ఎంపీగా వినోద్ కుమార్ ను గెలిపిస్తే మీ తోడుగా మేమిద్దరం ఉంటాం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే06:తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని మోసగాడని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హుజరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన రోడ్ షో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు.ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఎవరికి అమలు చేశారో కూడా చెప్పాలన్నారు.మహిళలకు 2500 పెన్షన్, … Read more

డైలాగులతో ఓట్ల రాజకీయం

వీణవంక(ధనాధన్ న్యూస్)మే 06:డైలాగులతో ఓట్ల రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్న రాజకీయ నాయకులకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా వీణవంక మండలంలోని మామిడాల పల్లి ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కష్టపడితేనే దేవుడు ఫలితాన్ని అందిస్తాడని,దేవుడి ఫోటో పెట్టుకుని అక్షింతలు వచ్చాయా అంటూ రాజకీయాలు చేయడం సరైనది కాదన్నారు.పేద బడుగు బలహీన … Read more

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్24:హుజరాబాద్ నియోజకవర్గంలో బుధవారం వివిధ వివాహ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రమాదంలో గాయపడ్డ యువకుడ్ని గుర్తించి దగ్గరుండి ఆసుపత్రికి పంపించి మానవత్వం చాటుకున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి.నియోజకవర్గంలోని పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు మర్రిపల్లిగూడెం నుంచి కన్నూరుకి వెళ్తుండగా మార్గమధ్యంలో ట్రాక్టర్ ఢీకొని మధు అనే యువకుడు తీవ్రంగా గాయపడటాన్ని గమనించిన ఎమ్మెల్యే తన కాన్వాయ్ … Read more

చేనేత కార్మికుల కష్టాలు వింటే గుండె బరువెక్కుతుంది

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్23:చేనేతల పరిస్థితి చూస్తే మనసు చలించిపోతుందని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి అన్నారు అన్నారు.మంగళవారం జమ్మికుంటలోని చేనేత సొసైటీ పర్యవేక్షణలో భాగంగా ఆయన మాట్లాడారు.జమ్మికుంట లోని చేనేత సంబంధించి సొసైటీ పర్యవేక్షణకు వస్తే సుమారు 80 లక్షల స్టాక్ మిగిలి ఉందని దీంతో పాటు హుజరాబాద్ నియోజకవర్గం లో అన్ని సొసైటీలను కలుపుకొని సుమారు 6 కోట్ల స్టాకు కొనుగోలు చేయకుండా మిగిలి ఉందని అన్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 15 కోట్ల వరకు … Read more

శ్రీ సీతారాముల కళ్యాణం..కనులవిందు

పట్టు సమర్పిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి. జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 17:అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం గురువారం కమనీయం రమణీయంగా జరిగింది.సీతా రామచంద్రస్వామి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మేళ తాళాల మధ్య వేదపండితుల వేదమంత్రోచరణ మధ్య ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వం తరఫున కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దంపతులు, హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి పట్టు వస్త్రాలను ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. … Read more

హస్తం గూటికి మరో బిఆర్ఎస్ కౌన్సిలర్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 16:హుజురాబాద్ లో గులాబీ పార్టీ నుండి మెల్లమెల్లగా ఒక్కొక్క లీడర్ జారుకుంటుంన్నారు.ఇప్పటికే పలువురు అధికారం లో ఉన్న నాయకులు బిఆర్ఎస్ పార్టీ ని వీడి కాంగ్రెస్ లో చేరగా,తాజా గా జమ్మికుంట పట్టణానికి చెందిన కౌన్సిలర్ శ్రీపతి నరేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.హైదరాబాద్ లో హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ఓడితల ప్రణవ్ బాబు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోని ఆహ్వానించారు.ఈ సందర్బంగా శ్రీపతి నరేష్ మాట్లాడుతూ తన చేరికకు సహకరించిన మంత్రి పొన్నం … Read more

బండి సంజయ్ మంత్రి  పొన్నం కాలిగోటి కూడా సరిపోడు

కరీంనగర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలకాలంలో ప్రజా వ్యతిరేక విధానాలు,తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయం,కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలలు మరియు విభజన చట్టంలో ఆమలు కాని హామీలపై ఆదివారంనాడు కరీంనగర్ లో బీసీ మరియు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన నిరసనదీక్షలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు.ఈ సంధర్బంగా అయన మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో ఉండక, ఉనికి కోసం పక్క నియోజకవర్గంలో వెళ్లి సినిమా డైలాగులు కొడుతున్నాడు.ముఖ్యమంత్రి … Read more

మున్నూరు కాపు యువగర్జన పోస్టర్ ఆవిష్కరణ

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 09:5000 కోట్లతో మున్నూరు కాపు ఆర్థిక కార్పొరేషన్ ప్రకటించాలని మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పోనగంటి మల్లయ్య అన్నారు. మంగళవారం స్థానిక మండల కేంద్రంలో మున్నూరు కాపు యువగర్జన పోస్టర్ ను మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఏభూషి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పొన్నగంటి మల్లయ్య,సింగిల్ విండో అధ్యక్షులు పొనగంటి సంపత్,మున్నూరు కాపు సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సాయిని రవి,ఆకుల రాజేందర్ లు మాట్లాడారు.ఈ నెల … Read more

మాదిగల ద్రోహి కాంగ్రెస్ పార్టీని ఓడించండి

హుజురాబాద్ ఏప్రిల్ 08:హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం హుజురాబాద్ లోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో మహాజన సోషలిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్ అధ్యక్షతన జరిగింది .ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ , ఇందిరా గాంధీ కాలము నుండి నేటి రాహుల్ గాంధీ  వరకు అధిక జనాభా కలిగిన మాదిగలు ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి … Read more

ప్రజా సమస్యల పరిష్కారమే నా ద్యేయం

జమ్మికుంట ఏప్రిల్ 08:కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజలందరి సమస్యల పరిష్కారానికి కొట్లాడుతానని స్వతంత్ర ఎంపీ అభ్యర్థి పేరాల మానస అన్నారు.సోమవారం ఆమె జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.తాను తొలుత తన సమస్యల పరిష్కారానికి మాత్రమే పోరాటం చేశానని, ఈ క్రమంలో చాలా మంది యువకులు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తన దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారని చెప్పారు.తన ఊరిలో మాత్రమే కాకుండా రకరకాల సమస్యలతో చాలా కుటుంబాలు … Read more