- రామ నామ స్మరణతో మరుమోగిన జగ్గయ్యపల్లి
- రాములోరి కళ్యాణానికి తరలివచ్చిన భక్తులు
జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే15:జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.వేడుకల్లో భాగంగా మంగళవారం నాడు ఉదయం విశ్వక్ సేన ఆరాదన,పుణ్యవచనం,రక్షా బంధనం,నవ కలుష స్థపనం,మహా హోమం తో ప్రారంభమై సాయంత్రం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.ఈ కళ్యాణ మహోత్సవం అధ్యంతం వైభవంగా,కన్నుల పండుగగా జరిగింది.రాములోరి కల్యాణానికి దాతలు పట్టు వస్త్రాలు,పూలు సమర్పించారు.అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.కళ్యాణ వేడుకతో గ్రామమంతా రామనామస్మరణతో మారూమ్రోగింది.ప్రతీ ఏటా ఆలయ వార్షికోత్సవం నాడు సీతారాముల కళ్యాణం జరపడం అనందమని,ఈ వేడుక మనిషిలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కొదుమగుళ్ల శ్రీధరాచార్యులు,ఆలయ చైర్మన్ దుగ్గినాల రవీందర్,వైస్ చైర్మన్ తిరుపతిరావు,కోశాధికారి రాజు ఆలయ కమిటీ సభ్యులు ప్రభాకర్ రావు,రాజేశ్వర్ రావు,రవీందర్ రావు,సంపత్ రావు,మహేందర్,వెంగల్ రావు,రంజిత్ కుమార్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
