- ఫీజ్ బకాయిల పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిదే
- కామారెడ్డి లో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
- టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు
కామారెడ్డి,ధనాధన్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 3 సంవత్సరాల కు సంబంధించిన ఇంజనీరింగ్ డిగ్రీ బి.ఎడ్ ప్రొఫెషనల్ కళాశాలకు సంబంధించిన 5500 కోట్ల పెండింగ్ ఫీజు బకాయాలను విడుదల చేయాలని కోరుతూ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో 2000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ,నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని బంగారు తెలంగాణ పేరుతో పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను చెల్లించకుండా విద్యార్థులను గత బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసినందుకుగాను తగిన మూల్యాన్ని చెల్లించుకోవడం జరిగిందని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 5500 కోట్ల పెండింగ్ ఫీజు బకాయిలు ఉండడం జరిగిందని,ఈ బకాయిల విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.లేకపోతే బడుగు బలహీన పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందని అన్నారు.కళాశాలలో ఉన్న అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేక అద్దెలు కూడా కట్టలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ జహీరాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు మోతే రాజిరెడ్డి,అంజల్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ పటేల్,రాష్ట్ర కార్యనిర్వాన కార్యదర్శి పటోళ్ల మహిపాల్ రెడ్డి, నిజామాబాద్ టిఎన్ఎస్ఎఫ్ ఇంచార్జ్ యూసప్ బిన్ అబుద్,రాష్ట్ర నాయకులు అవ్వత్ నాయకులు రాజు సందీప్ నవీన్ వసంత్ ప్రదీప్ సంతోష్ నితిన్ లు పాల్గొనడం జరిగింది.
