ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.2003-04 సంవత్సరం లో పదవ తరగతి చదివిన విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో కలుసుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నాటి పూర్వ విద్యార్థులందరూ ఒకచోట చేరడంతో సందడి నెలకొని ముఖాల్లో వెలుగులు నిండాయి. అనంతరం అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి వారిని ఘనంగా సత్కరించి జ్ఞాపకలను అందజేశారు.20 ఏళ్ల తర్వాత కూడా తమను గుర్తుంచుకొని సత్కరించడం ఎంతో సంతోషం కలిగిస్తుందని ఉపాధ్యాయులు అన్నారు. అనంతరం ఉపాధ్యాయుల చేత పూర్వ విద్యార్థులు మెమొంటో అందుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడానికి కృషిచేసిన నహీం పాషా, సురేష్,లను విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించి సన్మానం చేశారు..ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు మధునయ్య,లక్ష్మయ్య, జగన్మోహన్ రెడ్డి,తిరుపతి,సర్వోత్తమ్ రెడ్డి,వేణు, శ్రీను,పూర్వ విద్యార్థులు నహీం పాషా,సురేష్, సురేందర్ రెడ్డి,వెంకట్ రెడ్డి,నరేష్,గణపతి రాజు,రాములు,మహేందర్,స్వర్ణలత, మాలతి,రజిత,మమత పాల్గొన్నారు.