ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు

కాటారం,జూలై 30(ధనాధన్ న్యూస్): కాటారం మండలంలో గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయితే, ఈ వర్షాలతో వరి పొలాలు నీటితో నిండిపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు క్రమంగా నిండుతుండటంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.నిరంతర వర్షాల కారణంగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ […]
సమస్యల నిలయంగా మాదారం ఆశ్రమ పాఠశాల

మహాముత్తారం, జూలై 30(ధనాధన్ న్యూస్): మండలంలోని మాదారం ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (డీటీడబ్ల్యూఓ)పై చర్యలు తీసుకోవాలని ఆర్‌వైఏ (RYA), ఏఐఎస్‌ఏ (AISA), కేవీపీఎస్ (KVPS) జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఏడాది కాలంగా మాదారం ఆశ్రమ పాఠశాల అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని ఆరోపించారు. విద్యార్థులకు వంటలో నాణ్యతలేని పామ్ ఆయిల్ వినియోగిస్తున్నారని, దీనివల్ల వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం […]
ఆషాఢ మాస వేళ గారెపల్లిలో గోరింటాకు సంబురాలు

కాటారం,జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారెపల్లి గ్రామంలోని అయ్యప్ప మహిళా గ్రూపు సభ్యులు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం సామూహికంగా గోరింటాకు సంబురాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు గోరింటాకును సేకరించి ఒకరికి ఒకరు చేతులకు పెట్టుకుంటూ ఆటలు, పాటలు, నృత్యాలతో సందడి చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్న మహిళలు ఆషాఢ మాస విశిష్టతను చాటుతూ ఆనందోత్సాహాలతో వేడుకను జరుపుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో గోరింటాకు ధరించడం శుభప్రదమనే […]
పెద్ద వాగులో ప్రమాదకరంగా పెరిగిన వరద ప్రవాహం

మహా ముత్తారం, జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం నిమ్మగూడెం–పెగడపల్లి గ్రామాల మధ్య ఉన్న పెద్ద వాగులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా నిమ్మగూడెం గ్రామపంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు.వాగు దాటే మార్గంలో గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను అడ్డంగా నిలిపి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. నీటి ప్రవాహం తగ్గే వరకు ఎవరూ వాగును దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు […]
భారీ వర్షానికి ఇళ్లు కూలి నిరాశ్రయమైన నిరుపేద కుటుంబం

కాటారం, జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన శ్రీరాముల మల్లయ్య ఇంటి గోడలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోవడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గోడలు కూలిపోవడంతో ఇంటిలో నివసించడం ప్రమాదకరంగా మారి, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ఈ ఘటనపై స్పందించిన ఎర్రగుంటపల్లి గ్రామ యువత, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అత్యవసర ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని […]
పెగడపల్లిలో ఘనంగా శీతలా భవాని జాతర వేడుకలు

పెగడపల్లి,జూలై 28(ధనాధన్ న్యూస్): పెగడపల్లి గ్రామంలో బంజారా సంప్రదాయానికి ప్రతీకగా నిర్వహించే శీతలా భవాని పండుగను మంగళవారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. తండా పెద్ద పర్తి నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని, పాడి పశుసంపద సమృద్ధిగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని శీతలా భవాని అమ్మవారిని ప్రార్థించారు. తమ మొక్కుబడుల మేరకు మేకపోతులను సమర్పించి ప్రత్యేక […]
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు శాస్త్రవేత్త సూచనలు

కాటారం, జూలై 27(ధనాధన్ న్యూస్): ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, సమన్వయకర్త డాక్టర్ కె. మదన్ మోహన్ రెడ్డి సూచించారు.కాటారం రైతు వేదికలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్న మూడు రోజుల […]
రాహుల్ గాంధీ అరెస్టు ఖండిస్తూ మహా ముత్తారంలో కాంగ్రెస్ నిరసన

మహా ముత్తారం,జూలై 23 (ధనాధన్ న్యూస్): ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులను పోలీసులు నిర్బంధించడాన్ని ఖండిస్తూ మహా ముత్తారం మండలం యామన్‌పల్లి చౌరస్తాలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పక్కల సడవలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు […]
పోలంపల్లి గ్రామంలో ఎస్‌బీఐ సంజీవని క్లినిక్ ఆన్ వీల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం

మహముత్తారం/ధనాధన్ న్యూస్, జూలై 19: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పోలంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆదివారం రామ్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్‌బీఐ సంజీవని క్లినిక్ ఆన్ వీల్స్ ప్రాజెక్టు ద్వారా ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో సుమారు 200 మంది గ్రామస్తులు పాల్గొని ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు అవసరమైన వారికి హిమోగ్లోబిన్ (HB), గ్రూప్ రాండమ్ బ్లడ్ షుగర్ […]
కాటారం మండల కేంద్రంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

కాటారం,జూలై 7(ధనాధన్ న్యూస్): కాటారం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎమ్మార్పీఎస్ కాటారం ఇంచార్జ్ బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి ఉద్యమ లక్ష్యాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా బెల్లంపల్లి సురేష్ మాదిగ మాట్లాడుతూ, ఎమ్మార్పీఎస్ ఉద్యమం సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతూ నేటి తరానికి దిశానిర్దేశం చేస్తోందన్నారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువుల సంక్షేమంతో పాటు గుండెజబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యసేవలు అందేలా ఉద్యమం చేసి […]
