వర్షాలకు కూలిన ఇంటిని పరిశీలించిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి

జగిత్యాల/ధనాధన్ న్యూస్: సారంగపూర్ మండలంలోని పెంబట్ల, కోనపూర్ గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదే సమయంలో పెంబట్ల గ్రామానికి చెందిన పాస్తం స్వప్న, ఆమె సోదరులు పరమేష్, దుర్గేష్ నివాస గృహం భారీ వర్షాల కారణంగా పూర్తిగా కూలిపోయింది.ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కూలిన ఇంటిని పరిశీలించిన అనంతరం మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ), […]
జగిత్యాల రైతు బజార్ వద్ద ట్రాఫిక్ సమస్యకు చెక్

జగిత్యాల,జూలై 13 (ధనాధన్ న్యూస్): జగిత్యాల పట్టణంలోని రైతు బజార్ ముందు రహదారిపై రైతులు కూరగాయలు విక్రయించడం వల్ల గత కొంతకాలంగా తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంది. ముఖ్యంగా విద్యానగర్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు, సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లే రోగులు, అంబులెన్స్‌లు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యపై స్పందించిన ట్రాఫిక్ ఎస్‌ఐ మల్లేశం సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి, మున్సిపల్ సిబ్బందితో […]
తాడిచెర్ల కోల్ బ్లాక్-2ను సింగరేణికి కేటాయింపు

న్యూఢిల్లీ, జూలై 8 (ధనాధన్ న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాడిచెర్ల కోల్ బ్లాక్-2ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)కు కేటాయించాలంటూ పెద్దపల్లి లోక్‌సభ సభ్యుడు చేసిన నిరంతర కృషి ఫలించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల కోల్ బ్లాక్-2ను ఎస్‌సీసీఎల్‌కు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.ఈ అంశంపై ఎంపీ వంశీకృష్ణ గడ్డం ఈ ఏడాది ఫిబ్రవరి 3న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కి అధికారికంగా లేఖ రాసి, తెలంగాణ […]
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల నల్లబ్యాడ్జీల నిరసన

జగిత్యాల, జూలై 7(ధనాధన్ న్యూస్): యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీజీపీఈజేఏసీ (TGPEJAC) రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాలలోని టీజీఎన్‌పీడీసీఎల్ (TGNPDCL) డివిజన్ కార్యాలయం ఆవరణలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో […]
గౌన్లవానీకుంట పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

జమ్మికుంట,జూలై 3(ధనాధన్ న్యూస్): జమ్మికుంట నూతన తహసీల్దార్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గడ్డం సుధాకర్‌ను 5వ వార్డు కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా 5వ వార్డులోని గౌన్లవానీకుంట ఆక్రమణలకు గురవుతోందని, వెంటనే రెవెన్యూ సర్వే నిర్వహించి కుంట హద్దులు నిర్ధారించి, చుట్టూ రక్షణ గోడ (బౌండరీ) ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని వార్డు ప్రజల తరఫున తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వినతిపై స్పందించిన తహసీల్దార్ […]
బాస్ స్కీమ్ విద్యార్థుల ప్రవేశాలపై వివాదం..చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల వినతి

జమ్మికుంట,జూలై 3(ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని విద్యోదయ హైస్కూల్‌లో బాస్ (BAS) స్కీమ్ కింద చదువుతున్న విద్యార్థులను పాఠశాలలో కొనసాగించకుండా యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తోందని పలువురు తల్లిదండ్రులు మండల విద్యాధికారికి వినతిపత్రం సమర్పించారు. తల్లిదండ్రుల కథనం ప్రకారం, ఈ విద్యా సంవత్సరంలో బాస్ స్కీమ్‌కు సంబంధించిన నిధులు ప్రభుత్వం నుంచి అందలేదని పేర్కొంటూ, విద్యార్థులను కొనసాగించాలంటే ఫీజులు చెల్లించాలని పాఠశాల యాజమాన్యం ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. ఫీజులు చెల్లించకపోతే తమ పిల్లలను వేరే పాఠశాలలో చేర్పించుకోవాలని సూచిస్తున్నారని […]
అప్పు చేసి కడుతున్న బ్రో..!

సిద్ధిపేట, జులై 3(ధనాధన్ న్యూస్): ఇల్లు కట్టడం అంటే ఇటుకలు, సిమెంట్‌తో పాటు అప్పులూ ఉంటాయనే విషయాన్ని ఓ వ్యక్తి వినూత్నంగా, హాస్యభరితంగా చెప్పేశాడు. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన ఓ వ్యక్తి, ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఫొటోతో ప్రత్యేక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫ్లెక్సీలో బ్రహ్మానందం హావభావాలతో పాటు పెద్ద అక్షరాల్లో “అప్పు చేసి కడుతున్న బ్రో…” అని రాయించడంతో అటుగా వెళ్లేవారు ఆగి చదివి […]
ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆకుల రాజేందర్‌కు ఘన సన్మానం

జమ్మికుంట,జూలై 1 (ధనాధన్ న్యూస్): కరీంనగర్ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆకుల రాజేందర్‌ను జమ్మికుంట మండల మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం నాయకులు బుధవారం ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఎబూషి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆకుల రాజేందర్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే నాయకుడని అన్నారు. బీసీ వర్గాల సమస్యలను నిరంతరం ప్రభుత్వ దృష్టికి […]
SIR ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

మెట్‌పల్లి,జూన్ 30(ధనాధన్ న్యూస్: మెట్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన SIR (Special Intensive Revision) ప్రక్రియపై అవగాహన సదస్సుల్లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. సత్తక్కపల్లి, రాజేశ్వరరావుపేట, చెర్లకొండాపూర్, జగ్గాసాగర్, ఆత్మనగర్, రామలచక్కపేట గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, SIR ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పాల్గొని అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. బూత్ స్థాయి […]
ఉద్యోగ విరమణ పొందిన ఎస్‌బీ డీఎస్పీ వెంకటరమణకు ఘన సన్మానం

జగిత్యాల,జూన్ 30(ధనాధన్ న్యూస్): జిల్లా స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) డీఎస్పీ వెంకటరమణ ఉద్యోగ విరమణ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని వీకేబీ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఘన వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై వెంకటరమణను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, పోలీసు శాఖలో వెంకటరమణ ఎన్నో సంవత్సరాల పాటు అంకితభావం, నిజాయితీ, క్రమశిక్షణతో సేవలందించి […]
