మృతుని కుటుంబానికి పరామర్శ

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామానికి  కేశవేణి రాయమల్లు(89) అనారోగ్యంతో ఇటీవలే మరణించగా వారి కుటుంబ సభ్యులను ఆదివారం రోజున పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అనంతరం మణికంఠ మాడ్రన్ రైస్ మిల్ ఉడిగే విజయ రాజశేఖర్  25కిలోల బియ్యం అందజేయడం జరిగిందని,గ్రామ ప్రజలకు ఎల్లవేళలా  ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పేసరు సంపత్,నీల కృష్ణ,అప్పాల మల్లేష్,కుందేళ్ళ సమ్మయ్య,పర్షవేణి విజయ్,టి శ్రీనివాస్,పొన్నం వెంకటయ్య,కేశవేణి బాలయ్య  పాల్గొన్నారు.

శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన వోడితల ప్రణవ్

వీణవంక,ధనాధన్ న్యూస్: వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలోని  శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ శుక్రవారం హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయనకు ఆలయ పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేవాలయాల విశిష్టత ప్రజలకు తెలిసే విధంగా దేవాలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బల కిషన్ […]

సిరిసేడు శివాలయం చైర్మన్ గా కొండ విజయ్ ఏకగ్రీవ ఎన్నిక

ఇల్లందకుంట,ధనాధన్ న్యూస్: ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామనికి చెందిన శ్రీ అపర్ణ సోమేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా కొండ విజయ్ ని ఏకగ్రీవంగా శనివారం ఎన్నిక చేస్తూ నియామకపు పత్రాన్ని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ అందజేశారు. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కమిటీకి సూచించారు.అనంతరం […]