ఇసుక కొరతతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు బ్రేక్

  • ఆన్‌లైన్ ఆలస్యంతో లబ్ధిదారుల ఆవేదన

సైదాపూర్/ధనాధన్ న్యూస్,మే 25:
ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ… మరోవైపు ఇసుక ఆన్‌లైన్ సమస్యలు లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఇసుక అందుబాటులో లేక ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కొన్ని రోజుల పాటు ఇసుక ఆన్‌లైన్‌లు అందుబాటులో లేకపోవడం, అనంతరం ఒక్కసారిగా భారీ సంఖ్యలో అనుమతులు జారీ కావడంతో ట్రాక్టర్లు, కార్మికులు అందుబాటులో లేక పనులు నిలిచిపోతున్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు. దీంతో నిర్మాణ కార్మికులు కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
“ఇసుక ఆన్‌లైన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగితే పనులు సజావుగా సాగుతాయి. కానీ ఒక్కసారిగా అనుమతులు ఇవ్వడంతో యజమానులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు” అని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు.


ఇక ఒకవైపు ఇసుక సమస్య కొనసాగుతుండగా, మరోవైపు అధికారులు ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకురావడంపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.


ఇది ప్రభుత్వ పరిపాలనా వైఫల్యమా..?
సాంకేతిక లోపాల ప్రభావమా..?
లేక సంబంధిత శాఖల మధ్య సమన్వయ లోపమా..? అనే చర్చ మండల వ్యాప్తంగా సాగుతోంది.

Leave a comment