యదేచ్ఛగా మట్టి అక్రమ రవాణా-పట్టించుకోని అధికారులు

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 27:హుజూరాబాద్ శివారులో సర్వే నెం,496 లో అక్రమ మట్టి ( మొరం) రవాణా చేస్తున్న గానీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని యూత్ కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ ఆరోపించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హుజూరాబాద్ శివారులో సిర్సపల్లి శివారులో అక్రమంగా మట్టి తరలిస్తున్న గానీ అధికారులు చోద్యం చూస్తున్నారు.అనేక పిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు చెలరేగి పోతున్నారని యదేచ్చగా వారి ఇష్టానుసారంగా మట్టి తరలిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి … Read more

హ్యాట్సాఫ్ రాందాస్

ధనాధన్ న్యూస్(న్యూస్ డెస్క్):శివ భక్తురాలిని 4 కి.మీ మోసుకెళ్లిన కానిస్టేబుల్ రాందాస్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.నాగర్ కర్నూల్ జిల్లాలో సలేశ్వరం జాతరకు 70 ఏళ్ల వృద్ధురాలు వచ్చారు. శివుడిని దర్శించుకున్న అనంతరం తిరుగుప్రయాణంలో కొండల్లో నడిచేందుకు ఆమె ఇబ్బంది పడ్డారు.ఇది గమనించిన కానిస్టేబుల్ ఎత్తుకొని కొండపైకి మోసుకొచ్చారు.రెండేళ్ల క్రితం ఇదే కానిస్టేబుల్ తొక్కిసలాటలో గాయపడ్డ ఇద్దరు భక్తులను మోసుకెళ్లి కాపాడారు.

ప్రైవేట్ దవాఖానపై జిల్లా కలెక్టర్,జిల్లా వైద్య అధికారులకు ఫిర్యాదు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 25:జమ్మికుంట పట్టణంలోని మమత హస్పటల్ లో తనకు జరిగిన అన్యాయం గురించి మమత హాస్పటల్ యాజమాన్యంపై జమ్మికుంట పట్టణానికి చెందిన లావణ్య భర్త రచ్చ రవికృష్ణ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి (డి.ఎం.హెచ్.ఓ) లకు  ఫిర్యాదు చేశారు.వివరాల్లోకి వెళితే పేషెంట్ ప్రెగ్నెన్సి పరిక్షకు వెళ్ళగా థైరాయిడ్ మరియు ఇతర టెస్టుల కోసం రక్తం షాంపిల్స్ ఇవ్వడం జరిగింది.ఒక వారం రోజుల తరువాత రిపోర్ట్స్ వస్తాయని తెలిపారు.ఈ నెల 6వ తారీకు రోజున రక్త నమూనాలు … Read more

నూజివీడు సీడ్స్ నూతన వంగడం క్షేత్ర ప్రదర్శన

రామడుగు(ధనాధన్ న్యూస్)ఏప్రిల్25:రామడుగు మండలంలోని వెధిర గ్రామంలో బుధవారం రోజున నూజివీడు సీడ్స్ కంపెనీ వరి పుష్కల్ (ఎన్ పి 9153) దొడ్డు రకమును గ్రామానికి చెందిన వాసు రావు వ్యవసాయ పొలంలో రైతులతో క్షేత్రస్థాయి ప్రదర్శన  నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కంపెనీ సీనియర్ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ పుష్కల్ వరి వంగడం మిగతా రకాల వరి వంగడాల కంటే నాలుగైదు క్వింటాలు అధిక దిగుబడి వస్తుందని అన్నారు.ఈ రకం వానాకాలం,యాసంగి రెండు కాలాలకు … Read more

ప్రభుత్వ జూనియర్ కళాశాల టాపర్స్ సల్మా,గుంటి వైష్ణవి

సైదాపూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్24:సైదాపూర్ ప్రభుత్వ జూనియర్ కళశాల సైదాపూర్ ఏప్రిల్24 బుధవారం రోజున ఉదయం11:00 గంటలకు ప్రకటించిన ఫలితాలలో ఇంటర్ ఫలితాలలో, ద్వితీయ సంత్సర ఫలితాలలో 43 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 28 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అనగా 65.11శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో బైపిసి నుండి సల్మా 849 మార్కులతో తో ద్వితీయ సంవత్సరంలో కళాశాల టాపర్ గా నిలిచారు.అలాగే ప్రథమ సంవత్సరంలో 47 మంది విద్యార్థులకు గాను 19 మంది విద్యార్థులు … Read more

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్24:హుజరాబాద్ నియోజకవర్గంలో బుధవారం వివిధ వివాహ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రమాదంలో గాయపడ్డ యువకుడ్ని గుర్తించి దగ్గరుండి ఆసుపత్రికి పంపించి మానవత్వం చాటుకున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి.నియోజకవర్గంలోని పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు మర్రిపల్లిగూడెం నుంచి కన్నూరుకి వెళ్తుండగా మార్గమధ్యంలో ట్రాక్టర్ ఢీకొని మధు అనే యువకుడు తీవ్రంగా గాయపడటాన్ని గమనించిన ఎమ్మెల్యే తన కాన్వాయ్ … Read more

యువతరమా జర మేలుకో..నీ దేశాన్ని ఏలుకో..!

ఎడిటర్ డెస్క్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్23:ఓ పక్క దేశంలో ఎన్నికలు జరుగుతుంటే, యువత క్రికెట్ సంబరాల్లో మునిగిపోతుంది.. రాజకీయపార్టీలకు బాండ్ల రూపంలో వందలకోట్లు విరాళాలు సమర్పించే కార్పొరేట్ వ్యవస్థలు ఈ దేశ సంపదను దోచుకుంటుంటే! అవేమి పట్టనట్టుగా యువత క్రికెట్ మ్యాచ్ లను వీక్షిస్తున్నారు.రక్షించేవాడు లేక చెరువులు, భూములు కబ్జాల పాలవుతుంటే! అడిగేవాడే లేదని విర్రావీగుతున్న అవినీతి నాయకుల అకలి, మనుషుల శవాలను తిన్నా తీరేది కాదు.. రాజకీయాల్లో రాణించాలన్న ఆశ, దేశ ప్రజల పక్షాన నిల్చోవాలన్న కోరిక లేని … Read more

జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిన మానకొండూర్ వీధులు

మానకొండూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 24:జై శ్రీరామ్ నినాదాలతో మానకొండూర్ పుర వీధులు మారుమ్రోగాయి.మానకొండూర్ మండలంలో బాలాంజనేయ స్వామి గుడిలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి హిందూ ఐక్యత బైక్ ర్యాలీని నిర్వహించారు.యువకులంతా కాషాయ జెండాలతో జైశ్రీరామ్ నినాదాలతో మానకొండూరు వీధులలో ర్యాలీ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్, విశ్వహిందూ పరిషత్ మండల కార్యదర్శి దేవాసాని సంపత్,సొల్లు అజయ్ వర్మ, ఎడబోయిన రామకృష్ణారెడ్డి,మియాపురం లక్ష్మణాచారి,కత్తి ప్రభాకర్ గౌడ్,కంది రాజు రెడ్డి, … Read more

పెద్ద మనస్సు చాటుకున్న మండల సైదాపూర్ ప్రజలు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 23:సైదాపూర్ మండల కేంద్రంలోని మీ సేవ మీసే వెంకటేశ్వర్లు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.సైదాపూర్ మండలంలోని సదాశివ మీసేవలో సెంటర్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తూ మండల ప్రజలందరికీ పరిచయమైన వ్యక్తి వెంకటేశ్వర్లు,ఆయన మరణవార్త విన్న మండల ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.మండల ప్రజలు తలా ఒక్క చేయివేసి చేసిన పోగుచేసిన 1,20,000/-లను పోస్ట్ ఆఫీస్ ఫిక్స్ చేసి బాండ్ వెంకటేష్ కుటుంబ సభ్యులకు స్థానిక ఎస్సై జున్ను … Read more

చేనేత కార్మికుల కష్టాలు వింటే గుండె బరువెక్కుతుంది

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్23:చేనేతల పరిస్థితి చూస్తే మనసు చలించిపోతుందని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి అన్నారు అన్నారు.మంగళవారం జమ్మికుంటలోని చేనేత సొసైటీ పర్యవేక్షణలో భాగంగా ఆయన మాట్లాడారు.జమ్మికుంట లోని చేనేత సంబంధించి సొసైటీ పర్యవేక్షణకు వస్తే సుమారు 80 లక్షల స్టాక్ మిగిలి ఉందని దీంతో పాటు హుజరాబాద్ నియోజకవర్గం లో అన్ని సొసైటీలను కలుపుకొని సుమారు 6 కోట్ల స్టాకు కొనుగోలు చేయకుండా మిగిలి ఉందని అన్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 15 కోట్ల వరకు … Read more