భూ ఆక్రమణలపై కలెక్టర్ కు పిర్యాదు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే25:సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని మాజీ సర్పంచ్ తన కుటుంబ సభ్యుల పేరున అక్రమ పట్టా చేసి ఆక్రమించుకున్నాడని గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే గ్రామ శివారు లోని మసీదు దగ్గర భూమిని పూర్వం అంబేద్కర్ భవనం,ప్రాథమిక పశువుల వైద్యశాలకు కేటాయించిన భూమిని ఇందిరా సుధీర్ కుమార్ గౌడ్ సర్పంచ్ పదవిలో కొనసాగుతూ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి సర్వేనెంబర్ 399/ఆ లో సుమారు […]
విత్తన డీలర్లతో వ్యవసాయ అధికారుల సమావేశం

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే25:వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏడీఏ జీ.సునిత మాట్లాడుతూ విత్తన డీలర్లు అందరూ కూడా అనుమతి ఉన్న విత్తనాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని,విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతి రైతుకి బిల్లు తప్పనిసరిగా అన్ని వివరాలతో ఇవ్వాలని,విత్తన అమ్మకాల వివరాలు రైతు వారీగా రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపారు.రైతుకు నష్టం కలిగేలా ఎలాంటి విత్తన అమ్మకాలు,ఎరువులు,పురుగుమందుల అమ్మకాలు చేయకూడదని,ఏదైనా […]
నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)మే24:వర్షాకాలం వస్తుండడంతో రైతులు దుక్కి దున్ని పంట సాగుచేయడానికి విత్తనాలు ఎప్పుడు వస్తాయా పంట ఎప్పుడు వేయాలా అని ఎదురుచూస్తూ ఉంటారని,రైతుల అవసరాన్ని ఆసరా చేసుకునే కొందరు నకిలీ విత్తనాలు రైతులకు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తారని రైతులు జాగ్రత్తగా ఉండాలని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ తెలిపారు.హుజురాబాద్ లోని ఏసీపీ కార్యాలయం లో డివిజన్ లోని పోలీస్ అధికారులతో కలిసి జై కిసాన్ పోస్టర్ ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఏసీపీ శ్రీనివాస్ జీ […]
అఖండ హరినామ సంకీర్తనలో పాల్గొన్న రాములపల్లి భజన మండలి సభ్యులు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే24:సైదాపూర్ మండలం రాములపల్లి గ్రామానికి చెందిన భజన మండలి సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానంలో 24 గంటలు అఖండ హరినామ సంకీర్తనలతో జరిగే భజన కార్యక్రమం పాల్గొని దాదాపు 4 గంటలపాటు హరినామ సంకీర్తన భక్తి గీతాలతో హరినామ స్మరణలో పాల్గొన్నామని కందుల శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహాదేవుని సత్యనారాయణ, దొనకొండ సమ్మిరెడ్డి,ఇరుమల్ల జెపాల్ రెడ్డి,తిరుపతి రెడ్డి, మధుసూదన్ రెడ్డి,నవీన్ రెడ్డి,సురేష్,సంపత్, రాము,నరేందర్ రెడ్డి,సురేందర్ రెడ్డి,రాములు, వెంకటనర్సు తదితరులు పాల్గొన్నారు.
ముస్లింలకు ఓబిసి సర్టిఫికెట్ల రద్దు పట్ల హర్షం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే24:దేశంలో ఎక్కడ లేని విధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం కులాలకు జారీచేసిన ఓబీసీల ధ్రువీకరణ పత్రాలను కోర్టు రద్దు చేయడం పట్ల ఓబిసి మోర్చా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు.శుక్రవారం జమ్మికుంటలో ఆయన మాట్లాడుతూ 2010 సంవత్సరం లో పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం ముస్లింలకు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేసిందని, దీంతో లక్షలాదిమంది ఓబీసీలకు తమకు అందాల్సిన ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని, […]
ఉచిత వైద్య శిబిరానికి విశేషా స్పందన.

ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)మే23:మర్రిపెల్లిగూడెంలో అమృత హాస్పిటల్ మరియు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట వైద్యులు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.ఈ వైద్య శిబిరానికి సుమారుగా 400 ల మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి సుమారుగా 80000 రూపాయల విలువగల మందుల ఉచితంగా పంపిణీ చేయడం జరిగినది. ఇట్టి వైద్య శిబిరంలో సూపర్ స్పెషలిటీ వైద్యులు డా.భావనా రెడ్డి నరాల వైద్య నిపుణులు,డా.ప్రశాంత్ రెడ్డి గుండె వైద్య నిపుణులు,డా.శ్రీనివాస్ జనరల్ ఫిజిషియన్,డా.విజేత […]
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

ధనాధన్ న్యూస్ మే23:సైదాపూర్ మండల కేంద్రం నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సైదాపూర్ ఎస్సై తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం,గురువారం తెల్లవారు జామున ఎస్సై పోలీసు సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా వెంకటేశ్వర్లపల్లి గ్రామ శివారులో టీఎస్ 08 UB 3009 టాటా ఏసీ వాహనం వదిలి వెళ్ళగా వాహనాన్ని తనిఖీ చేయడంతో అందులో 26క్వింటాల రేషన్ బియ్యం ఉన్నాయని బండి నెంబర్ ఆధారంగా వల్లెపు అనిల్ […]
వేసవి తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలను సీజ్ చేయాలి

ధనాధన్ న్యూస్ మే23: బోర్డ్ నిబంధనలను ఉల్లంగిస్తూ అక్రమంగా నడిపిస్తూ వేసవి తరగతులు నిర్వహిస్తున్న కరీంనగర్ నగరంలోని ప్రైవేట్ కళాశాలల ను సీజ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని, ఇంటర్ బోర్డ్ నిబంధనలను భేకాతరు చేస్తున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్ బోర్డ్ విఫలం చెందిందని బోనగిరి మహేందర్ బ్రాహ్మణపల్లి యుగంధర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు బోనగిరి మహేందర్, ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణ పెళ్లి యుగంధర్ మాట్లాడుతూ […]
ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే21:సైదాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవ భారత నిర్మాత నవ యువతకు స్ఫూర్తి మాజీ ప్రధాని,భారత రత్న స్వర్గీయులు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు సైదాపూర్ మండల కేంద్రంలో కొత్త బస్ స్టేషన్ అవరణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంత సుధాకర్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మల వేసి ఘన నివాళి అర్పించడం […]
అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులను ఆదుకోవాలి

కరీంనగర్(ధనాధన్ న్యూస్)మే18:గత రెండు రోజుల నుండి రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యం కారణంగా అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి పైడిపల్లి రాజు ఒక ప్రకటనలో శనివారం ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా పైడిపల్లి రాజు మాట్లాడుతూ మార్కెట్ కల్లాలలో,ఐకెపి కేంద్రాలలో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి పోయిందని, పండ్ల తోటలు మామిడి,సపోటా బొప్పాయి తదితర కాయలు ఈదురు గాలులకు నేలమట్టమై తీవ్ర నష్టం వాటిలిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం […]
