విత్తన డీలర్లతో వ్యవసాయ అధికారుల సమావేశం

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే25:వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏడీఏ జీ.సునిత మాట్లాడుతూ విత్తన డీలర్లు అందరూ కూడా అనుమతి ఉన్న విత్తనాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని,విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతి రైతుకి బిల్లు తప్పనిసరిగా అన్ని వివరాలతో ఇవ్వాలని,విత్తన అమ్మకాల వివరాలు రైతు వారీగా రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపారు.రైతుకు నష్టం కలిగేలా ఎలాంటి విత్తన అమ్మకాలు,ఎరువులు,పురుగుమందుల అమ్మకాలు చేయకూడదని,ఏదైనా […]
ఉచిత వైద్య శిబిరానికి విశేషా స్పందన.

ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)మే23:మర్రిపెల్లిగూడెంలో అమృత హాస్పిటల్ మరియు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట వైద్యులు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.ఈ వైద్య శిబిరానికి సుమారుగా 400 ల మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి సుమారుగా 80000 రూపాయల విలువగల మందుల ఉచితంగా పంపిణీ చేయడం జరిగినది. ఇట్టి వైద్య శిబిరంలో సూపర్ స్పెషలిటీ వైద్యులు డా.భావనా రెడ్డి నరాల వైద్య నిపుణులు,డా.ప్రశాంత్ రెడ్డి గుండె వైద్య నిపుణులు,డా.శ్రీనివాస్ జనరల్ ఫిజిషియన్,డా.విజేత […]
వేసవి తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలను సీజ్ చేయాలి

ధనాధన్ న్యూస్ మే23: బోర్డ్ నిబంధనలను ఉల్లంగిస్తూ అక్రమంగా నడిపిస్తూ వేసవి తరగతులు నిర్వహిస్తున్న కరీంనగర్ నగరంలోని ప్రైవేట్ కళాశాలల ను సీజ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని, ఇంటర్ బోర్డ్ నిబంధనలను భేకాతరు చేస్తున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్ బోర్డ్ విఫలం చెందిందని బోనగిరి మహేందర్ బ్రాహ్మణపల్లి యుగంధర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు బోనగిరి మహేందర్, ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణ పెళ్లి యుగంధర్ మాట్లాడుతూ […]
ఉపాధిహామీ కూలీలకి యోగ శిక్షణ

మహాముత్తారం(ధనాధన్ న్యూస్)మే22:మహాముత్తారం మండలంలోని పెగడపల్లి గ్రామంలో జాతీయ ఉపాధిహామీ కూలీలకి జాతీయ యోగ శిక్షణ అధ్యాపకుడు వావిల్ల కిష్టయ్య శిక్షణ ఇస్తూ యోగ వలన జరిగే ప్రయోజనాలను కూలీలకి వివరించడం జరిగింది.ప్రతిరోజూ ఐదు నిమిషాలు ధ్యానం చేయడం వలన మనిషిని పట్టిపిడిస్తున్న సైకో సోమటిక్ వ్యాధులు మానసిక వ్యాధులు భయం, కోపం,భద్రత భావము మొదలైన వ్యాధులను నయం చేయవచ్చునని,కరోన,గుండె సంబంధిత వ్యాధులు ధ్యానం తో నయం చేయవచ్చునని ఉపాధి హామీ కూలీలకి పని సామర్ధ్యమును పెంచడంతో పాటు […]
అంగ రంగవైభవంగా ద్వితీయ వార్షికోత్సవం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే15:జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.వేడుకల్లో భాగంగా మంగళవారం నాడు ఉదయం విశ్వక్ సేన ఆరాదన,పుణ్యవచనం,రక్షా బంధనం,నవ కలుష స్థపనం,మహా హోమం తో ప్రారంభమై సాయంత్రం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.ఈ కళ్యాణ మహోత్సవం అధ్యంతం వైభవంగా,కన్నుల పండుగగా జరిగింది.రాములోరి కల్యాణానికి దాతలు పట్టు వస్త్రాలు,పూలు సమర్పించారు.అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.కళ్యాణ వేడుకతో గ్రామమంతా రామనామస్మరణతో మారూమ్రోగింది.ప్రతీ […]
ఎంపీగా వినోద్ కుమార్ ను గెలిపిస్తే మీ తోడుగా మేమిద్దరం ఉంటాం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే06:తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని మోసగాడని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హుజరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన రోడ్ షో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు.ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఎవరికి అమలు చేశారో కూడా చెప్పాలన్నారు.మహిళలకు 2500 పెన్షన్, […]
మోదీ గుండెలో బండికి ప్రత్యేక స్థానం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే06:ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుండెలో బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక స్థానం ఉందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై అన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని చెప్పారు.బండి సంజయ్ చేసిన పోరాటాలు దేశానికే ఆదర్శమయ్యాయన్నారు.సంజయ్ పాదయాత్ర స్పూర్తితోనే తమిళనాడులో తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు.జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు […]
తెలంగాణ కు మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 30:దేవుడు గుడిలో ఉండాలి ,భక్తి గుండెల్లో ఉండాలి అంతేకానీ రాముని పేరు చెప్పుకొని హిందూ సాంప్రదాయానికి మాయని కి మచ్చలు వచ్చే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని ,అయోధ్య రామాలయం పూర్తికాకముందే రాములోరి అక్షింతలను 15 రోజుల ముందు పంపిణీ చేసి హిందూ సాంప్రదాయాలను మంటగలిపిన ఘన చరిత్ర ప్రధాని మోడీకే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు.మంగళవారం రోజు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ […]
రేపే సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభ

న్యూస్ డెస్క్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్29:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఎన్నికైన తర్వాత మొదటిసారి హుజురాబాద్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి రేపు రానున్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా జమ్మికుంట పట్టణంలో దాదాపు లక్ష మంది జనాభా తో ఏర్పాటు చేస్తున్న సభలో పాల్గొననున్నారు.తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా ఉన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయలేదు.కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగురావేయడమే లక్ష్యం గా రేపటి సభ లో సీఎం […]
నూజివీడు సీడ్స్ నూతన వంగడం క్షేత్ర ప్రదర్శన

రామడుగు(ధనాధన్ న్యూస్)ఏప్రిల్25:రామడుగు మండలంలోని వెధిర గ్రామంలో బుధవారం రోజున నూజివీడు సీడ్స్ కంపెనీ వరి పుష్కల్ (ఎన్ పి 9153) దొడ్డు రకమును గ్రామానికి చెందిన వాసు రావు వ్యవసాయ పొలంలో రైతులతో క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కంపెనీ సీనియర్ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ పుష్కల్ వరి వంగడం మిగతా రకాల వరి వంగడాల కంటే నాలుగైదు క్వింటాలు అధిక దిగుబడి వస్తుందని అన్నారు.ఈ రకం వానాకాలం,యాసంగి రెండు కాలాలకు […]
