పేదోడి సొంతింటి కలకు సర్పంచ్ అండ

హుజురాబాద్/ధనాధన్ న్యూస్,ఆగస్టు 30: తల్లిదండ్రులను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో ఒంటరిగా జీవిస్తున్న ఓ నిరుపేద యువకుడి సొంతింటి కలను సాకారం చేసేందుకు గ్రామ సర్పంచ్ మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయించడంతో పాటు, ఇంటి నిర్మాణానికి అవసరమైన అదనపు ఖర్చులను సైతం తానే భరిస్తూ ఉచితంగా ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు సర్పంచ్ ముందుకు రావడం గ్రామంలో అభినందనలు అందుకుంటున్నారు.కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం శాలపల్లి–ఇందిరానగర్ గ్రామంలోని న్యూ […]

నూర్‌బాషా,దూదేకుల ముస్లిం సమాజానికి 2010 జీవో అమలు చేయాలి

హైదరాబాద్/ధనాధన్ న్యూస్: నూర్‌బాషా, దూదేకుల ముస్లిం సమాజ సంక్షేమం కోసం 2010లో జారీ చేసిన జీవోను వెంటనే అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముస్లిం నూర్‌బాషా దూదేకుల బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ జేఏసీ ప్రతినిధులు సీఎం ప్రజావాణికి వినతిపత్రం సమర్పించారు. 2010 మే 3న మైనారిటీ వెల్ఫేర్ శాఖ జారీ చేసిన జీవో ఎంఎస్ నం.125 ప్రకారం నూర్‌బాషా, దూదేకుల ముస్లింల సహకార సంఘాలు, ఫైనాన్స్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసి అమలు చేయాలని జేఏసీ ప్రతినిధులు […]

ములుగు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు: సీఎం రేవంత్ రెడ్డి

ములుగు/ధనాధన్ న్యూస్: తెలంగాణలో ఆడబిడ్డలు, పేదలు, నిరుద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ములుగులో నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సమ్మక్క–సారక్క ఆశీర్వాదంతో ములుగు నుంచే పాదయాత్ర ప్రారంభించామని సీఎం గుర్తుచేశారు. రాష్ట్రంలోని నలుమూలల గూడేలు, పల్లెల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి భరోసా ఇచ్చామని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఇందిరమ్మ […]

భూపాలపల్లిలో మూడు రోజుల సామాజిక చైతన్య నాటకోత్సవాలు

జయశంకర్ భూపాలపల్లి,ధనాధన్ న్యూస్: సామాజిక చైతన్యం, సమానత్వం, మానవతా విలువలతో పాటు మహనీయుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో మూడు రోజుల సామాజిక చైతన్య నాటకోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.ఆగస్టు 14 నుంచి 16 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6:30 గంటలకు భూపాలపల్లి కృష్ణ కాలనీలోని సీఈఆర్ క్లబ్ మినీ ఫంక్షన్ హాల్‌లో నాటక ప్రదర్శనలు జరుగుతాయి. ఆగస్టు […]

లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన బీర్‌పూర్ ఆర్‌ఐ

జగిత్యాల,ధనాధన్ న్యూస్: జగిత్యాల జిల్లా బీర్‌పూర్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) రాహుల్ ఏసీబీ అధికారుల వలలో చిక్కినట్లు సమాచారం. ఓ పని నిమిత్తం లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా దాడి నిర్వహించి ఆర్‌ఐ రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయన వద్ద నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం బీర్‌పూర్ రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే […]

ప్రణవ్ బాబు జన్మదినం సందర్భంగా వాల్ పోస్టర్ ఆవిష్కరణ

జమ్మికుంట, ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ బాబు జన్మదినం సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి ప్రాంతంలో వాల్ పోస్టర్‌ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆవిష్కరించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి నివాసం వద్ద బొంగోని వీరన్న, మర్రి రామ్‌రెడ్డి, పంజాల అజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేశిని కోటి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రణవ్ […]

బాలపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

జగిత్యాల, ధనాధన్ న్యూస్: జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం గ్రామానికి చెందిన నాయకులు గుంటి చిన్నన్న మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]

రాజకీయాలు చేయొద్దు..ప్రజలకు నిజాలు చెప్పండి! మంత్రులకు పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్

కమలాపూర్,ఆగస్టు 10: కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తున్న సమయంలో ఎమ్మెల్యే స్పందిస్తూ, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “అబద్ధాలు చెప్పొద్దు.. నిజాలు మాట్లాడాలి. ఇది రాజకీయాలు చేయాల్సిన వేదిక కాదు. ప్రజలకు […]

ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా: వొడితల ప్రణవ్

జమ్మికుంట,ఆగస్టు 5 (ధనాధన్ న్యూస్): అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు.బుధవారం జమ్మికుంట పట్టణంలోని 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 14, 15, 24, 28 వార్డుల్లో నిర్వహించిన “ప్రతి గడపకు సంక్షేమం – ప్రజల వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కులు” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 22 […]

మాతృత్వానికి మానవత్వం జోడించిన ఓం శ్రీ సాయి హాస్పిటల్

జగిత్యాల, ఆగస్టు 3 (ధనాధన్ న్యూస్): వైద్యం అంటే కేవలం చికిత్స మాత్రమే కాదు.. సేవ, మానవత్వం, ఆప్యాయత కూడా కలిసినప్పుడే అది సంపూర్ణమవుతుంది. ఈ మాటలను నిజం చేస్తూ జగిత్యాల పట్టణంలోని ఓం శ్రీ సాయి హాస్పిటల్ ప్రసూతి సేవల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చే ప్రతి తల్లికి, నవజాత శిశువుకు అవసరమైన వస్తువులతో కూడిన ఉచిత బేబీ కిట్‌ను అందజేస్తూ మాతృత్వానికి మధుర జ్ఞాపకాన్ని అందిస్తోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన కేసీఆర్ […]