ఆర్టీవో నూతన భవన నిర్మాణానికి కృషి

హుజురాబాద్, సెప్టెంబర్ 03 (ధనాధన్ న్యూస్):హుజురాబాద్ ఆర్టీవో కార్యాలయానికి కొత్త భవనం నిర్మాణం కోసం కృషి చేస్తానని రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కేసి క్యాంప్‌లో గల ఆర్టీవో కార్యాలయాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వేణు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం పడాల రాహుల్ మాట్లాడుతూ, హుజురాబాద్ డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన […]
ఆకునూరులో అన్నదానం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామంలో వాయుపుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అన్నదాత గుర్రాల సంజీవ్ ఉమా దంపతులు మాట్లాడుతూ గ్రామ ప్రజల సుఖసంతోషాల కోసం, అష్ట ఐశ్వర్యాలు, సిరిసంపదలు లభించాలని గణనాధుని ప్రార్థించామని తెలిపారు.అన్నదానం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాయుపుత్ర యూత్ అసోసియేషన్ సభ్యులు, ఆకునూరు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా రాఘన్

సైదాపూర్/ధనాధన్ న్యూస్:యూత్ కాంగ్రెస్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా రాఘన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాఘన్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ డైరెక్టర్ చోటే మియా మాట్లాడుతూ – రాఘన్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విశేష కృషి చేశారని అన్నారు. రాఘన్ ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ఎండీ చోటే మియా, పల్లె గోపాల్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ […]
బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 2:భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీకి అనుబంధంగా ఉన్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన, పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. సస్పెన్షన్ వెనుక కారణాలు ఇటీవల కాలంలో కవిత పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని, పార్టీకి ఇబ్బందులు కలిగించే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. క్రమశిక్షణలో లోపం ప్రదర్శించినందుకు […]
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్

హైదరాబాద్/ధనాధన్ న్యూస్, ఆగష్టు 26: తెలంగాణలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ కోసం కీలకమైన ఓటర్ల జాబితా సవరణ పనులను ప్రారంభించింది. హైకోర్టు కీలక తీర్పు 2024 జనవరి 31తోనే తెలంగాణలోని సర్పంచుల పదవీకాలం ముగిసింది. దీంతో గ్రామాల్లో సర్పంచ్ చెక్ పవర్ నిలిచిపోగా, […]
జమ్మికుంటలో గణేష్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారుల సూచనలు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్ ఆగస్టు 26:రేపటి నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలో అధికారులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఈ రోజు జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్. రామకృష్ణ, మండల తహసీల్దార్ (ఎం.ఆర్.వో), మున్సిపాలిటీ సిబ్బంది,ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు సమావేశమై ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద విద్యుత్ వైరింగ్‌ను తప్పనిసరిగా లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్ ద్వారానే చేయాలని స్పష్టం చేశారు. వైరింగ్‌లో […]
అక్క చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్ : రాఖీ పౌర్ణమి సందర్భంగా హుజురాబాద్ పట్టణానికి చెందిన తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్ ని ఆయన నివాసంలో సోదరి అశ్విని, తదితర సోదరీమణులు రాఖీలు కట్టారు. ముందుగా హారతి ఇచ్చి తిలకం దిద్ది రాఖీ కట్టిన అనంతరం నోరు తీపి చేసి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎల్ వి అర్జున్ మాట్లాడుతూ, రక్షాబంధన్ పండుగ కులమతాలకు అతీతంగా సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీక. ఈ పండుగ మనసుల్లో ప్రేమ, […]
నిరుద్యోగుల యువతి యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్లో తేదీ జూలై 21 2025 సోమవారం రోజున హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని బిఆర్ఎస్వి టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ ఓ ప్రకటనలో తెలిపారు. హుజురాబాద్ నియోజవర్గం లో ఉన్నటువంటి నిరుద్యోగులు టెన్త్, ఇంటర్మీడియట్,డిగ్రీ,పీజీ,బీటెక్, చదువుకున్న ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది వారు తెలిపారు. అదేరోజు రిక్రూట్మెంట్ కూడా […]
తప్పుడు పత్రాలతో అధికారులను మోసం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తప్పుడు పత్రాలు సృష్టిస్తూ అధికారులను మోసం చేస్తూ దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తున్న భూ కబ్జాదారులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్యఅన్నారు .మంగళవారం జమ్మికుంట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తనను మానసికంగా హింసిస్తున్నారని, ప్రజల్లో తనను ఒక తప్పుడు వ్యక్తిగా సూచిస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .దళితుడైన తనను కొంతమంది కావాలని […]
నాకు ప్రాణహాని ఉంది

శంకరపట్నం/ధనాధన్ న్యూస్: శంకరపట్నం మండలం, మొలంగూర్ (గుడాటిపల్లె) గ్రామానికి చెందిన సింగిరెడ్డి శ్రీధర్ రెడ్డి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, భూ వివాదాల నేపథ్యంలో గుర్రం సంజీవ్ రెడ్డి, కిషన్ రెడ్డి కుటుంబ సభ్యుల నుంచి తమకు న్యాయం కావాలని మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. శ్రీధర్ రెడ్డి తన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, 2006లో గుర్రం కిషన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి తమ తండ్రి పెద్ద మల్లారెడ్డికి సర్వే నెం. 231లో 8 […]
