పేదోడి సొంతింటి కలకు సర్పంచ్ అండ

హుజురాబాద్/ధనాధన్ న్యూస్,ఆగస్టు 30: తల్లిదండ్రులను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో ఒంటరిగా జీవిస్తున్న ఓ నిరుపేద యువకుడి సొంతింటి కలను సాకారం చేసేందుకు గ్రామ సర్పంచ్ మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయించడంతో పాటు, ఇంటి నిర్మాణానికి అవసరమైన అదనపు ఖర్చులను సైతం తానే భరిస్తూ ఉచితంగా ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు సర్పంచ్ ముందుకు రావడం గ్రామంలో అభినందనలు అందుకుంటున్నారు.కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం శాలపల్లి–ఇందిరానగర్ గ్రామంలోని న్యూ […]
ములుగు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు: సీఎం రేవంత్ రెడ్డి

ములుగు/ధనాధన్ న్యూస్: తెలంగాణలో ఆడబిడ్డలు, పేదలు, నిరుద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ములుగులో నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సమ్మక్క–సారక్క ఆశీర్వాదంతో ములుగు నుంచే పాదయాత్ర ప్రారంభించామని సీఎం గుర్తుచేశారు. రాష్ట్రంలోని నలుమూలల గూడేలు, పల్లెల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి భరోసా ఇచ్చామని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఇందిరమ్మ […]
వృద్ధాప్య, బీడీ కార్మికుల పెన్షన్లు కూడా ఇవ్వాల్సిందే..!

ఇల్లందకుంట,ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన 420 హామీలలో భాగంగా వృద్ధాప్య, బీడీ కార్మికుల పెన్షన్లను కూడా వెంటనే అమలు చేయాలని ఇల్లందకుంట మండల బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గత ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల పెన్షన్లను పెంచి ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ రెండున్నరేళ్లు గడిచినా పెన్షన్ల పెంపుపై […]
ప్రణవ్ బాబు జన్మదినం సందర్భంగా వాల్ పోస్టర్ ఆవిష్కరణ

జమ్మికుంట, ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ బాబు జన్మదినం సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి ప్రాంతంలో వాల్ పోస్టర్‌ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆవిష్కరించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి నివాసం వద్ద బొంగోని వీరన్న, మర్రి రామ్‌రెడ్డి, పంజాల అజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేశిని కోటి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రణవ్ […]
రాజకీయాలు చేయొద్దు..ప్రజలకు నిజాలు చెప్పండి! మంత్రులకు పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్

కమలాపూర్,ఆగస్టు 10: కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తున్న సమయంలో ఎమ్మెల్యే స్పందిస్తూ, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “అబద్ధాలు చెప్పొద్దు.. నిజాలు మాట్లాడాలి. ఇది రాజకీయాలు చేయాల్సిన వేదిక కాదు. ప్రజలకు […]
ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా: వొడితల ప్రణవ్

జమ్మికుంట,ఆగస్టు 5 (ధనాధన్ న్యూస్): అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు.బుధవారం జమ్మికుంట పట్టణంలోని 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 14, 15, 24, 28 వార్డుల్లో నిర్వహించిన “ప్రతి గడపకు సంక్షేమం – ప్రజల వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కులు” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 22 […]
జమ్మికుంట అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

జమ్మికుంట, ఆగస్టు 1(ధనాధన్ న్యూస్): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని శనివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.యూనియన్ అధ్యక్షుడిగా అంబాల రజనీకాంత్ వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసిన సభ్యులు మరోసారి ఏకగ్రీవంగా బాధ్యతలు అప్పగించారు.నూతన కమిటీలో ఉపాధ్యక్షుడిగా దొడ్డి రాజు, కోశాధికారిగా రాజేష్, ప్రచార కార్యదర్శిగా నన్నబోయిన రాజును ఎన్నుకున్నారు. యూనియన్ బలోపేతం కోసం కమిటీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎంపిక […]
జమ్మికుంటలో ఘనంగా అవొపా మెరిట్ అవార్డ్స్–2026

జమ్మికుంట, జూలై 26 (ధనాధన్ న్యూస్):జమ్మికుంట పట్టణంలో ఆర్యవైశ్య అవొపా జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో ఆదివారం “అవొపా మెరిట్ అవార్డ్స్–2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘ పెద్దలు, సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీతో పాటు వివిధ పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులను అవొపా సంఘం మెమెంటోలు, ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించింది. సంఘ నాయకులు, అతిథులు వేదికపై విద్యార్థులకు అవార్డులు […]
వొడితల రాజేశ్వర్‌రావు సేవలు చిరస్మరణీయం: ప్రణవ్

హుజూరాబాద్, జూలై 24 (ధనాధన్ డిజిటల్ న్యూస్):మాజీ రాజ్యసభ సభ్యుడు వొడితల రాజేశ్వర్‌రావు దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిన గొప్ప నాయకుడని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం వొడితల రాజేశ్వర్‌రావు వర్ధంతి సందర్భంగా హుజూరాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుడా […]
గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువ

జమ్మికుంట,జూలై 23 (ధనాధన్ న్యూస్): రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులను ప్రమాదం జరిగిన తొలి గంటలోపు (గోల్డెన్ అవర్) ఆసుపత్రికి తరలిస్తే వారి ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్య నిపుణులు తెలిపారు.బుధవారం జమ్మికుంటలో ట్రామా కేర్ (అత్యవసర వైద్యం)పై నిర్వహించిన అవగాహన సదస్సులో న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ దిలీప్ రెడ్డి, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్ పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన […]
