పోస్ట్ ఆఫీస్ ఏరియాలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ ఏరియాలో గల వాటర్ ట్యాంక్ సమీపంలో గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఉదయం సుమారు 7 గంటల సమయంలో రోడ్డుపై దాదాపు 40 సంవత్సరాల వయస్సు గల ఓ వ్యక్తి మృతిచెంది పడి ఉన్నాడు.


స్థానికుల వివరాల ప్రకారం, మృతుడు గత 15 రోజులుగా లేబర్ పని చేస్తూ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు తెలిసింది. బుధవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో సూపర్ డ్రెస్సెస్ షాప్ ముందు అతను పడుకొని ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బ తగిలి అతను మృతి చెందినట్టుగా అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment