రబ్బీ ఆట లో ప్రతిభ కనపర్చి రాష్ట్రస్థాయి టోర్నమెంట్ కి ఎంపికైన సిరిసేడు విద్యార్థులు

By dhanadhannews.com

  • గ్రామీణ ప్రాంతం నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు
  • విద్యార్థులని అభినందించిన టీచర్లు, గ్రామస్తులు.
టోర్నమెంట్ కి సెలెక్ట్ అయిన విద్యార్థులు.

జమ్మికుంట,ధనా ధన్ న్యూస్ :

కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి రబ్బి ఆటలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి టోర్నమెంట్ కి 5గురు విద్యార్థులు ఎంపికైనట్లు సిరిసేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి జగదీశ్వర్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసేడు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 12 మంది క్రీడాకారులు కరీంనగర్ జిల్లాలోని తాడికల్ గ్రామంలో ఆరవ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రీడలు అండర్ 14 రబ్బీ టోర్నమెంట్ లో పాల్గొని రబ్బి ఆటలో వారి ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయిలో ఫిబ్రవరి 3,4 తేదీలలో యాదాద్రి లో ఏర్పాటు చేసిన టోర్నమెంటులో పాల్గొనుటకు 5 గురు విద్యార్థులు ఎంపిక కాగా బాలికల విభాగంలో ఆలేటి శరణ్య,మోతపోతుల రశ్మిత,యండి హసీనా బాలుర విభాగం లో ఎన్.శ్రీ చరణ్,బలబత్తుల మోక్షిత్ చారి ఎంపికైనట్లు తెలిపారు.విద్యార్థులకి క్రీడలలో శిక్షణ అందించిన పి ఈ టి శ్రీనివాస్ అభినందించారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులని పాఠశాల ఉపాధ్యాయ బృందం,సర్పంచ్ రఫీ ఖాన్,ఎంపిటిసి చిన్నరాయుడు,ఎస్ఎంసి
చైర్మన్ ఉప్పు దుర్గయ్య, విద్యార్థులు,గ్రామస్తులు అభినందించారు.