ఘనంగా సైదాపూర్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:సైదాపూర్ మండల కేంద్రంలోని డా.బీఆర్ అంబేద్కర్ 133వ జయంతి  సందర్భంగా గతంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కోసం కేటాయించిన స్థలంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.అనంతరం అంబేద్కర్‌ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. డా.భీంరావ్ రాంజీ అంబేడ్కర్,ఒక  సంఘసంస్కర్త  అని,అంటరానితనం,కుల నిర్మూలన కోసం ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు.డాక్టర్  బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతని,అతి పెద్ద … Read more

బండి సంజయ్ మంత్రి  పొన్నం కాలిగోటి కూడా సరిపోడు

కరీంనగర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలకాలంలో ప్రజా వ్యతిరేక విధానాలు,తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయం,కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలలు మరియు విభజన చట్టంలో ఆమలు కాని హామీలపై ఆదివారంనాడు కరీంనగర్ లో బీసీ మరియు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన నిరసనదీక్షలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు.ఈ సంధర్బంగా అయన మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో ఉండక, ఉనికి కోసం పక్క నియోజకవర్గంలో వెళ్లి సినిమా డైలాగులు కొడుతున్నాడు.ముఖ్యమంత్రి … Read more

బాబా సాహెబ్ విగ్రహానికి నివాళులు అర్పించిన వొడితల ప్రణవ్

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:భారత రాజ్యంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా హుజురాబాద్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహనికి హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పూలమాల వేసి,నివాళి అర్పించారు. ఈ కార్యక్రమం లో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

క్లినికల్ కార్డియాలజీ ఫెలో షిప్ పూర్తి చేసిన డాక్టర్ శ్రీనివాస్ కు ఘన సన్మానం

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 11:హుజురాబాద్ కు చెందిన డాక్టర్ పోతరాజు శ్రీనివాస్ ఇటీవల ఫెలో షిప్ ఇన్ క్లినికల్ కార్డియాలజీ పూర్తి చేసిన సందర్భంగా గురువారం హుజురాబాద్ పెరిక సంఘం నాయకులు హుజురాబాద్ లోని శ్రీ దుర్గ హాస్పిటల్ లో డాక్టర్ శ్రీనివాస్ ను  మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పుష్ప గుచ్చాలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మీస రమేష్,బండి రమేష్,అంకతి శ్రీనివాస్, ఆకుల వెంకటరాజం,భారత ప్రభాకర్, భారత రజనీకాంత్,ముక్కెర కనకయ్య,పోతరాజు … Read more

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 11: సైదాపూర్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గురువారం రోజున మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలను ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు రేగుల అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహానీయుల ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు.అణగారిన వర్గాలకు అక్షర దీపంగా వెలిగిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాయిశెట్టి చంద్రయ్య, … Read more

క్రమశిక్షణతో జరుపుకునే పండుగ రంజాన్

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 11:ప్రపంచ దేశాలలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత కఠిన ఉపవాస దీక్షలతో క్రమశిక్షణతో నియమ నిబంధనలను పాటిస్తూ రంజాన్ మాసాన్ని పవిత్ర మాసంగా పరిగణిస్తూ ప్రార్థనలు చేయడం జరుగుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ అన్నారు.హుజూరాబాద్,జమ్మికుంట పట్టణంలోని  ఈద్గాల వద్ద ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకరికొకరు … Read more

మున్నూరు కాపు యువగర్జన పోస్టర్ ఆవిష్కరణ

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 09:5000 కోట్లతో మున్నూరు కాపు ఆర్థిక కార్పొరేషన్ ప్రకటించాలని మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పోనగంటి మల్లయ్య అన్నారు. మంగళవారం స్థానిక మండల కేంద్రంలో మున్నూరు కాపు యువగర్జన పోస్టర్ ను మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఏభూషి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పొన్నగంటి మల్లయ్య,సింగిల్ విండో అధ్యక్షులు పొనగంటి సంపత్,మున్నూరు కాపు సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సాయిని రవి,ఆకుల రాజేందర్ లు మాట్లాడారు.ఈ నెల … Read more

మాదిగల ద్రోహి కాంగ్రెస్ పార్టీని ఓడించండి

హుజురాబాద్ ఏప్రిల్ 08:హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం హుజురాబాద్ లోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో మహాజన సోషలిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్ అధ్యక్షతన జరిగింది .ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ , ఇందిరా గాంధీ కాలము నుండి నేటి రాహుల్ గాంధీ  వరకు అధిక జనాభా కలిగిన మాదిగలు ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి … Read more

ప్రజా సమస్యల పరిష్కారమే నా ద్యేయం

జమ్మికుంట ఏప్రిల్ 08:కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజలందరి సమస్యల పరిష్కారానికి కొట్లాడుతానని స్వతంత్ర ఎంపీ అభ్యర్థి పేరాల మానస అన్నారు.సోమవారం ఆమె జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.తాను తొలుత తన సమస్యల పరిష్కారానికి మాత్రమే పోరాటం చేశానని, ఈ క్రమంలో చాలా మంది యువకులు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తన దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారని చెప్పారు.తన ఊరిలో మాత్రమే కాకుండా రకరకాల సమస్యలతో చాలా కుటుంబాలు … Read more

ఉపాధిహామీ పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి

కరీంనగర్ ఏప్రిల్08:ఉపాధిహామీ పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు,మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డి ఆర్ డి ఓ ఉప్పుల శ్రీధర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశాల్లో ఉపాధిహామీ కూలీలకు … Read more