గట్ల మల్యాలలో గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాలు

నంగునూరు (ధనాధన్ న్యూస్): వాతావరణ మార్పుల నేపథ్యంలో గొర్రెలు, మేకలను వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంచేందుకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గట్ల మల్యాల గ్రామంలో పీపీఆర్ టీకాలు వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ తిప్పని శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ గాండ్ల రమేష్, వెటర్నరీ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ స్వామి, ఓఎస్ బుద్ధి యాదగిరి, నరేష్, గోపాలమిత్ర పిల్లి నరసింహులు, మాటూరి మల్లేశం, మంగళారపు వెంకటేష్‌తో పాటు గొల్ల, కురుమ, […]
నంగునూరు ప్రజావాణికి 8 దరఖాస్తులు

నంగునూరు (ధనాధన్ న్యూస్): నంగునూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 8 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. వీటిలో పంచాయతీ శాఖకు ఒకటి, రెవెన్యూ శాఖకు ఒకటి, మార్కెటింగ్ శాఖకు ఒకటి, హౌసింగ్ శాఖకు రెండు, విద్యుత్ శాఖకు ఒకటి, ఐసీడీఎస్ శాఖకు రెండు దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై విచారణ జరిపి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా […]
