వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించగా, గ్రామం మొత్తం శ్రీరామ నామస్మరణతో మారుమోగింది.


భక్తాంజనేయ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, పట్టు వస్త్రాలు మరియు ముత్యాల తలంబ్రాలు సమర్పించి వేదమంత్రాల నడుమ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, రామాయణంలో వశిష్ట మహర్షి శ్రీరాముడికి నామకరణం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. “రమంతే యోగినో యత్ర రామ” అనే భావం ప్రకారం, యోగులు ఎవరిని ఆస్వాదిస్తారో వారు రాముడని అర్థమని తెలిపారు. శ్రీరామ నవమి రోజున రామ నామస్మరణ చేయడం వల్ల అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని విశ్వసిస్తారని చెప్పారు.


శ్రీరామ నవమి రోజునే సీతారాముల కళ్యాణం మరియు పట్టాభిషేకం జరిగినట్లు విశ్వాసం ఉండడంతో, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ వేడుకలను నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ రోజు ప్రత్యేక పూజలు, కళ్యాణం, రామ మంత్రాల జపం చేయడం ద్వారా వెయ్యిరెట్ల ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారని తెలిపారు.


గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, సీతారాముల చల్లని దీవెనలు ఎల్లప్పుడూ గ్రామంపై ఉండాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో భక్తాంజనేయ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రాయిచెట్టు చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి భాషబోయిన లింగయ్య, ఉపాధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్, కొండి తిరుపతి, కోశాధికారి గంగిశెట్టి శ్రీకాంత్, పాలకవర్గ సభ్యులు బత్తుల జైపాల్, రఘుపతి, గాజరవేని మల్లయ్య, దొంత ధర్మయ్య, సొతుకు రవీందర్, తాళ్ళ చంద్రమౌళి, బడిగ ఆనంద్, సంజీవ్, వేముల శ్రీకాంత్, రాయిశెట్టి ఐలయ్య, గుర్రం కుమారస్వామి పాల్గొన్నారు.

అలాగే సలహాదారులు గాజరవేని వెంకటస్వామి, బొడిగె కొమరయ్య, గ్రామపంచాయతీ సర్పంచ్ రాయిచెట్టి చంద్రయ్య, ఉపసర్పంచ్ సులోచన, వార్డు సభ్యులు వేముల సుమలత, బత్తుల మోహన్, బత్తుల స్రవంతి, ఎర్రల శంకర్, దయ్యాల శ్రీనివాస్, దొంత శ్రీనివాస్ హాజరయ్యారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్‌పీఆర్ స్కూల్ అధినేత గౌరిశెట్టి జగన్మోహన్ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment