తెలుగు గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్ సాధించిన ఐదు నెలల చిన్నారి

రాజన్న సిరిసిల్ల జిల్లా,ధనాధన్ న్యూస్: పువ్వు పుట్టగానే పరమ ళిస్తుందన్న నానుడి ఆ చిన్నారికి అక్షరాలా సరిపోతుంది. కేవలం ఐదు నెలల వయసులోనే అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తూ అందరి నోట ఔరా అనిపిస్తోంది. అమ్మ అని పలకడం కూడా రాని చిట్టి వయసులో 70కి పైగా వస్తువులను గుర్తించి అందరి ప్రశంసలు అందు కోవడమే గాక,తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లు చోటు కూడా సంపాదించింది ఆ చిన్నారి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల […]
జమ్మికుంట లో ఉచిత మెగా వైద్య శిబిరం

జమ్మికుంట పట్టణంలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది.ఈ క్యాంపులో 140 మంది రోగులు వారికి ఉన్న అనారోగ్య సమస్యలను చూపించుకున్నారు.వీరికి ఉచిత రక్త పరీక్షలు-మూత్ర పరీక్షలు మరియు గుండె పరీక్ష (ఈసీజీ) చేసి సీనియర్ డాక్టర్లు ఆకుల శ్రీనివాస్(జనరల్ ఫిజీషియన్),కార్తీక్ రెడ్డి (సర్జన్) లచే పేషెంట్లకు ఉన్న రోగ నిరోధకతను గుర్తించి వారికి సలహాలు మరియు సూచనలు చెప్పి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో […]
అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల నుండి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి ఒక ప్రకటనలో తెలిపారు.ఈరోజు జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన పలువురు ఇసుక ట్రాక్టర్ యజమానులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తూ అడ్డుకుంటున్న పోలీస్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన విలాసాగర్ గ్రామానికి […]
ఘనంగా యుప్ టీవీ అధినేత జన్మదిన వేడుకలు

వీణవంక,ధనాధన్ న్యూస్: వీణవంక మండలకేంద్రంలో యుప్ టీవీ అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి జన్మదిన వేడుకలును యాప్ టీవీ ఉద్యోగులు మరియు టూరిటో మహిళా ఉద్యోగులు,వీణవంక గ్రామస్తులు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఉద్యోగులు మరియు స్థానికులు మాట్లాడుతూ అన్నా అంటే నేనున్నానని ఈ నియోజకవర్గంలోని ఐదు మండలాల పేద ప్రజలకు అండగా ఉంటూ,నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న పాడి ఉదయ్ నందన్ రెడ్డి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో […]
రైతులెవరు అధైర్య పడవద్దు

హుజురాబాద్,ధనాధన్ న్యూస్: కమలాపూర్ మండలాల గ్రామాల రైతులకు సాగునీరు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని,రైతులకు సాగు పంటలకు సరిపడే నీళ్లు అందించేందుకు ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇంచార్జి ఒడితేల ప్రణవ్ ని కోరారు.కమలాపూర్ మండలం లోని శనిగరం,లక్ష్మీపురం,గుంటూరు పల్లి గ్రామాలకు చెందిన రైతులు తమ పంట పొలాలకు ఎస్ ఆర్.ఎస్.పి.కెనాల్ ద్వారా సాగునీళ్లు అందడం లేదని శనివారం రోజున హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ […]
ఘనంగా శ్రీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని బొమ్మల గుడి శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శనివారం వేద పండితుల మధ్య మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కమనీయం గా వైభవంగా ఆలయ అర్చకులు వేణుగోపాల్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం 85 వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి ఆలయ ట్రస్టిలు కొండూరు కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.భక్తులు స్వామి వారి కళ్యాణం మహోత్సవమ్ నేత్రపర్వంగా వీక్షించి మొక్కులు […]
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఉడిగే రాజశేఖర్

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన కోడం పద్మ(50) కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అనంతరం మణికంఠ మాడ్రన్ రైస్ మిల్ ఉడిగే విజయ రాజశేఖర్ 50 కిలోల బియ్యం సహాయం అందించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రకాష్,సురేష్,శ్రీనివాస్,ప్రవీణ్, చంద్రమోహన్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు వికాస సమితి జమ్మికుంట మండల అధ్యక్షుడిగా అనిల్ కొలుగూరి

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు వికాస సమితి (రి.1251/2016) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు యర్రమాద కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు జమ్మికుంట మండల అధ్యక్షులుగా కొలుగూరి అనిల్ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ఆశయాలను ఆదర్శాలను మండల వ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి,చట్టాలపై అవగాహన కల్పిస్తామన్నారు.సమాజంలో జరుగుతున్న అవినీతిని అక్రమాలను వెలికి తీసేందుకు సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధమని తెలిపారు.(సహవిస) జమ్మికుంట మండల అధ్యక్షుడిగా […]
కరీంనగర్ ను కరప్షన్,కలెక్షన్ కు కేరాఫ్ గా మార్చారు

కరీంనగర్,ధనాధన్ న్యూస్: కళకళలాడే కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ పుణ్యమాని, అవినీతి,అక్రమాలకు నిలయంగా,కరప్షన్ కలెక్షన్ కు కేరాఫ్ గా మారిందని జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.2014 నుంచి నిన్నటి వరకు జరిగిన భూమాఫియా ఇసుక మాఫియా గ్రానైట్ మాఫియా గుట్కా మాఫియా మట్కా మాఫియా జట్కా మాఫియా నడిపింది,బిఆర్ఎస్ నేత లేనని వీరందరూ […]
ఎలాగందుల ఎంపీ స్థానం హస్తగతం అయ్యేనా?

ఎడిటర్ డెస్క్,ధనాధన్ న్యూస్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది.ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ స్థానం గురించి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా కరీంనగర్ నే టార్గెట్ చేస్తున్నాయి. కాగా, ఈ సారి కరీంనగర్ పార్లమెంట్ స్థానం తప్పనిసరిగా కాంగ్రెస్ ఖాతాలోనే నమోదయ్యే విధంగా అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థిని బరిలో దింపితే గెలుపు అవకాశాలు తప్పనిసరిగా ఎక్కువగానే […]
