గడ్డం సమ్మయ్య కి దళిత రత్న అవార్డు

హుజూరాబాద్/ధనాధన్ న్యూస్: హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా దళిత రత్న అవార్డు ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించబడింది.మహనీయులు బాబు జగజీవన్ రామ్ మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ బైరి వెంకటేశం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఎస్సీ 52 కులాల సంఘం అధ్యక్షుడు రైళ్ల లక్ష్మీ నరసయ్య కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ ఇందిరానగర్‌కు చెందిన … Read more

తెలంగాణ జన సమితి పార్టీ 4వ ప్లీనరీ విజయవంతం చేయండి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్ మే 02: తెలంగాణ జన సమితి (TJS) పార్టీ 4వ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు పిలుపునిచ్చారు. శనివారం హుజురాబాద్ పట్టణంలో ప్లీనరీకి సంబంధించిన వాల్ పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ముక్కెర రాజు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో నిత్యం పోరాడుతున్న ఏకైక పార్టీ తెలంగాణ జన సమితి అని … Read more

కవ్వంపల్లి రవి కి దళితరత్న అవార్డు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 02: మహనీయులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వైభవంగా జరిగింది.ఉత్సవాల కమిటీ చైర్మన్ అట్లూరి లక్ష్మణ్,సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఈ వేడుకలు నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, lమాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్,ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్సవాల కమిటీ … Read more

వావిలాల గ్రామంలో వ్యక్తి మృతి.. కారణాలపై పోలీసుల విచారణ

వావిలాల: గ్రామానికి చెందిన రాగల సాంబయ్య (55) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సాంబయ్యకు ఇద్దరు కుమారులు ఉండగా, చిన్న కుమారుడు రాగల వంశీ (26) హైదరాబాద్‌లో స్వంత కారును అద్దెకు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం అతని తల్లి అనారోగ్యంతో మృతి చెందగా, అప్పటి నుంచి సాంబయ్య తన పెద్ద కుమారుడు నాగరాజుతో కలిసి … Read more

‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’పై అవగాహన సదస్సు నిర్వహణ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: మెప్మా ఆధ్వర్యంలో స్థానిక వినాయక గార్డెన్‌లో గురువారం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’పై ప్రత్యేక అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆధ్వర్యంలో, టీఎల్ఎఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ పీడీ స్వరూప రాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం వ్యాపార … Read more

బత్తుల లక్ష్మీనారాయణను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు బత్తుల లక్ష్మీనారాయణ పక్షవాతం బారిన పడిన విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పందించారు. ప్రస్తుతం హనుమకొండలోని అజరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణను ఆయన సందర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడిన సతీష్ కుమార్, ఆయనకు అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. త్వరగా కోలుకుంటారని నమ్మకం వ్యక్తం చేస్తూ, ఎలాంటి ఆందోళన … Read more

హుజురాబాద్ డివిజన్‌లో చీటింగ్ కేసులపై సీపీ సమీక్ష

కరీంనగర్/ధనాధన్ న్యూస్, ఏప్రిల్ 29:కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బుధవారం హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంలో డివిజన్ స్థాయి పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న నేరాల విచారణ తీరును సమగ్రంగా పరిశీలించారు. ముఖ్యంగా చీటింగ్ (మోసం) మరియు ఫోర్జరీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన సీపీ, అమాయక ప్రజలను మోసం చేసే నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులను … Read more

మరికొన్ని క్షణాల్లో పది పలితాల విడుదల

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాలు ఇవాళ (బుధవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు SCERT Telangana ఆడిటోరియంలో ప్రభుత్వ సలహాదారు K. Keshava Rao ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు.ఈసారి పరీక్షలను విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు దశలవారీగా నిర్వహించి, ప్రతి పరీక్షకు మధ్య 3-4 రోజుల విరామం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు సుమారు … Read more

ఘనంగా తెలంగాణ జన సమితి 8వ ఆవిర్భావ వేడుకలు

కరీంనగర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 29:తెలంగాణ జన సమితి (TJS) పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాయి.సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు వృద్ధాశ్రమ నివాసితులతో నేరుగా మాట్లాడి, వారి ఆరోగ్యం మరియు ఇతర అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు ఎల్లవేళలా అండగా ఉంటామని, వారి … Read more

సైదాపూర్‌లో అభివృద్ధి పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం

సైదాపూర్/ధనధాన్ న్యూస్ ఏప్రిల్ 28: సైదాపూర్ మండలంలోని విశాల సహకార ప్రకృతి సంఘం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల వారీగా పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు … Read more