ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ర్యాలీ

సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో  విఎస్ఆర్ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ర్యాలీ నిర్వహించి,లస్మన్నపల్లె ప్రజలకు ప్లాస్టిక్ కవర్ల  వాడకంపై పర్యావరణానికి పెను ప్రమాదం సంభవిస్తుందని,ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించాలని అవగాహన కల్పించారు.ఎన్ఎస్ఎస్ క్యాంపు నిర్వహణలో భాగంగా మూడవ రోజు గ్రామంలోని ప్రధాన వీధులు,రహదారులను శుభ్రము చేసి గ్రామంలోని నర్సరీ కేంద్రంలో కలుపు మొక్కలను ఏరివేశారు.తదనంతరం ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జీ. తిరుపతి,కోమల,హరీష్,వాలంటర్లు  పాల్గొన్నారు.

విద్యా ఉపాధి రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించాలి

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని,రాష్ట్రం లో వెంటనే మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జన సమితి మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు రాగులపెల్లి లక్ష్మి డిమాండ్ చేశారు.మహిళా జన సమితి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయం లో నిర్వహించిన మహిళా సదస్సులో వారు మాట్లాడుతూ  దేశంలో,రాష్ట్రంలో ఇంకా మహిళలు రెండవరకం పౌరులుగానే చూడబడుతున్నారని,సమాన పనికి సమాన వేతనం ఇంకా పొందలేకపోతున్నారని తెలిపారు. ఎన్నికల సమయాల్లో మహిళను మహారాణులను చేస్తామంటూ ఉదార […]

పచ్చదనం పరిశుభ్రత,మానవ సంబంధాలపై అవగాహన కల్పించాలి

ఎన్ఎస్ఎస్  వాలంటీర్లు ప్రజలకు పచ్చదనం పరిశుభ్రత  మానవ సంబంధాల అభివృద్ధిపై అవగాహన కల్పించాలని సైదాపూర్ ఎంపీపీ , ఎంపీటీసీల  పోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు పిలుపునిచ్చారు.సోమవారం రోజున మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో సింగపూర్ లోని వీఎస్ఆర్  డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వేసవికాల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ఎన్ఎస్ఎస్  వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజాన్ని రక్షించేది సమాజాన్ని చైతన్యవంతుల్ని చేసే బాధ్యత ( […]

మహాశివరాత్రి రుద్రహోమంలో పాల్గొన్న వొడితల ప్రణవ్

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ అపర్ణ సోమేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు,రుద్ర హోమం,రాత్రి శివపార్వతుల కల్యాణం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ని ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మేళతాళాలతో స్వాగతం పలికారు.అనంతరం ఆలయంలో శుక్రవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రుద్ర హోమం చేశారు.. ఆలయంలో అర్చన అభిషేక కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు వొడితల […]

గంగిరెద్దుల భవనానికి భూమి పూజ

హుజురాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ గ్రామంలో మొట్టమొదటి సంచార జాతి అయిన గంగిరెద్దుల కులస్తుల కొరకు 10 లక్షల రూపాయల నిధులతో కమిటీ హాల్ నిర్మించడం జరుగుతుందని ఇందిరానగర్ మాజీ కోడిగూటి శారద ప్రవీణ్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయల నిధులతో మొట్టమొదటిసారిగా ఒక సంచార జాతి గంగిరెద్దుల కులానికి కమ్యూనిటీ హాల్ నిర్మించడం తెలంగాణలోనే మొట్టమొదటిగా చెప్పుకోవచ్చని వారు తెలిపారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ శుభకార్యానికి […]

రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వ అండదండలు (ఆశీస్సులు) కరువు

1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆబాది జమ్మికుంట మహాలింగేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు సకాలంలో నీళ్లు రాక పంట పొలాలు ఎండుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం రైతులపై కన్నేర చేస్తూ రైతులను విస్మరిస్తూ పరిపాలన కొనసాగిస్తుందని రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రైతు వ్యతిరేక విధివిధానాలను నిర్వహిస్తూ రైతుకి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ  రైతంగాన్ని నడ్డి విరిచే చర్యలు చేపడుతూ రైతుల కళ్ళల్లో కన్నీళ్లను నింపుతూ పరిపాలన కొనసాగిస్తుందని ఆ […]

వరి మొక్కజొన్న యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన

సైదాపూర్ మండలంలోనివెన్నంపల్లి గ్రామ రైతు వేదికలో మంగళవారం రోజున కేవీకే జమ్మికుంట శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి  రైతులకు వరి మరియు మొక్కజొన్న పంటల ఎరువుల యాజమాన్యం,వాటిలో వచ్చు వివిధ రకాల పురుగులు,తెగుళ్ల యాజమాన్యం మీద అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది.డిడిఏ,ఎఫ్టిసి చత్రునాయక్  రైతులకు సేంద్రీయ వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం చేయడం వలన నేలకు,రైతుకు కలిగే లాభాల గూర్చి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంఏవో వైదేహి,ఏఈవో రజిత గ్రామ రైతులు పాల్గొన్నారు.

రంజాన్ ఏర్పాట్లకై జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం

ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానున్న 30 రోజుల పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచించిన విధంగా రంజాన్ పండుగ ఏర్పాట్లు పకడ్బందిగా చేయాలని కోరుతూ నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనార్టి డిపార్ట్మెంట్ చైర్మన్ మహ్మద్ తాజొద్దీన్ ఆధ్వర్యంలో పలువురు మైనారిటీ నేతలతో కలిసి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.కరీంనగర్ పట్టణంతో పాటు జిల్లాలోని 4 మున్సిపాలిటిలు,16 మండలాల పరిధిలోని […]

ప్రజా పాలనలో కొలువుల జాతర

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తను ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా 90 రోజుల్లోనే ప్రజలు మెచ్చే విధంగా తన పరిపాలన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన విషయంలో ఒక అడుగు ముందుకు వేసి 5192 మంది కి జూనియర్ లెక్చరర్, గురుకుల టీచర్లు గా ఉద్యోగ నియామక పత్రాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇదే కాకుండా ఎన్నో […]