మంత్రి పొన్నం ఆవేశం స్టార్ కాదు..ఆత్మ గౌరవ స్టార్..

హుజురాబాద్ మార్చ్ 23:కరీంనగర్ లో మీడియా సమావేశంలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పై అనుచిత వ్యాఖ్యలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై ఒక ప్రకటనలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ ఉంటే చెక్కులు నువ్వు పంచలేదా,అప్పుడు మీకు ప్రోటోకాల్ గుర్తుకు రాలేదా?మా మంత్రి తెలంగాణ ఆత్మగౌరవం కోసం పార్లమెంట్ లో ప్రాణాలకు తెగించి కొట్లడారు.విద్యార్థి ఉద్యమాల దశ నుంచి […]
మంత్రి పొన్నంని ఆవేశం స్టార్ అన్న పాడి కౌశిక్ రెడ్డి

కరీంనగర్ మార్చ్ 23:బిఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన దానం నాగేందర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయనను ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఉందని వెంటనే ఆయనను సస్పెండ్ చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.శనివారం కరీంనగర్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన అవసరం తెలంగాణ స్పీకర్ కు ఉందని […]
పొలిటికల్ బ్రోకర్ పాడి కౌశిక్ రెడ్డి

సైదాపూర్ మార్చ్23:హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేడు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలంలో స్థానిక మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొంత సుధాకర్,కాంగ్రెస్ నేతలు గుండారపు శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య తదితర నాయకులతో కలిసి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ […]
భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ఉద్యమించాలి

కరీంనగర్ మార్చ్ 23:ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93 వ వర్ధంతిని పురస్కరించుకొని బోయవాడలోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.అనంతరం ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగశీలి, నేటి యువతకు ఆదర్శప్రాయుడైన భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని సామ్రాజ్యవాద పాలకుల విధానాలపై గళం విప్పేందుకు యువత నడుం బిగించాలన్నారు.భారతదేశంలో 1907 సెప్టెంబర్ 28న పంజాబ్ రాష్ట్రం రాయల్‌పూర్ జిల్లా బంగా […]
ఘనంగా భగత్ సింగ్ 93వ వర్ధంతి వేడుకలు

హుజురాబాద్,మార్చ్ 20: హుజురాబాద్ పట్టణ కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ మాట్లాడుతూ.. భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ ముష్కరులను ఎదిరించి పోరాడి దేశానికి స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడడాని పేర్కొన్నారు. భగత్ సింగ్ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భగత్ సింగ్ కి భారతరత్న […]
టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) హుజురాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని ప్రెస్‌క్లబ్ కార్యాలయంలో ముస్లీం పాత్రికేయులు,అధికారులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. పాత్రికేయులు అంటే కేవలం సమాజంలోని సమస్యల పట్ల జవాబుదారిగా ఉండటమే కాకుండా అన్నీ మతాలను గౌరవిస్తూ ఉంటామని జమ్మికుంట జర్నలిస్టులు ఈ సందర్భంగా వెల్లడించారు.ఇఫ్తార్ విందుకు […]
సైదాపూర్ లో అక్రమ మద్యం సీజ్

సైదాపూర్ మండలం:సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎస్ఐ మరియు సిబ్బందితో సంయుక్తంగా పెట్రోలింగ్ చేస్తుండగా సైదాపూర్ గ్రామ శివారులో ఒక వ్యక్తీ కాటన్ డబ్బాలో మద్యం బాటిల్లను పెట్టుకొని ఉండగా అతని ఆపి తనిఖీ చేయగా బొమ్మనపల్లి గ్రామానికి చెందిన మామిడి రాజయ్య వద్ద 10.980 లీటర్ల మద్యం బాటిల్లు సుమారు 9,900/- రూపాయల మద్యం లభ్యం కావడం జరిగిందని,వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.ప్రస్తుతం ఎన్నికల […]
జెఎస్అర్ కూలింగ్ చలివేంద్రం ప్రారంభం

సైదాపూర్ మండలం:సైదాపూర్ మండల కేంద్రంలో కొత్త బస్ స్టాండ్ అవరణలో గురువారం రోజున వేసవి కాలం దృశ్య ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతియేటా ఏర్పాటు చేసిన విధంగానే ప్రస్తుత సంవత్సరం కూడా జెఎస్అర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి బస్టాండ్ వద్ద చల్లని నీటిని అందించేందుకు ఫ్రిజ్ లు ఏర్పాటు చేశారు.కూలింగ్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేసి మండల కేంద్రానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చే జెఎస్అర్ సేవ భావానికి కృతజ్ఞతలు […]
కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సిరిసేడు గ్రామ ముదిరాజ్ సంఘ అధ్యక్షులు

జమ్మికుంట, మార్చి20 : ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రెడ్డి సారంగం బిజెపి పార్టీకి రాజీనామా చేసి సిరిసేడు మాజీ ఎంపీటీసీ నేరెళ్ల కుమార్ ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో తీర్థం పుచ్చుకున్నారు.కాగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.ముదిరాజ్ సంఘ గౌరవ అధ్యక్షులు పుట్ట కుమారస్వామి, ఉపాధ్యక్షులు పుట్ట […]
తెలంగాణ వాణి 12 వ వార్షికోత్సవ ఆత్మీయ సమావేశం

హనుమకొండ హరిత హోటల్లో తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల ఆర్ సి లు బ్యూరోలు ఇన్చార్జిలు వివిధ మండలాల రిపోర్టర్స్ 12వ వార్షికోత్సవ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ వాణి ఎడిటర్ జేరిపోతుల సంపత్ స్టేట్ కోఆర్డినేటర్ మామునూరి సంపత్,అఫ్జల్ పఠాన్ న్యూస్ కో ఆర్డినేటర్,సైదాపూర్ మండల్ తెలంగాణ వాణి జర్నలిస్ట్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ నిజాలను నిర్భయముగా రాస్తూ అక్షరాలను తూటాలుగా పేలుస్తూ అలుపెరుగని అక్షర యోధులు తెలంగాణ వాణి జర్నలిస్టులు […]
