సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే27:సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో నూజివీడు సీడ్ డిస్ట్రిబ్యూటర్స్ మరియు డీలర్లు ఆర్ఎంజె శ్రీకాంత్ రెడ్డి ఈ సంద్భంగా మాట్లాడుతూ నూజివీడు సీడ్స్ వారి పుష్కల్ వరి రకం విత్తనాలు అన్ని రకాల రోగాలకు తట్టుకొని ఎక్కువ ఎత్తు పెరగకుండా,గాలి దుమారాలకు పడిపోకుండా,ఎక్కువ దిగుబడులు వస్తుందని వివరించారు.ఈ వంగడాన్ని రైతుల కోసం ప్రత్యేకించి తయారు చేయడం జరిగిందన్నారు.ఇప్పటివరకు నూజివీడు సీడ్స్ కంపెనీ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని చేసుకొని రైతులందరికీ లాభం కలిగేలా అధిక లాభం చేకూర్చే వంగడాలను తయారు చేయడమే ముఖ్య ఉద్దేశం అన్నారు. రైతులకు లాభం చేకూర్చేలా ప్రతి ఒక్క డీలర్స్ రిటైలర్స్ తోడ్పాటు అందించుకోవాలని కోరారు నూజివీడు సీడ్స్ కంపెనీ రైతుల పక్షాన నిలిచే ఏకైక కంపెనీ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు నీల రాజు,కడిపికొండ తిరుపతిరెడ్డి,గంగరాజు మరియు డిస్ట్రిబ్యూటర్లు డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
