ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా: వొడితల ప్రణవ్

జమ్మికుంట,ఆగస్టు 5 (ధనాధన్ న్యూస్): అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు.బుధవారం జమ్మికుంట పట్టణంలోని 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 14, 15, 24, 28 వార్డుల్లో నిర్వహించిన “ప్రతి గడపకు సంక్షేమం – ప్రజల వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కులు” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 22 […]

జమ్మికుంట అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

జమ్మికుంట, ఆగస్టు 1(ధనాధన్ న్యూస్): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని శనివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.యూనియన్ అధ్యక్షుడిగా అంబాల రజనీకాంత్ వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసిన సభ్యులు మరోసారి ఏకగ్రీవంగా బాధ్యతలు అప్పగించారు.నూతన కమిటీలో ఉపాధ్యక్షుడిగా దొడ్డి రాజు, కోశాధికారిగా రాజేష్, ప్రచార కార్యదర్శిగా నన్నబోయిన రాజును ఎన్నుకున్నారు. యూనియన్ బలోపేతం కోసం కమిటీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎంపిక […]

జమ్మికుంటలో ఘనంగా అవొపా మెరిట్ అవార్డ్స్–2026

జమ్మికుంట, జూలై 26 (ధనాధన్ న్యూస్):జమ్మికుంట పట్టణంలో ఆర్యవైశ్య అవొపా జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో ఆదివారం “అవొపా మెరిట్ అవార్డ్స్–2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘ పెద్దలు, సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీతో పాటు వివిధ పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులను అవొపా సంఘం మెమెంటోలు, ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించింది. సంఘ నాయకులు, అతిథులు వేదికపై విద్యార్థులకు అవార్డులు […]

గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువ

జమ్మికుంట,జూలై 23 (ధనాధన్ న్యూస్): రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులను ప్రమాదం జరిగిన తొలి గంటలోపు (గోల్డెన్ అవర్) ఆసుపత్రికి తరలిస్తే వారి ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్య నిపుణులు తెలిపారు.బుధవారం జమ్మికుంటలో ట్రామా కేర్ (అత్యవసర వైద్యం)పై నిర్వహించిన అవగాహన సదస్సులో న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ దిలీప్ రెడ్డి, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్ పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన […]

ప్రజా భద్రతే లక్ష్యం..పోలీసింగ్‌లో ప్రజల భాగస్వామ్యమే విజయానికి మూలం: సీపీ గౌష్ ఆలం

కరీంనగర్,జూలై 21 (ధనాధన్ న్యూస్): ప్రజల సహకారంతోనే సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమవుతుందని, ప్రజా భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అన్నారు. మంగళవారం ఇల్లందకుంట మండలంలో పర్యటించిన ఆయన ప్రజా భద్రత, పర్యావరణ పరిరక్షణ, రోడ్డు భద్రత, విద్యార్థుల అవగాహన, పోలీసింగ్ బలోపేతానికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.మొదట ఇల్లందకుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా నిఘా వ్యవస్థను సీపీ ప్రారంభించారు. గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజల […]

మత సామరస్యానికి ప్రత్యేకగా రంజాన్ వేడుకలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహన్ ఆధ్వర్యంలో ముస్లిం పాత్రికేయులకు అధికారులకు టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమానికి జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ ములుగు ప్రశాంత్, పట్టణ సీఐ ఎస్ రామకృష్ణ గౌడ్, హాజరై వారు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని అన్నారు. రంజాన్ మాసంలో సూర్యాస్తమయం తర్వాత ముస్లింలు తమ రోజా (ఉపవాసం) విరమించే భోజనాన్ని “ఇఫ్తార్” […]

జై భీమ్ కాలనీలో ఎస్సీ కమిటీ ఏర్పాటు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు జై భీమ్ కాలనీలో యువతలో మంచి మార్పు తీసుకురావడం, సమాజంలో పోటీ తత్వం పెంపొందించడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా ప్రోత్సహించడం లక్ష్యంగా నూతనంగా ఎస్సీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నికైన కౌన్సిలర్ సురంజన్ ని ఘనంగా సన్మానించారు. అదే వేదికపై కమిటీకి ఎన్నికైన సభ్యులను కూడా కౌన్సిలర్ సురంజన్ ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. […]

సెయింట్ థామస్ పాఠశాలలో  గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సెయింట్ థామస్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విభాగం విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే  ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల కరస్పాండెంట్& ప్రిన్సిపల్ ఫాదర్ శరన్ రెడ్డి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూసెయింట్ థామస్ పాఠశాల ప్రారంభం నుండి చుట్టు పక్కల గ్రామాల పేద పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందించి ఎంతో […]