మహాజన సోషలిస్ట్ పార్టీ నూతన కమిటీల ఎన్నిక

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం మహాజన సోషలిస్టు పార్టీ హుజురాబాద్ శాఖ ఎన్నికలు సోమవారం ఉదయం ఎం.ఎస్.పి హుజురాబాద్ నియోజకవర్గ కార్యాలయంలో ఎం.ఎస్.పి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్ అధ్యక్షతన జరిగాయి.ఎంఎస్పి పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ కన్వీనర్ గా కనుకుల గిద్ద గ్రామానికి చెందిన ఆళ్ళ కేశవులు,ఎం.ఎస్.పి హుజురాబాద్ మండల కన్వీనర్ గా సిర్సపల్లి గ్రామానికి చెందిన తునికి భాస్కర్, కో కన్వీనర్లు గా బొడ్డు సంపత్, కల్వల వీరస్వామి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ […]
మట్టి మాఫియా పై చర్యలేవి

జమ్మికుంట పట్టణం దిన దిన అభివృద్ధి చెందుతుండడంతో పట్టణం లో గృహాలు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతుండడంతో భవన నిర్మాణ అవసరాల దృశ్య, యజమానుల అవసరాలను ఆసరాగా తీసుకున్న మట్టి అక్రమ వ్యాపారులు మండలంలోని చుట్టూ ప్రక్కల గ్రామాలలోని ప్రభుత్వ భూముల్లోని అక్రమ మొరం దందా యదేచ్చగా కొనసాగిస్తున్నారు.సహజ సంపదను కొల్లగొట్టి ఆదాయ వనరుగా మార్చుకుంటు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.జమ్మికుంట మండలంలోని పెద్దంపల్లి గ్రామ శివారులో గల సర్వే నంబర్ 1405 గల […]
గజ్జెల కాంతం కే పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టిక్కెట్ ఇవ్వాలి

జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచపల్లి సాగర్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గజ్జెల కాంతంకి ఇవ్వాలని తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ రాచపల్లి సాగర్ కాంగ్రెస్ పార్టీ ని కోరారు.తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మంది మాదిగలు గత ప్రభుత్వం చేసిన అణచివేతను గమనించే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యావత్తు మాదిగలు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి […]
ఎన్ఎస్ఎస్ వాలింటీర్లు ప్రజా ప్రయోజనం కోసం సేవ చేయాలి

సైదాపూర్ మండలంలోని లస్మమన్నపల్లి గ్రామంలో శనివారం రోజున ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రజాప్రయోజనం కోసము దీర్ఘకాలము గుర్తుండే విధంగా సమాజానికి సేవ చేసి ఉత్తమ వాలెంటర్లుగా గుర్తింపు పొందాలని సైదాపూర్ ఎంపీడీవో భూక్య యాదగిరి వాలంటీర్లను ఉద్దేశించి చెప్పారు.విఎస్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఎస్ వేసవి కాల ప్రత్యేక సేవా శిబిరము శనివారము ముగిసింది.ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటర్లు సేవా దృక్పధ ముని కలిగి ఉండి […]
చదువుకు పేదరికం అడ్డుకాకూడదు

చదువుకు పేదరికం అడ్డు కాదని,చదువుకోవడానికి ముందుకు వస్తే సహకరించడానికి మేము ఉన్నామని, కలుషితం లేని మంచినీరు తాగడం కోసం పాఠశాలకు వాటర్ ప్యూరిఫైడ్ నీళ్లను త్వరలోనే అందజేస్తామని కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.హుజురాబాద్లోని జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షప్యాడ్లు,స్టేషనరీని అందజేశారు.
కాంగ్రెస్ చేరనున్న 200 మంది ముదిరాజ్ సంఘ నాయకులు

కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మత్స్య సహకారాల సంఘం అధ్యక్షులు పిట్టల రవీందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా సైదాపూర్ మండల కేంద్రం నుండి 26 గ్రామాల ముదిరాజ్ సంఘ నాయకులు వివిధ గ్రామాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు రాయిశెట్టి చంద్రయ్య మాట్లాడుతూ,జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు రాయిచెట్టి చంద్రయ్య మత్స్య సహకారాల సంఘం డైరెక్టర్ […]
కార్పొరేషన్ల ఏర్పాటు పట్ల హర్షం

ఎన్నో ఏళ్ల ఉద్యమ ఫలితంగా కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం అభినందనీయం అని తెలంగాణ ఓసి జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గూడూరి స్వామిరెడ్డి (లోక్సత్తా) పేర్కొన్నారు. గూడూరి స్వామిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్రెడ్డి,మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత […]
ప్రజా సమస్యల పరిష్కారమే
ప్రధాన ధ్యేయం

సైదాపూర్ మండలంలో పలు అభివృద్ధి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తున్నానని వెల్లడించారు.గ్రామాల్లో తాగునీటికి ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని,ఇందుకు నిధులు మంజూరు చేసే బాధ్యత తాను తీసుకుంటానని పేర్కొన్నారు. గురువారం సైదాపూర్ మండలానికి సంబంధించి దాదాపు కోటి రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్,జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి శంకుస్థాపన చేశారు. అమనగుర్తి […]
మున్నూరు కాపుల కల నెరవేరింది

-పొనగంటి మల్లయ్య,మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మున్నూరు కాపు రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో మున్నూరు కాపుల కల నెరవేరిందని మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పొనగంటి మల్లయ్య అన్నారు.బుధవారం స్థానిక మోత్కులగూడెం చౌరస్తాలో మున్నూరు కాపు జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏబూసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణాసంచాలు పేల్చి,స్వీట్లు పంపిణీ చేసి,సంబరాలు చేసుకున్నారు.అనంతరం పొనగంటి మల్లయ్య,సింగిల్ విండో అధ్యక్షులు పొనగంటి సంపత్,మున్నూరు కాపు జిల్లా […]
సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మాజీ జెడ్పిటిసి

సైదాపూర్ మండలం దుదేనపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవస్థానంలోని గుడి చుట్టూ సిసి రోడ్ పనులను బుధవారం రోజున ప్రారంభించడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ జెడ్పిటిసి గుండారపు శ్రీనివాస్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దుదేదనపల్లి గ్రామ ఎంపీటీసీ చాడ చైతన్య మరియు గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి చిన్న వెంకటేశం,కాంగ్రెస్ కార్యకర్తలు,ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముదిరాజ్ కులస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.
