ప్రభుత్వ జూనియర్ కలశాలలో విద్యార్థులకు రక్త పరీక్షలు

By dhanadhannews.com

విద్యార్థులకు రక్త పరీక్షలు చేస్తున్న సిబ్బంది.

సైదా పూర్,ధనాధన్ న్యూస్:

సైదాపూర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం రోజున ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అర్బిఎస్కే హుజురాబాద్ టీమ్-ఏ ఆధ్వర్యంలో రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఎవరికైతే హెచ్బీ తక్కువ వుందో వారికీ టాబ్లెట్స్ పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.తరువాత జరిగిన సమావేశములో ప్రిన్సిపాల్ సత్యనారాంజనేయ మాట్లాడుతూ విద్యార్థులు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో అర్బిఎస్కే వైద్య బృందం డాక్టర్ అనురాగరేఖ,ఎంవోబి శ్వేతరెడ్డి, ఫార్మస్ట్ అర్ శారదా, ఏఎన్ఎమ్,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి పి.రాజశేఖర్, అధ్యాపకులు భాస్కర్ రాజు, రవి,రాజశేఖర్,వినయ్,సుజాత,రాజు,కిరణ్ విద్యార్థులు పాల్గొన్నారు.