ఉచిత మెగా వైద్య శిబిరానికి అనూహ్యా స్పందన

By dhanadhannews.com

  • రెండు వందల మందికి వైద్య పరీక్షలు,ఉచితంగా మందుల పంపిణి

సైదాపూర్,ధనాధన్ న్యూస్:

గ్రామాలల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మణికంఠ మోడ్రన్ రైస్ మిల్ యాజమాని ఉడిగే విజయ రాజశేఖర్ లు తెలిపారు.ఆదివారం కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో మణికంఠ మోడ్రన్ రైస్ మిల్ అధ్వర్యంలో వాసుదేవా హస్పిటల్ కరీంనగర్ వారి సహాకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు.ఈ సందర్భంగా ఉడిగే రాజశేఖర్ మాట్లాడుతూ మణికంఠ మోడ్రన్ రైస్ మిల్ ఆధ్వర్యంలో ప్రజల సహాకారంతో భవిశ్యత్ లో మరెన్నో సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.తమ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన కరీంనగర్ వాసుదేవా హస్పటల్ బృందానికి, సహాకరించిన వాకర్స్ అసోసియోషన్ సభ్యులకు రాజశేఖర్ దన్యావాదాలు తెలిపారు.ఈ శిబిరంలో దాదాపు 2వందల మంది ప్రజలు పాల్గోనగా డాక్టర్ శ్రీనివాస్ షుగర్, బిపీ,రక్త పరీక్షలు, అన్నిరకాల సాధారణ వైద్య పరీక్షలు నిర్వంచి ఉచితంగా మందులను పంపీణి చేసినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో హస్పటల్ డాక్టర్ శ్రీనివాస్,వాకర్స్ అసోసియేషన్ కోఆర్డినేటర్ కోడం కిషన్,కొండబత్తిని వీరస్వామి,వెముల శ్రీనివాస్,చందా వెంకటేశ్,కామినేని సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.