సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన

By dhanadhannews.com

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సైబర్ క్రైమ్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,బండి మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలని జమ్మికుంట ఎస్సై ఆరోగ్యం తెలిపారు.జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామములో సాయంత్రం సైబర్ క్రైమ్ మోసాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.నేను సైతం కార్యక్రమంలో సోలార్ సీసీ కెమెరాల పట్ల ప్రజల మరింత బాధ్యతగా ముందుకు వెళ్లాలని,దాతలు సహకరించాలని,మంచి కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పోలీసు అధికారులు జలీల్,సోని,బ్లూ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.