ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ కు భారత్ వరల్డ్ రికార్డు అవార్డు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజరాబాద్ పట్టణానికి చెందిన మానవ విలువల పరిరక్షణ సేవ సంస్థ జాతీయ అధ్యక్షులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇంటర్నేషనల్ భారత్ ప్రతిభ రత్న అవార్డు గ్రహీత, ప్రజాకవి, రచయిత సామాజికవేత్త డాక్టర్ నాగుల సత్యం గౌడ్ భారత్ వరల్డ్ రికార్డ్ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డు కమిటీ సత్యం గౌడ్ సామాజిక, ఆధ్యాత్మిక సేవలను సేవలను గుర్తించి, చతుష్టి కలలు, సంక్రాంతి సంబరాలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ప్రపంచ భారత్ […]

రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్ విజయవంతం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండల పరిధిలోని స్థానిక బస్టాండ్ ఏరియా,కొత్తపల్లి మడిపల్లి చౌరస్తా వద్ద శనివారం రోజున,రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బందుకు పిలుపునిచ్చిన యూనియన్ సంఘాలు నేడు  రాష్ట్రవ్యాప్తంగా ఆటోలను బందు చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికులు జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నదని,ఈ పథకం వలన ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి […]

కాకతీయ విద్యార్థుల అ”పూర్వ” కలయిక

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సమాజంలో తల్లీ,తండ్రీ,గురువు దైవంతో సమానమని అంతటి గురువులను కలుసుకోవడం సంతోషంగా ఉందని కాకతీయ విద్యార్థులు అభిప్రాయపడ్డారు.జమ్మికుంట పట్టణంలోని స్వాతి ఫంక్షన్ హాల్ లో కాకతీయ విద్యార్థుల 2008-09 సంవత్సరాలకి చెందిన ఆత్మీయ సమ్మేళనం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకతీయ విద్యాసంస్థల అధినేత ఆవిరినేని సుధాకర్ రావు,జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు,పట్టణ సీఐ వరంగంటి రవి హాజరయ్యారు.అనంతరం వారు మాట్లాడుతూ ఏ వ్యక్తికైనా తల్లిదండ్రులు మొదటి గురువులైతే,విద్యను బోధించిన గురువు రెండవ […]

ఘనంగా మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు జన్మదిన వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ అవరణలో బారాస అధ్యక్షులు సోమరపు రాజయ్య ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు సతీష్ బాబు జన్మదిన వేడుకలను మరియు మండలం కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మాజీ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి,ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కేక్ కట్ చేసిన తరువాత నాయకులూ కార్యకర్తలు స్వీట్ పంపిణి చేశారు.వృద్దులకు పండ్లు పంపిణీ చేశారు.సతీష్ బాబు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని […]

సైదాపూర్ ఎస్ఐగా సిహెచ్ తిరుపతి నియామకం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల ఎస్ఐగా సి.హెచ్ తిరుపతిని నియమించినట్లు కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభిషేక్ మహంతి ఉత్తర్వులు జారి చేశారు.గతంలో సైదాపూర్ ఎస్సై గా విధులు నిర్వహించిన జన్ను ఆరోగ్యంని జమ్మికుంట ఎస్ఐగా బదిలీ చేయగా కరీంనగర్ వీఆర్ లో ఉన్న సిహెచ్ తిరుపతి సైదాపూర్ ఎస్ఐగా నియమించినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

నూతన మార్కెట్ కార్యదర్శి మల్లేశంకు సహకరిస్తాం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా బదిలీపై వచ్చిన ఆర్. మల్లేశంకు సంపూర్ణంగా సహకరిస్తామని జమ్మికుంట అడ్తిదారుల సంఘం, దాడ్వాయిల  సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని అడ్తిదారుల సంఘం భవనంలో ఎర్రబెల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న గుగులోతు రెడ్యా నాయక్ కు వీడ్కోలు పలుకుతూ.. నూతన కార్యదర్శి మల్లేశంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ సెక్రటరీగా సమస్తవంతంగా రెడ్డి నాయక్ పని చేశారని […]

మీరు చల్లని బీర్ ప్రియులా..జర ఇది చూడండి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: బీర్ ప్రియులకు బీర్ తాగాలంటే జంక్ పుడుతుంది. చల్లని బీర్లో హాయిగా దర్శనమిస్తున్నాయి పురుగులు. పక్కా ప్రణాళిక తో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తున్న బీర్లలో పురుగులు దర్శనమివ్వడంతో మద్యం ప్రియులు జడుసుకుంటున్నరు.తాజాగా హుజురాబాద్ పట్టణంలోని ఆర్ఆర్ వైన్స్ లో బీర్ కొని మజాగా తాగుతున్న బీర్ ప్రియునికి పురుగు దర్శనం ఇవ్వడం తో ఖంగు తిన్నాడు.జమ్మికుంట మండలం వెంకటేశ్వర్ల పల్లి కి చెందిన పుల్లూరి సంపత్ హుజురాబాద్ కి పని […]

డయాగ్నొస్టిక్,స్కానింగ్ సెంటర్లు అధిక ఫీజులను నియంత్రించాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి డయాగ్నస్టిక్ సెంటర్,స్కానింగ్ సెంటర్ లు అధిక ధరలు పెంచి  మధ్యతరగతి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న స్కానింగ్ సెంటర్ ల యాజమాన్యలపైన విచారణ చేయాలని పెరిగిన స్కానింగ్ ఫీజులను తగ్గించాలని ఆయనకోరారు.సోమవారం రోజున  అధిక ఫీజులు తగ్గించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ కరీంనగర్ లో విచ్చల విడిగా స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని ఆఫర్ ల  పేరుతో […]

ప్రభుత్వ భూమి కబ్జా పై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే27:జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారంలోని సర్వే నెం. 368 కుంట శిఖం భూమి 0-33 గుంటలు కబ్జాదారుల బారి నుండి కాపాడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి జమ్మికుంట మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ బొంగోని వీరన్న ఫిర్యాదు చేశారు.ధర్మారం గ్రామంలోని సర్వే నెం 368 లో 0-33 గుంటల కుంట శిఖం భుమి ఉండగా మధ్యలో నుండి 1965లో  ఆర్&బి రోడ్డు జమ్మికుంట నుండి వావిలాల వరకు పోయింది.అప్పటి నుండి ఆ కుంట ఖాళీగా […]

భూ ఆక్రమణలపై కలెక్టర్ కు పిర్యాదు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే25:సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని మాజీ సర్పంచ్ తన కుటుంబ సభ్యుల పేరున అక్రమ పట్టా చేసి ఆక్రమించుకున్నాడని గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే గ్రామ శివారు లోని మసీదు దగ్గర భూమిని పూర్వం అంబేద్కర్ భవనం,ప్రాథమిక పశువుల వైద్యశాలకు కేటాయించిన  భూమిని ఇందిరా సుధీర్ కుమార్ గౌడ్ సర్పంచ్ పదవిలో కొనసాగుతూ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి సర్వేనెంబర్ 399/ఆ  లో సుమారు […]