుంట మండల పరిధిలోని మల్లన్నపల్లి గ్రామ సమస్యల పరిష్కారం కోసం తాను అలుపెరుగని పోరాటం చేస్తానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ టికెట్ ఆశిస్తున్న గంధం రవీందర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.మంగళవారం గంధం రవీందర్ ఓ ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను దృష్టిలో […]

గురుకులంలో బాలిక మృతి బాధాకరం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో హుజురాబాద్ మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ వర్షిత అనే బాలిక ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని,దీనిపై ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారని, నివేదిక రాగానే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం నాడు ఆయన రాంపూర్ గ్రామానికి వెళ్ళి బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా బాలిక తల్లితండ్రులు […]

రాజీవ్ యువ వికాసం పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

వీణవంక/ధనాధన్ న్యూస్: ప్రభుత్వ ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇచ్చిన వాగ్దానాలన్నీ తుంగలో తొక్కుతూ యావత్ ప్రజానీకాన్ని మోసం చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాలను ఆరు గ్యారంటీలను 420 హామీలను అమలు దిశగా చర్యలు చేపట్టాలని యువతకు రాజీవ్ యువ వికాసం పథకం 2025 దరఖాస్తు  ఏప్రిల్ 14,  ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగ యువతకు రాయితీ రుణాలను ఇస్తానని చెప్పి మోసం చేసి నేటి వరకు […]

సిరిసేడులో బాడీ ఫ్రీజర్ బాక్స్ వితరణ

ఇల్లందకుంట,అక్టోబర్21: ఇల్లందకుంట మండలం సిరిసేడు ప్రజల అవసరార్థం బాడీ ఫ్రీజర్ బాక్స్ ని షఫీ ఖాన్  తన సొంత నిధులతో కొనుగోలు చేసి మంగళవారం గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్ కి వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా షఫీ ఖాన్ మాట్లాడుతూ… తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామ ప్రజలకు సౌకర్యం కోసం సుమారు 61వేల రూపాయల విలువ చేసే ఫ్రీజర్ బాక్స్ ని అందజేసినట్లు తెలిపారు. ప్రజల కోరిక మేరకు భవిష్యత్ లో వైకుంఠ రథం కూడా […]

సైదాపూర్ మండలంలో బిసి జేఏసీ ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగిసిన బంద్

సైదాపూర్, అక్టోబర్ 19 :తెలంగాణ రాష్ట్ర బిసి సంఘాల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ను సైదాపూర్ మండలంలో కూడా విజయవంతంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు గ్రామాలన్నింటిలో వ్యాపార, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. మండల బిసి జేఏసీ అధ్యక్షుడు జంపాల భూపతి మాట్లాడుతూ —“బీసీలకు 42 శాతం రాజకీయ, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు ఆమోదించింది. ఆ బిల్లును కేంద్రం 9వ షెడ్యూల్‌లో చేర్చేలా […]