చేనేత ఐక్యవేదిక సైదాపుర్ మండల అధ్యక్షుడిగా చిదురాల రాజ్ కుమార్ నియామకం

By dhanadhannews.com

చిదురాల రాజ్ కుమార్

సైదాపూర్,ధనాధన్ న్యూస్:

తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యం లో జిల్లా కమిటీ,మండల కమిటీల నియామకం లో భాగంగా కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన నవ యువ కిషోరం సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రులు చిదురాల రాజ్ కుమార్ తెలంగాణ చేనేత ఐక్య వేదిక సైదాపూర్ మండల అధ్యక్షులు గా తెలంగాణ ఐక్యవేదిక చేనేత రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ ఆదివారం నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ
తెలంగాణ చేనేత ఐక్య వేదిక ద్వారా చేనేత కార్మికుల సంక్షేమం కోసం పద్మశాలి జాతి చైతన్యం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.తన నియామకం కోసం కృషి చేసిన రాష్ట్ర ప్రచార కార్యదర్శి జడల చిరంజీవి కి హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు కుడికాల సాయికి కృతజ్ఞతలు తెలిపారు.