- ముఖ్య అతిథిగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ ( దిలీప్)
- సెయింట్ థామస్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహణ
- ఆకట్టుకున్న చిన్నారుల ఆట పాటలు-సర్టిఫికెట్లు అందుకున్న విద్యార్థులు.
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సెయింట్ థామస్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విభాగం విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల కరస్పాండెంట్& ప్రిన్సిపల్ ఫాదర్ శరన్ రెడ్డి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూసెయింట్ థామస్ పాఠశాల ప్రారంభం నుండి చుట్టు పక్కల గ్రామాల పేద పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందించి ఎంతో మంది విద్యార్థినీ విద్యార్థులకు ఉన్నత స్థాయికి వెళ్ళేలా విద్యను అభ్యసించిన పాఠశాల అని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు పట్టాలను అందించారు. చిన్నారులు పట్టాలను అందుకుని సందడి చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ కౌన్సిలర్లూ ఎగిత సుజాత అశోక్, మైస శిరీష రవి, చింతల శ్రీనివాస్, పోల్నెనీ అజయ్ , కొలుగూరీ సురేష్ , మంద రాధ.రాజేష్, పోలు దివ్య బిక్షపతి, పోల్నెనీ శిల్పా వేణు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
