బడి బాటకి విస్తృత ప్రచారం

సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్10:సైదాపూర్ మండల కేంద్రంలోని వెన్కేపల్లి ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు మండలంలోని సైదాపూర్,వెన్కేపల్లి,జాగిరిపల్లి,గర్రెపల్లి,ఘనపూర్,బొత్తలపల్లి, రామచంద్రాపూర్,కురుమపల్లి,దుద్దేనపల్లీ గ్రామాలలో ఇంటింటా తిరుగుతూ విద్యార్థులకు, ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఉపాద్యాయులు విస్తృత ప్రచారం చేస్తు అవగాహన కల్పిస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఉచిత విద్యతో పాటు, డిజిటల్  విద్యాబోధన,అత్యాధునిక సౌకర్యాలు,ఉచిత పుస్తకాలు,సన్నబియ్యంతో నాణ్యమైన ఉచిత మధ్యాహ్న బిజనంతో పాటు యునిఫాం ఇస్తున్నట్లు ఉపాద్యాయులు చెబుతున్నారు.ఈ విద్యాసంవత్సరం వెన్కేపల్లి పాఠశాలలో 10వ తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు.మానసిక […]

జగ్గయ్యపల్లి లో రేపు పెట్రోల్ బంక్ ప్రారంభం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)జూన్07:జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లిలో గల డీజిల్ బంక్ పెట్రోల్ బంక్ గా అప్డేట్ అయ్యి పనులన్నీ పూర్తి చేసుకొని శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుందనీ జమ్మికుంట ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు పొనగంటి సంపత్ ఒక ప్రకటనలో తెలిపారు.చుట్టూపక్కల రైతులు,ప్రజలు,సొసైటీ సభ్యుల సహకారంతో ప్రారంభం అయ్యే ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.జమ్మికుంట-వీణవంక ప్రధాన రహదారిలో గల ఈ బంక్ డీజల్ బంక్ గా ప్రారంభం అయి రైతులకు […]

హుజురాబాద్ లో కాంగ్రెస్ కు మెజారిటీ

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)జూన్04:ఈరోజు వెలువడినటువంటి లోక్ సభ ఫలితాల్లో ఆశించిన ఫలితం రాకపోయినా బీజేపీ,బిఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టి గట్టి పోటీ ఇచ్చామని హుజురాబాద్ నియోజక వర్గ ఇంఛార్జి వొడితల ప్రణవ్ అన్నారు.హుజురాబాద్ నుండి అద్భుతమైన మెజారిటీ ప్రజలు ఇచ్చారని దీనికి నియోజకవర్గ ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. హుజురాబాద్ లో స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నా కూడా బిఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసినందుకు,పార్టీపై నాపై ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ,ఎంపీ అభ్యర్థి […]

దశాబ్ది ఉత్సవాలకు తరలివెళ్లిన హుజురాబాద్ ఉద్యమకారులు

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)జూన్02:తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు నిండిన సందర్భంగా  ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు హుజురాబాద్ ప్రాంతానికి చెందిన ఉద్యమకారులు ఆదివారం రోజున అధిక సంఖ్యలో హైదరాబాద్ కు తరలివెళ్లారు.తమ త్యాగాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోక నిర్లక్ష్యం చేసిందని వారు ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడం హర్షణీయమని,ఇదే వైఖరిని ప్రభుత్వం కొనసాగిస్తుందని, ఉద్యమకారుల సలహాలు, సూచనలు తీసుకుని తెలంగాణ పునర్నిర్మాణం చేస్తుందని వారు […]

దుద్దెనపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్02:సైదాపూర్ మండలంలోని దుద్దేనపల్లి గ్రామంలో ఆదివారం రోజున ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.కుల పెద్దమనిషిగా గూళ్ల వెంకటయ్య,ప్రెసిడెంట్ గా నెల్లి శ్రీనివాస్,క్యాషియర్ గా నీల తిరుపతి,వైస్ ప్రెసిడెంట్ గా రొయ్యల శ్రీనివాస్, మెంబర్లు గా బొల్లి సురేష్,గూళ్ల అజయ్,పిట్టల కొమురయ్య,పిట్టల మొండయ్య,పెసరి సమ్మయ్య,నీల సమ్మయ్య లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి నా ఎన్నికకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా […]

ఖబర్దార్ కేటీఆర్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే25:మొన్న డిసెంబర్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కేటీఆర్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినప్పటికీ ఇంకా అహం తగ్గలేదని, వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల స్థానానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సామాన్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగిన తీన్మార్ మల్లన్నను చూసి ఓర్వలేక ” మీకు బిట్స్ పిలానీ కావాలా.. పల్లి బఠాణి కావాలా..! అంటూ మల్లన్నను ఉద్దేశించి హేళన చేస్తూ మాట్లాడిన కేటీఆర్ ఒళ్ళు […]

భూ ఆక్రమణలపై కలెక్టర్ కు పిర్యాదు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే25:సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని మాజీ సర్పంచ్ తన కుటుంబ సభ్యుల పేరున అక్రమ పట్టా చేసి ఆక్రమించుకున్నాడని గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే గ్రామ శివారు లోని మసీదు దగ్గర భూమిని పూర్వం అంబేద్కర్ భవనం,ప్రాథమిక పశువుల వైద్యశాలకు కేటాయించిన  భూమిని ఇందిరా సుధీర్ కుమార్ గౌడ్ సర్పంచ్ పదవిలో కొనసాగుతూ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి సర్వేనెంబర్ 399/ఆ  లో సుమారు […]

విత్తన డీలర్లతో వ్యవసాయ అధికారుల సమావేశం

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే25:వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏడీఏ జీ.సునిత మాట్లాడుతూ విత్తన డీలర్లు అందరూ కూడా అనుమతి ఉన్న విత్తనాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని,విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతి రైతుకి బిల్లు తప్పనిసరిగా అన్ని వివరాలతో ఇవ్వాలని,విత్తన అమ్మకాల వివరాలు రైతు వారీగా రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపారు.రైతుకు నష్టం కలిగేలా ఎలాంటి విత్తన అమ్మకాలు,ఎరువులు,పురుగుమందుల అమ్మకాలు చేయకూడదని,ఏదైనా […]

నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)మే24:వర్షాకాలం వస్తుండడంతో రైతులు దుక్కి దున్ని పంట సాగుచేయడానికి విత్తనాలు ఎప్పుడు వస్తాయా పంట ఎప్పుడు వేయాలా అని ఎదురుచూస్తూ ఉంటారని,రైతుల అవసరాన్ని ఆసరా చేసుకునే కొందరు నకిలీ విత్తనాలు రైతులకు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తారని రైతులు జాగ్రత్తగా ఉండాలని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ తెలిపారు.హుజురాబాద్ లోని ఏసీపీ కార్యాలయం లో డివిజన్ లోని పోలీస్ అధికారులతో కలిసి జై కిసాన్ పోస్టర్ ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఏసీపీ శ్రీనివాస్ జీ […]

వెల్లి విరిసిన మత సామరస్యం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే22: లౌకికవాదం,మతసామరస్య పరిరక్షణలో దేశానికే మన రాష్ట్రం ఆదర్శం.మరీ ముఖ్యంగా పల్లెల్లో ముస్లింలు,హిందువులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు. ఎవరికి కష్టం వచ్చినా.. ఒకరికొకరు అండగా ఉంటారు.హిందువుల పండుగల్లో ముస్లింలు ముస్లిం ప్రార్ధనల్లో హిందువులు పాల్గొంటారు.హిందూ ముస్లిం భాయి భాయి  అని మరోసారి రుజువు అయింది.బుధవారం ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ మహమ్మద్ సందాని హనుమాన్ మాలదారులకు భిక్ష ఏర్పాటు చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు.ఈ సందర్భంగా సందాని మాట్లాడుతూ […]