
కాటారం,జూలై 7(ధనాధన్ న్యూస్): కాటారం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎమ్మార్పీఎస్ కాటారం ఇంచార్జ్ బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి ఉద్యమ లక్ష్యాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా బెల్లంపల్లి సురేష్ మాదిగ మాట్లాడుతూ, ఎమ్మార్పీఎస్ ఉద్యమం సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతూ నేటి తరానికి దిశానిర్దేశం చేస్తోందన్నారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువుల సంక్షేమంతో పాటు గుండెజబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యసేవలు అందేలా ఉద్యమం చేసి ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలులోకి రావడానికి కృషి చేసిందని తెలిపారు. అలాగే ఎస్సీ ఉపకులాల హక్కుల సాధన, రిజర్వేషన్ల అమలు, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్పన వంటి అంశాల్లో ఎమ్మార్పీఎస్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సామాజిక ఉద్యమాన్ని ప్రారంభించిన రోజే ఆయన జన్మదినం కావడం మాదిగ సమాజానికి గర్వకారణమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మాజీ మండల అధ్యక్షుడు మంథని చిరంజీవి, తూటిచర్ల దుర్గయ్య, కొయ్యాల సత్యం, జిల్లెల్ల నాగరాజు, కొయ్యాల సారయ్య, బొడ్డు లింగయ్య, మంథని శ్రావణ్, మంథని కర్ణాకర్, మంథని రాకేష్, కొలుగురి శ్రీకాంత్, చింతకుంట్ల సదానందం తదితరులు పాల్గొన్నారు.
