విద్యార్థుల జుట్టు కట్ చేసిన ఉపాధ్యాయురాలు

ఖమ్మం/ధనాధన్ న్యూస్: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ ప్రభుత్వ హైస్కూల్లో టీచర్ విద్యార్థుల జుట్టు కట్ చేయడం కలకలం రేపింది.దీంతో టీచర్ తీరును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం సాయంత్రం ఆందోళనకు దిగారు.టీచర్ కత్తిరించడంతో విద్యార్దులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.టీచర్ శిరీష అమానుషంగా ప్రవర్తించడం సరియైనది కాదని పేరెంట్స్ తో కలిసి ప్రధాన ఉపాధ్యాయుడు వద్ద ఆందోళన చేశారు.ప్రభుత్వ హై స్కూల్ లో 6,7,8,9,10 తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులకు ఇంగ్లీష్ టీచర్ కత్తెరతో […]
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: గౌడ కులస్తులు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.వృత్తి రీత్యా తాడిచెట్లు ఎక్కి జీవనం సాగించే గౌడ కులస్తులు నిత్యం ప్రమాదాలు జరగడం కొంత బాధ కలిగిస్తుందని,ఇటీవల జమ్మికుంట మండల పరిధిలోని మడిపల్లి గ్రామంలో మాచర్ల నాగేశ్వర్ గౌడ్ మృతి తీవ్ర బాధను కలిగించిందని,వారికి అండగా నిలవాలని సర్వాయి పాపన్న గీత కార్మిక […]
నిరుపేదల నివేషణ స్థలంలో డంపింగ్ యార్డ్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆటోనగర్ సమీపంలో సర్వే నంబర్ 275,76,77,78 లో 2006 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 300 నిరుపేద కుటుంబాలకు నివేషణ స్థలం మంజూరు చేసి పట్టాలు ఇచ్చింది.ఈ స్థలాలలో కొంతమంది ఆర్థిక స్తోమత కలిగిన వారు నిర్మాణాలు చేపట్టారు.స్తోమత లేని వారు జమ్మికుంటలో కిరాయిలలో జీవనం కొనసాగిస్తున్నారు.ఇదిలా ఉండగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డంపింగ్ యార్డ్ల నిర్మాణంలో భాగంగా నిరుపేదలకు పంపిణీ చేసిన నివేషణ స్థలాలను […]
అక్బరుద్దీన్ ఓవైసీ కీ ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్

హైదరాబాద్/ధనాధన్ న్యూస్: హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణాన్ని చేపడుతామని,ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాంద్రాయణ గుట్టకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం ఓట్లు అడుగుతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లా డుతూ.. అక్బరుద్దీన్ ఒవైసీని వచ్చేసారి కొడంగల్ నుంచి పోటీ చేయించి గెలిపిస్తానని వ్యాఖ్యానిం చారు.కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు కొడంగల్ బీఫామ్ ఇచ్చి దగ్గరుండి నామినే షన్ వేయిస్తానని..గెలిపించి ఉపముఖ్యమంత్రిని చేస్తానన్నారు.కాగా,అంతకు ముందు […]
భార్యను చూడటానికి బస్సును ఎత్తుకెళ్ళిన భర్త

నందికొట్కూరు/ధనాధన్ న్యూస్: భార్యను చూడటానికి ఏకంగా ఏపిఎస్ ఆర్టీసి బస్సునే ఎత్తుకెళ్లాడు ఓ భర్త.బస్ దొంగతనం విషయం తెలుసుకున్న పోలీసులు బస్సును ఆపి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నా భార్య ఇదే గ్రామంలో ఉంటుందని,నా భార్యను చూసేందుకు వాహనాలేవి లేకపోవడంతో చూస్తున్న క్రమంలో బస్టాండ్ లో బస్సు ఉందని,తాళాలు బస్సుకే ఉండటంతో బస్సును తెచ్చుకున్నానని పోలీసులకు సమాధానం ఇచ్చాడు.ఈ సంఘటన పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో చోటుచేసుకుంది..
మాజీ జెడ్పిటిసి కుటుంబాన్ని పరామర్శించిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికీ చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ జెడ్పిటిసి గుండారపు శోభ శ్రీనివాస్ తల్లి గుండారపు కనకమ్మ ఇటీవల మరణించడంతో కుటుంబాన్ని మాజీ రాష్ట్ర హౌజ్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ కౌన్సిలర్ కోమటి స్వర్ణలత సత్యనారాయణ,మాజీ ఎంపిటిసి చాడా చైతన్య కొండల్ రెడ్డి,మాజీ పట్టణ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్,గ్రామ అధ్యక్షులు తాళ్లపెళ్లి వెంకటేశం,యూత్ కాంగ్రెస్ నాయకులు పూదారి హరీష్ గౌడ్,బోనగిరి అనిల్,మాడెపు రాహుల్ […]
నీళ్లు ఇవ్వకపోతే రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తా

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో మా అందరిపై కోపం ఉంటే మా మీదే చూపించాలి తప్పా రైతుల మీద కాదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఆయన మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు నీళ్లు అందగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలేశ్వరం ప్రాజెక్టు లక్ష్మి పంప్ హౌస్ వద్ద 17 పంపులు రెడీగా ఉన్నాయని వెంటనే […]
ఘనంగా వొడితల రాజేశ్వర్ రావు 13వ వర్థంతి

రాజకీయ దురంధరుడు,స్నేహశీలి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వొడితల రాజేశ్వరరావు ఆశలను కొనసాగించడమే తన లక్ష్యమని,వారసత్వంగా వచ్చిన ప్రజల ప్రేమాభిమానలు పొంది వారికి సేవ చేస్తాననీ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.మాజీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వొడితల రాజేశ్వరరావు 13వ వర్ధంతి వేడుకలు హుజురాబాద్ పట్టణంలో ప్రణవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు,మానకొండూర్ మాజీ శాసన సభ్యుడు ఆరపల్లి మోహన్ పాల్గొన్నారు.ఈ […]
జమ్మికుంట రైల్వే స్టేషన్ లో వ్యక్తి మృతి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట రైల్వే స్టేషన్ లో బీహార్ రాష్ట్రానికి చెందిన రైస్ మిల్ హమాలీ అనారోగ్యం తో మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ జీ.తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రం నలంద జిల్లా పినిపర్ గ్రామానికి చెందిన దినేష్ యాదవ్(46) గత కొంతకాలంగా జమ్మికుంటలోని రైస్ మిల్ లో హమాలీగా పనిచేస్తూ ఉన్నాడు.తిరిగి ఊరికి వెళ్ళడానికి జమ్మికుంట రైల్వే స్టేషన్ కి వచ్చి బుకింగ్ కౌంటర్ లో పడుకొని చనిపోయి ఉన్నాడని, బహుశా […]
వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి ఏర్పడ్డాక ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ పై స్పందించిన బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం వికసిత భారత లక్ష్యంగా పనిచేస్తుందని,దానికి అనుగుణంగా ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా కేంద్ర బడ్జెట్ రూపొందించారని సంపత్ రావు […]
