అసలు దళిత బంధు ఆపింది ఎవరు?

జమ్మికుంట పట్టణ కేంద్రం లో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి రాచపల్లి సాగర్ మాట్లాడుతూ అసలు దళిత బంధు రెండో విడత ఆపింది ఎవరో,ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.అలాగే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి దళిత బంధు రెండో విడత ఇవ్వడానికి రెండు నెలల కాలం ఉన్నప్పటికీ ఇవ్వకుండా దళిత బందుకు సంబంధించిన ఆఫీసర్లను భయభ్రాంతులకు గురిచేసి రెండో విడత ఆపి మళ్ళీ రెండో విడత మంజూరు చేయాలని చెప్పడం సరికాదని అన్నారు.అలాగే ఇప్పుడున్న […]

అధైర్య పడకండి అండగా ఉంటా

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: దళిత బందు రెండో విడత రాలేదని ఎవరూ అధైర్యపడి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని, దళితులందరికీ అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం దళిత బంధు రాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి ఆయనను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.దళిత బంద్ పథకాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గం ఎంపిక చేసి నియోజకవర్గంలోని దళితులందరికీ సుమారు 18 వేల పై […]

బీఆర్ఎస్ పార్టీకి జమ్మికుంట కౌన్సిలర్ల రాజీనామా.

జమ్మికుంట మున్సిపాలిటీ కి చెందిన 13 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన వారిలో బొంగోని వీరన్న,మారపెల్లి బిక్షపతి, మేడిపల్లి రవీందర్,ఎలాగందుల స్వరూప,పిట్టల శ్వేత, పొనగంటి రాము,పొనగంటి సారంగం,బిట్ల కళావతి,కుతాడి రాజయ్య,దేశిని రాధ,గుళ్లి పూలమ్మ,దిడ్డి రాము,రావికంటి రాజ్ కుమార్ ఉన్నారు.మున్సిపాలిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే ల వైఖరిలు నచ్చకనే పార్టీకి రాజీనామా చేస్తున్నామని లేఖలో తెలిపారు.

కుల సంఘ భవనాలకు లక్కీ డ్రా తీసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చారని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.మంగళవారం హుజరాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ లో కుల సంఘాల లక్కీ డ్రా లో పాల్గొని మాట్లాడారు. కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారమే నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లో కుల సంఘాల భవనాలు కట్టించారని అన్నారు. కుల సంఘాల భవనాలను గతంలోనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారని ఆయన అన్నారు. కుల సంఘాల […]